Nizamabad

News April 17, 2024

NZB: రికార్డ్‌స్థాయిలో 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

image

రాష్ట్రంలో ఈసారి యాసంగిలో ఇప్పటివరకు రికార్డ్‌స్థాయిలో 2.69లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దేవేంద్రసింగ్ జవాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడుతూ.. అవసరమైతే ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కేంద్రంలో సరిపడా టర్పైన్లు, ఇతర సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు.

News April 16, 2024

కామారెడ్డి: ఆరుగురు మృతికి కారణమైన డ్రైవర్‌కు ఐదేళ్ల శిక్ష

image

ఆరుగురు మృతికి కారణమైన డ్రైవర్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కామారెడ్డి మొదటి అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ తీర్పు చెప్పారు. ఫకీర్ ఇస్మాయిల్ అనే డ్రైవర్ 01.10.2016న పిట్లం మండలం కారేగాం గ్రామంలోని పిల్లివాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ప్రమాదం జరగవచ్చని తెలిసి కూడా నీటిలో నుండి కారును డ్రైవ్ చేసి ఆరుగురి మృతికి కారణమైనట్లు రుజువవ్వగా శిక్ష వేశారు.

News April 16, 2024

కాంగ్రెస్‌వి దొంగ వాగ్దానాలు: ఎంపీ అర్వింద్

image

కాంగ్రెస్ దొంగ వాగ్దానాలు చేసి గెలిచిందని.. అధికారంలోకి వచ్చాక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని ఎంపీ అరవింద్ ధర్మపురి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ సైతం ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి కనిపించకుండా పోయారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాదిరి బీజేపీ దొంగ వాగ్దానాలు ఇవ్వదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేపార్టీ బీజేపీ అన్నారు.

News April 16, 2024

నిజామాబాద్: బీఆర్ఎస్ సమన్వయకర్తల నియామకం

image

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ సమన్వయకర్తలను నియమించింది. కోరుట్లకు ఎల్. రమణ, ఆర్మూర్ కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, నిజామాబాద్ అర్బన్ ప్రభాకర్‌రెడ్డి, బాల్కొండ ఎల్.ఎం.బీ రాజేశ్వర్, నిజామాబాద్ రూరల్ వి.గంగాధర్ గౌడ్, బోధన్ డి.విఠల్‌‌రావులను నియమించింది.

News April 16, 2024

NZB: కాంగ్రెస్ పార్టీలోకి కీలక నేత

image

BRSకు మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేతలు BRSకు గుడ్ బై చెప్పి రేవంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. BRS నేత, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, నిజామాబాద్‌కు చెందిన మాజీ MLC రాజేశ్వర్ BRS పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు హైద్రాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు.

News April 16, 2024

సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆగస్టు వరకు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారో, ఉండరో అన్నారు. తాజా సర్వేల ప్రకారం రాష్ట్రంలో తాము (బీజేపీ) 12 సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. అదే జరిగితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఇక శ్రీరాముడే రక్షించాలని పేర్కొన్నారు.

News April 16, 2024

నవీపేట్: గుండెపోటుతో అధ్యాపకురాలు మృతి

image

నవీపేట్ మండలంలోని ఆదర్శ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న జరీనా పిర్దోస్ (48) సోమవారం గుండెపోటుకు గురై మృతి చెందినట్లు పాఠశాల ప్రిన్సిపల్ నవీన్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. లెక్చరర్ మృతిపై ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News April 16, 2024

వర్ని: జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య

image

వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చందూర్ మండల కేంద్రానికి చెందిన మమ్మాయి గిరి (46) అనే వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై కృష్ణకుమార్ తెలిపారు. మద్యానికి బానిసైన గిరి అప్పులు చేశారు. అప్పులను తీర్చలేక చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్టు పేర్కొన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు..

News April 16, 2024

NZB: కూరగాయలు అమ్మిన ఎంపీ అభ్యర్థి

image

బీర్కూర్ మండలం మిర్జాపూర్ గ్రామంలో సోమవారం బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని కూరగాయలు అమ్ముతున్న వ్యక్తి వద్దకు వెళ్లిన బీబీ పాటిల్ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన కూరగాయల షాపులో కొద్దిసేపు కూర్చున్నారు. కూరగాయలు కొనడానికి వచ్చిన వారిని బీజేపీకి ఓటు వేయమని కోరారు.

News April 16, 2024

KMR: రూ. కోట్లలో మోసం.. చిట్ ఫండ్ నిర్వాహకుల అరెస్ట్

image

కామారెడ్డిలోని SLVS చిట్ ఫండ్ కంపెనీ నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు CI చంద్ర శేఖర్ రెడ్డి వెల్లడించారు. SLVS చిట్ ఫండ్ కంపెనీ పేరిట మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు అందిందని CI పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టి కామారెడ్డితో పాటు పలు ప్రాంతాల్లో రూ. కోట్లకు పైగా మోసం చేసినట్లు తేలిందని తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే KMR పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.