India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర వ్యాప్తంగా DSC పరీక్షలు గురువారం ప్రారంభమై ఆగస్టు 7వరకు జరగనున్నాయి. కాగా జిల్లాలో 640 పోస్టులకు 7వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిజామాబాద్‌లోని నాలెడ్జి పార్క్ స్కూల్‌లో 2,600 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందే రావాలని అధికారులు సూచించారు. >> ALL THE BEST
పట్టణంలోని వినాయక్ నగర్‌లో బుధవారం <<13645139>>హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. బిహార్‌కు చెందిన ఆనంద్(23) ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి బయటికి వెళ్లిన అతడు బుధవారం శవమై కనిపించాడు. ఆనంద్ పర్మిట్ రూంలో మద్యం మత్తులో ముగ్గురు యువకులతో గొడవ పడ్డినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. వారిలో ఒకరు అతడిపై దాడి చేయడంతో ఆనంద్ మృతి చెందినట్లు ఎస్ఐ పాండేరావు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం విడుదల చేసే రుణమాఫీ నిధులతో ఉమ్మడి NZB జిల్లాలో 94,010 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా రైతుల జాబితాను రూపొందించారు. తొలి విడతగా NZBలో 44,469, KMRలో 49,541 మంది రైతుల ఖాతాల్లో రూ.లక్ష జమకానున్నాయి. ఈ నెలాఖరులోపు రూ.1.5లక్షల వరకు ఉన్న రుణాలు, ఆగస్టులో రూ.2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయనున్నారు.
ఆగ్రోస్ సంస్థ ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా పనులు చేస్తానని రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో బాలరాజు మాట్లాడుతూ.. పోచారం శీనన్న నాయకత్వంలో బాన్సువాడ నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఈ అభివృద్ధి కొనసాగుతుందన్నారు. కొంతమంది హైదరాబాద్‌లో కూర్చొని గాలి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతిచెందిన ఘటన బుధవారం మూడవ టౌన్ పరిధిలో జరిగింది. నగరంలోని గాయత్రినగర్ చెందిన షేక్ మెహబూబ్(49) గౌతంనగర్ నూతన భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న మూడవ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం విడుదల చేసే రుణమాఫీ పథకంలో నిజామాబాద్ జిల్లాలో 44,469 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా రైతుల జాబితాను రూపొందించారు. కాగా తొలి విడతగా రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు నిధుల విడుదల చేయనున్నారు. ఈ నెలాఖరులోపు రూ.1.5లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ, ఆగస్టులో రూ. 2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయనున్నారు.
పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామానికి చెందిన యువ దంపతులు అనిల్ కుమార్, శైలజ ఆత్మహత్యకు కారకురాలైన మృతురాలి పిన్ని కంకోళ్ల లక్ష్మిని బుధవారం అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. యువ దంపతులు సోమవారం రాత్రి నవీపేట్ శివారులో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడిస్తూ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
నిజామాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయి ఆ పెన్షన్ తో పాటు అసరా పెన్షన్ కూడా తీసుకుంటున్నట్లు 410 మందిని అధికారులు గుర్తించారు. వీరికి ఆగస్టు నెల నుంచి అసర పెన్షన్ నిలిపివేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఇప్పటి వరకూ వారు రూ. 2.68 కోట్లు అందుకున్నట్లు వారు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం వారికి పెన్షన్ రికవరీ నోటీసులు జారీ చేయడం లేదని అధికారులు తెలిపారు.
నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో గుర్తు తెలియని దొంగలు మంగళవారం అర్ధరాత్రి దాటాక తాళం వేసిన మూడిళ్లలో భారీగా బంగారం, నగదు అపహరించుకుపోయారు. సుమారు 20 తులాల బంగారం, 18 తులాల వెండి, రూ.11 లక్షల నగదు అపహరించినట్లు బాధిత కుటుంబాలు తెలిపారు. కాగా చోరీ ఆనవాళ్లు తెలియకుండా దొంగలు ఇండ్లలో కారంపొడి చల్లి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బ్యాంక్ మేనేజర్ పరారైన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని RR చౌరస్తాలో ఉన్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్‌పై 4వ టౌన్ పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. రాకేశ్ అనే వ్యక్తికి సంబందించిన రూ.20లక్షల చెక్కులను అజయ్ తన ఖాతాలో వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా నిందితుడు అజయ్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.