Nizamabad

News April 18, 2024

కామారెడ్డి: పొద్దంతా ఎండ.. రాత్రికి వాన

image

కామారెడ్డి జిల్లాలో బుధవారం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనం రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు. కామారెడ్డి కలెక్టరేట్ ప్రాంతంలో 11 మిల్లీమీటర్లు, బీబీపేటలో 3.5, సదాశివనగర్ లో 3.3, పాతరాజంపేట 3, మాచారెడ్డిలో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని మిగితా ప్రాంతాల్లో 41 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.

News April 18, 2024

NZB: ఈ నెల 19న BRS ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి నామినేషన్

image

నిజామాబాద్ పార్లమెంట్ BRS ఎంపీ అభ్యర్థిగా ఈ నెల 19న మధ్యాహ్నం 12.05 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరు కానున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల BRS శ్రేణులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

News April 17, 2024

మాచారెడ్డిలో షార్ట్‌సర్క్యూట్‌‌తో గుడిసె దగ్ధం 

image

మాచారెడ్డి మండలంలోని హెల్పుగొండ గ్రామంలో బుధవారం షార్ట్‌సర్క్యూట్‌‌తో మొగుళ్ల లక్ష్మీకి చెందిన గుడిసె దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో రూ.50వేల వరకు ఆస్తి నష్టం జరిగిందన్నారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.

News April 17, 2024

కామారెడ్డి: బాల సదనం నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యం

image

కామారెడ్డిలోని బాల సదనం నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యం అయ్యారు. బాలసదనంలో ఉంటున్న గంగోత్రి (11), నజియా (7) పట్టణంలోని హరిజనవాడలో ఉన్న జడ్పీహెచ్ఎస్‌లో చదువుతున్నారు. నిన్న సదనం నుంచి వెళ్లిన బాలికలు తిరిగి రాలేదని సదనం ఇన్‌ఛార్జ్ గంగుబాయి తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 17, 2024

నిజామాబాద్: సీతారాముల కళ్యాణంలో దిల్ రాజు దంపతులు

image

నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలో ఉన్న ఇందూరు తిరుమల క్షేత్రంలో బుధవారం నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు దంపతులు పాల్గొన్నారు. సత్యం స్వామి అర్చకత్వంలో శ్రీరామ నవమి వేడుకలు, సీతారాముల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నర్సింహ రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు.

News April 17, 2024

కామారెడ్డి: ఆకుపై శ్రీ రాముని చిత్రం

image

శ్రీ రామనవమి సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు బాస బాల్ కిషన్ ఆకుపై శ్రీ రాముని చిత్ర పటం వేశాడు. దీంతో పాటు జై శ్రీ రామ్ నామం 12 భాషల్లో రాశాడు. దీన్ని చూసిన వారు బాల్ కిషన్‌‌కు అభినందనలు తెలియజేశారు. కాగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్ కిషన్ చిత్ర కళ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పలు రకాల వినూత్న చిత్రాలు గీసి ప్రశంసలు పొందాడు.

News April 17, 2024

నిజామాబాద్: తుఫాన్‌ను ఢీకొని ఒకరి మృతి

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్ కారు ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని గౌతమ్ నగర్‌కు చెందిన దమ్ము పాల్ స్నేహితులు ఉమాకాంత్, వినోద్‌తో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. బైపాస్ దాటే క్రమంలో అర్సపల్లి నుంచి వేగంగా వచ్చిన తుఫాన్ బైక్‌ను ఢీకొట్టడంతో ఈప్రమాదం జరిగింది.

News April 17, 2024

జహీరాబాద్‌లో త్రిముఖ పోరు?

image

ZHB లోక్‌సభ స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన ZHB పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికీ 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్ (సురేశ్ షెట్కర్), 2014, 2019లో BRS (బీబీ పాటిల్) అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సారి CONG, BJP, BRS అభ్యర్థులు ఎవరికి వారు ఎత్తులు పైఎత్తులు వేస్తూ ప్రచారం చేస్తుండడంతో సార్వత్రిక పోరు ఆసక్తి రేపుతోంది. 

News April 17, 2024

సివిల్స్‌లో సత్తాచాటిన కామారెడ్డి వాసి

image

జాతీయస్థాయి సివిల్స్ ఫలితాల్లో కామారెడ్డి పట్టణానికి చెందిన విద్యార్థి రజనీకాంత్ ర్యాంకు సాధించారు. జిల్లా కేంద్రానికి చెందిన రజనీకాంత్ జాతీయస్థాయి సివిల్ ప్రవేశ పరీక్ష రాశారు. ఆయన జాతీయస్థాయిలో574 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ.. ఐపీఎస్ అధికారి కావాలన్నదే తన లక్ష్యమన్నారు.

News April 17, 2024

కామారెడ్డి: గ్రూప్1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

image

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా జూన్ 9 న నిర్వహించే గ్రూప్-1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించుటకు అధికారులు ముందస్తు ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశమందిరంలో టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్-1 పరీక్షల నిర్వహణ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరపాలన్నారు.