Nizamabad

News April 8, 2024

రాజంపేట: చెట్టుపై నుంచి పడి యువతి మృతి

image

ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి యువతి మృతి చెందిన ఘటన రాజంపేట మండలం షేర్ శంకర్ తండా పరిధిలో చోటుచేసుకుంది. మూడు మామిళ్ల తండాకు చెందిన భూలి(22) స్థానికులతో కలిసి మొర్రి పళ్ళు తెంపడానికి షేర్ శంకర్ తండాకి వచ్చింది. మొర్రి పండ్లు తెంపే క్రమంలో ప్రమాదవ శక్తి కాలు జారీ చెట్టుపై నుంచి కింద పడింది. దీంతో స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందింది.

News April 8, 2024

నిజామాబాద్: ఓటు నమోదుకు 7 రోజులే గడువు

image

18 ఏళ్లు నిండి కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి ఈ నెల 15 వరకు గడువు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు లేని వారు ఫారం 6 ద్వారా, ఓటర్ ఐడీలో మార్పులు చేర్పులకు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News April 8, 2024

బోధన్: కారులో ఊపిరాడక చిన్నారి మృతి

image

కారులో ఊపిరాడక చిన్నారి మృతి చెందిన ఘటన బోధన్ పట్టణంలో చోటుచేసుకుంది. రాకాసిపేటకు చెందిన రాఘవ(6) ఆడుకుంటూ వెళ్లి రోడ్డుపై ఉన్న ఓ కారులో ఎక్కి కూర్చున్నాడు. కారు తలుపులు బిగుసుకు పోవడంతో ఊపిరి ఆడక కారులోనే మృతి చెందాడు. కారులో చిన్నారిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు సీఐ వీరయ్య తెలిపారు.

News April 8, 2024

రెడ్డిపేట అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి మృతి

image

రెడ్డిపేట అడవిలో ఎలుగుబంటి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపేట అడవి ప్రాంతమైన నందిబండ ఏరియాలో కోటిలింగాల వద్ద ఎలుగుబంటి 2 నెలల క్రితం మృతి చెందిన ఆనవాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఆహారం, నీరు దొరకక మృతి చెందిందా? ఎవరైనా చంపారా అనేది తెలియవలసి ఉంది. 2నెలలుగా ఎలుగుబంటి ఆనవాలు ఉన్న ఫారెస్ట్ అధికారులు గుర్తించకపోవడం గమనర్హం.

News April 7, 2024

లింగంపేట్: విద్యుదాఘాతంతో రైతు మృతి

image

లింగంపేట్ మండలం ముస్తాపూర్ తండాకు చెందిన కేతావత్ కిషన్ (38) అనే గిరిజన రైతు ఆదివారం సాయంత్రం విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు తండావాసులు తెలిపారు. కిషన్ తన వ్యవసాయ బోరు మోటార్ వద్ద పశువుల మేత కోసం గడ్డి కోస్తుండగా కొడవలికి విద్యుత్ వైర్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య అంజి, ఇద్దరు కుమారులు విజయ్, వినోద్ ఉన్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 7, 2024

కామారెడ్డి: మద్యానికి బానిసై ఆత్మహత్య

image

కామారెడ్డి పట్టణానికి చెందిన రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం శనివారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో మద్యం మత్తులో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన రాజును తన తల్లి నాగమణి గమనించి ఆసుపత్రికి తీసుకువెళ్లిందని తెలిపారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని సీఐ పేర్కొన్నారు.

News April 7, 2024

KMR: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరు గేటు
వద్ద చోటు చేసుకొంది. స్థానికుల వివరాల ప్రకారం..
మాసానిపల్లికి చెందిన గొర్రె నవీన్ (30)కు భార్య, ఇద్దరు పిల్లలు
ఉన్నారు. నిన్న రాత్రి బయటకు వెళ్లిన నవీన్‌ బైక్‌ను గుర్తు తెలియని
మరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి
చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News April 7, 2024

కామారెడ్డి:’వడ దెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలి’

image

వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ సూచించారు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు అధికంగా నమోదవుతున్నందున ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎట్టి పరిస్థితులలో ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ప్రజలకు తెలిపారు.  ఉదయం, సాయంత్రం పనులు చేసుకోవాలన్నారు.

News April 7, 2024

NZBలో ఒకే వేదికపై బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు

image

నిజామాబాద్ బస్వా గార్డెన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ప్రత్యర్థి పార్టీల MP అభ్యర్థులు వేదికను పంచుకున్నారు. ఎంపీ అర్వింద్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, అర్బన్, రూరల్ MLAలతో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఒకరిపై ఒకరు నిత్యం విమర్శలు చేసుకునే నేతలు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

News April 7, 2024

ఈసారి నిజామాబాద్ ఎంపీ స్థానం దక్కేదెవరికి?

image

నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఓటర్లు ఎన్నికల్లో విలక్షణ తీర్పు ఇస్తూ ఉంటారు. ఇప్పటికీ ఇక్కడ 5 పార్టీలను ఆదరించారు. 6 సార్లు కాంగ్రెస్, 2 సార్లు టీడీపీ, స్వతంత్ర, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కోసారి గెలిచాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ MP అర్వింద్ ధర్మపురి మరోసారి బరిలో నిలవగా.. బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. గెలుపుపై ముగ్గురూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.