India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భవనంలోని మూడో అంతస్తు పైనుంచి పడి మృతి చెందిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. పట్టణంలోని అశోక్‌నగర్‌లో ఉన్న ఓ భవనం మూడో అంతస్తు నుంచి పడి రాజేశ్వరి(50) మృతి చెందింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న వ్యక్తిపై రాళ్లతో దాడి చేసిన ఘటన భీమ్‌గల్‌లో జరిగింది. బెజ్జోర వద్ద ఇసుక ట్రాక్టర్లను మాజీ ఎంపీపీ మహేశ్, మహేందర్‌తో పాటు కొందరు అడ్డుకున్నాడు. ఇసుక వ్యాపారులు వారిపై దాడి చేయడంతో అందరూ పారిపోగా మహేందర్ వారికి దొరికాడు. అతడిపై రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు.
జిల్లాలో చిన్నారుల కిడ్నాప్‌లు కలకలం రేపుతున్నాయి. తాజాగా NZB GGHలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. కాగా జనవరి 30న మాలపల్లికి చెందిన ఏడేళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి HYDలో విక్రయించేందుకు చూశారు. ఫిబ్రవరిలో ఆర్మూర్ బస్టాండ్‌లో ఓ మహిళ ఏడేళ్ల బాలుడిని, అదే నెల 4న నగర శివారులో ఓ దంపతులు రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు. అయితే ఈ కేసులను పోలీసులు ఛేదించి చిన్నారులను కాపాడారు.
GGHలో శనివారం మూడేళ్ల బాలుడు<<13667747>> కిడ్నాప్<<>> అయిన విషయం తెలిసిందే. ఆ కేసును పోలీసులు 12 గంటల్లో ఛేదించారు. కేసు నమోదు చేసిన పోలీసులు 6 బృందాలుగా విడిపోయి గాలించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు ఆర్మూర్ మీదుగా కరీంనగర్ వైపు వెళ్లినట్లు గుర్తించి మెట్‌పల్లి వద్ద సా.4గంటలకు అదుపులోకి తీసుకున్నారు. కాగా తన చెల్లికి పిల్లలు లేకపోవడంతో తన స్నేహితుడితో కలిసి ఈ కిడ్నాప్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.
నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయని అయిన పోచారం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లింగంపేట, గుండారం పెద్ద వాగుల ద్వారా ప్రాజెక్టులోకి స్వల్ప వరద ప్రవాహం కొనసాగుతుందని నీటిపారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్ట్ నిండుతుందని రైతులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.
*శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 18,275 క్యూసెక్కుల ఇన్ ఫ్లో * NZB జిల్లా ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ * పాఠశాల సమయాల్లో మార్పు: నిజామాబాద్ DEO *NZB: ఏడాదిన్నరలో రోడ్డు ప్రమాదాల్లో 550 మంది మృతి * రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: మంత్రి జూపల్లి * నిజామాబాద్: ‘నిర్లక్ష్యం, బాధ్యతరాహిత్యమే రోడ్డు ప్రమాదాలకు కారణం’ * GGHలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతం
నిజామాబాద్ GGHలో కిడ్నాప్ అయిన మూడేళ్ల బాలుడు అరుణ్ కథ సుఖాంతం అయ్యింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో బాలుడిని పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే అతణ్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఆర్మూర్‌కు చెందిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. కాగా జిల్లా ఆస్పత్రిలో తన తండ్రి పక్కన నిద్రిస్తున్న బాలుడిని ఇద్దరు నిందితులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.
NZB జిల్లాలో గడిచిన ఏడాదిన్నరలోనే రోడ్డు ప్రమాదాలలో 550 మంది ప్రాణాలు కోల్పోయారని CP కల్మేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటుబెల్టు ధరించకపోవడం, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ టేక్, సెల్ ఫోన్ డ్రైవింగ్, సామర్థ్యానికి మించి ఎక్కించుకోవడం, రాంగ్ సైడ్ వెళ్లడం, సిగ్నల్స్ జంప్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని NZB జిల్లా జడ్జి సునీత కుంచాల, సీపీ కల్మేశ్వర్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ సౌజన్యంతో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘మైనర్ డ్రైవింగ్- డ్రంక్ అండ్ డ్రైవింగ్’ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.
నిజామాబాద్ జిల్లా మెండోరాకు చెందిన మాకురి వినోద్ బతుకుదెరువుకోసం బెహరన్ దేశం వెళ్లాడు. కాగా ఈనెల17న డ్యూటీలో ఉండగానే ప్రమాదవశాత్తు మృతి చెందాడు. వినోద్ మృతదేహన్ని త్వరగా స్వదేశానికి తీసుకు వచ్చేలా చూడాలని అతని భార్య యమున, పిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.