Nizamabad

News April 20, 2024

నిజామాబాద్ జిల్లాలో పిడుగుపాటు..నలుగురికి గాయాలు

image

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో ధర్మోర గ్రామంలో నిన్న సాయంత్రం పిడుగు పడింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన శివ, బన్నీ, నారాయణ, శంకర్ వడ్లు ఆరబెడుతుండగా వారిపై పిడుగు పడింది. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శివ, బన్నీ హనుమాన్ మాల ధరించారు. వారిద్దరికి బలమైన దెబ్బలు తగిలినట్లు స్థానికులు తెలిపారు.

News April 20, 2024

కామారెడ్డి : హోం ఓటింగ్ అధికారులు అవగాహన కలిగిఉండాలి: కలెక్టర్

image

హోం ఓటింగ్ నిర్వహణపై పోలింగ్ అధికారులకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో హోమ్ ఓటింగ్ పోలింగ్ బృందాలకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోస్టల్‌బ్యాలెట్ సౌకర్యాన్ని 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు వినియోగించుకోవాలని కోరారు.

News April 19, 2024

నిజామాబాద్: ఆ రైతుల అభివృద్ధికి పాటుపడతాను: అర్వింద్

image

మామిడి, చెరుకు, వరి పంటలు సాగుచేసే రైతుల అభివృద్ధికి పాటుపడతానని నిజామాబాద్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎంపీ అర్వింద్ ధర్మపురి హామీ ఇచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల మార్కెటింగ్ సదుపాయాలు, మద్దతు ధర కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పారు.

News April 19, 2024

NZB: అమర్‌నాథ్ యాత్రికులకు సూచన

image

అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్న యాత్రికులు తమకు కావాల్సిన మెడికల్ సర్టిఫికెట్ కొరకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్(GGH)లో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపునకు హాజరుకావాలని GGH సూపరింటెండెంట్ డా.ప్రతిమా రాజ్ తెలిపారు. యాత్రికులు ట్రావెల్ ఏజెన్సీస్, ఇతర ఏజెన్సీస్ వాళ్ల మాటలు నమ్మొద్దన్నారు. సర్టిఫికెట్ కోసం హాస్పిటల్ రూమ్ నెంబర్ 44లో, ఫోన్ నెంబర్: 8247853678 ను సంప్రదించాలని ఆమె సూచించారు.

News April 19, 2024

NZB: సీఐ, ఎస్ఐలకు మానవ హక్కుల ట్రిబ్యునల్ నోటీసులు

image

డిచ్పల్లి సీఐ, జక్రాన్ పల్లి ఎస్ఐకి మానవ హక్కుల ట్రిబ్యునల్ నోటిసులు జారీ చేసింది. జక్రాన్ పల్లికి చెందిన జగడం మోహన్, భూషణ్, భాస్కర్ తమ సొంత భూమి విషయంలో గ్రామాభివృద్ధి కమిటీ వేధింపులపై జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే గ్రామాభివృద్ధి కమిటీ తరఫున డిచ్పల్లి సీఐ, జక్రాన్ పల్లి ఎస్సైలు బాధితులను వేధింపులకు గురి చేశారు. దీంతో బాధితులు మానవ హక్కుల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.

News April 19, 2024

NZB: 17 సార్లు ఎన్నికలు..ఒక్కసారే మహిళకు అవకాశం

image

నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో 1967లో మాత్రమే స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 11 సార్లు కాంగ్రెస్, 3 సార్లు TDP, TRS, BJP ఒకసారి విజయం సాధించాయి. 2014లో TRS అభ్యర్థిగా కవిత ఎన్నికయ్యారు. 2004లో పునర్విభజన అనంతరం జగిత్యాల, కోరుట్లు నియోజకవర్గాలు నిజామాబాద్‌లో వచ్చి చేరాయి.

News April 19, 2024

జాక్రాన్ పల్లి: లారీని ఢీకొన్న బైక్.. ఒకరి మృతి 

image

నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహావీర్ తండాకు చెందిన జాదవ్ సుధాకర్(35), అతని భార్యతో కలిసి గురువారం ద్విచక్రవాహనంపై డిచ్పల్లికి వెళ్తున్నారు. జక్రాన్పల్లి జాతీయ రహదారిపై బ్రేక్ డౌన్ కారణంగా నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టగా.. సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన అతని భార్యను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుపతి తెలిపారు.

News April 19, 2024

NZB: మీకు తెలుసా?.. ఆ ఇద్దరు హ్యాట్రిక్ వీరులు

image

NZB ఎంపీ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వరుసగా 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1952లో హరీశ్ చంద్ర హెడా కాంగ్రెస్ తరపున మెుదటి సారి ఎంపీగా అడుగు పెట్టారు. 1957, 1964లో వరుస విజయాలతో 3 సార్లు ఎంపీ అయ్యారు. మళ్లీ కాంగ్రెస్ తరపున 1971, 1977,1980 MP ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ నుంచి గడ్డం గంగారెడ్డి కూడా మూడు సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ ఆయనకు హ్యాట్రిక్‌కు మధ్యలో బ్రేక్ పడింది.

News April 19, 2024

తాడ్వాయి: ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్

image

తాడ్వాయి మండలం నందివాడ గ్రామం జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దశరథ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు డీఈవో ఎస్.రాజు గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. ఫైనాన్స్, చిట్టీల పేరిట ప్రజల నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేయడం, కస్టమర్లను బెదిరించిన ఘటనలో అతడిపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

News April 19, 2024

నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ BJP కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం

image

నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ BJP కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.