Nizamabad

News April 11, 2024

నిజామాబాద్ నగర మేయర్ భర్త బైండోవర్

image

నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త చంద్రశేఖర్‌ను పోలీసులు బైండోవర్ చేశారు. దండు చంద్రశేఖర్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని NZB శివారు ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వకాల్లో భాగస్వాములుగా ఉన్నారని పోలీసులు బుధవారం నిజామాబాద్ దక్షిణ మండల నాయబ్ తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. NZB నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న దండు చంద్రశేఖర్‌ను పోలీసులు రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ చేశారు.

News April 11, 2024

నిజామాబాదీలు నేడే రంజాన్

image

రంజాన్ మాసంలో 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులు నేడు రంజాన్ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. నెలవంక దర్శనం ఇవ్వడంతో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు మసీదులు, ఈద్గా మైదానాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇవాళ ఉదయాన్నే ముస్లింలు ఈద్గాలకు చేరుకోనున్నారు. నమాజ్, ప్రత్యేక ప్రార్థనలతో మసీదులు, ఈద్గాలు ముస్లింలతో కిటకిటలాడనున్నాయి.

News April 11, 2024

నిజామాబాద్: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వేసవి తీవ్రతలో నియమనిష్ఠలతో నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

News April 10, 2024

బోధన్: రాహిల్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు

image

పంజాగుట్ట రోడ్డు ప్రమాదంలో అరెస్టైన బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మహ్మద్ అమీర్ రాహిల్‌కు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు తీర్పునిచ్చింది. అంతే కాకుండా పోలీస్ కస్టడీ పిటిషన్‌ను కూడా కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, రాహిల్‌కు హైకోర్టు ఆదేశాలను పాటించాలని రూ.20 వేలు, 2 పూచీకత్తులు సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

News April 10, 2024

కామారెడ్డి: రూ.5.45 లక్షల పట్టివేత

image

ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కామారెడ్డి జిల్లాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఆధారాలు లేని నగదును సీజ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే బుధవారం జిల్లాలోని నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి చెక్‌పోస్ట్ వద్ద SI సుధాకర్ అధ్వర్యంలో తనిఖీలు చేపడుతుండగా రూ. 5.45 లక్షల నగదు పట్టుబడింది. నగదుకు సంబంధించిన ఆధారాలు, లెక్కలు చూపించకపోవడంతో డబ్బులను పోలీసులు సీజ్ చేశారు.

News April 10, 2024

ఫోన్ మాట్లాడొద్దన్నందుకు ఇంటి నుంచి వెళ్లిపోయింది

image

ఫోన్ మాట్లాడొద్దన్నందుకు ఓ బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన కాచిగూడలో జరిగింది. పోలీసుల ప్రకారం.. NZBకి చెందిన బాలాజీ రావు కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం ఈనెల 8న కాచిగూడ, సుందరనగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో అతడి కుమార్తె గౌరీ(13) సెల్ ఫోన్ అతిగా మాట్లాడుతుండడంతో తల్లి, సోదరుడు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది.

News April 10, 2024

ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

image

నిజామాబాద్ ఎంపీ అరవింద్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ 2019లో తెస్తే కాంగ్రెస్ లొల్లి పెట్టిందన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముస్లింలకు సైతం పౌరసత్వం ఇవ్వాలని ఆందోళన చేశాడని, ఇప్పుడు సీఏఏ అమలు చేస్తుంటే ఎన్నికలు ఉన్నాయని హిందువుల ఓట్ల కోసం జీవన్ రెడ్డి మౌనంగా ఉన్నాడన్నారు. మరి ముస్లింలకు పౌరసత్వం ఇస్తే ప్రత్యేక ముస్లిం దేశాలు ఎందుకని ప్రశ్నించారు.

News April 10, 2024

నిజామాబాద్: మరో 6 రోజులే గడువు

image

ఈనెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 6 రోజుల సమయం ఉంది. ఫారం-6 నింపి, దృవీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక బీల్వోకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు, మార్పులు కూడా చేసుకోవచ్చు.

News April 10, 2024

ఐసీయూలో ఉన్న రోగి బంగారు ఆభరణాలు చోరి

image

నిజామాబాద్ ద్వారకానగర్‌లోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగికి సంబంధించిన రెండు తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఈ విషయమై రోగి కుటుంబీకులు ఒకటో టౌన్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. తమకు అందిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ విజయ్ బాబు తెలిపారు.

News April 10, 2024

అగ్నివీర్‌కు ఎంపిక ఇందల్వాయి బిడ్డ

image

జాతీయ స్థాయి కబడ్డీ డాకారిణి ముడేటి ప్రియాంక అగ్నివీరుకు ఎంపికైనట్లు కోచ్ ప్రశాంత్ తెలిపారు. ఇందల్వాయి మండలం అన్సాన్పల్లికి చెందిన మల్లయ్య-సావిత్రి దంపతుల చిన్న కూతురు ముడేటి ప్రియాంక.. 2023 మేలో కరీంనగర్లో జరిగిన అగ్నివీర్ ఎంపిక పరీక్షలో సత్తా చాటింది. ఫిబ్రవరిలో వెలువడిన ఫలితాల్లో శిక్షణకు ఎంపికైంది. ఏప్రిల్‌లో శిక్షణ నిమిత్తం బెంగళూరు వెళ్లనుంది.