India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బిక్కనూర్ శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి ఆటోమొబైల్ సామాన్ తరలిస్తున్న టాటా ఏస్ వాహనం బిక్కనూర్ వద్ద డివైడర్‌ను ఢీకొంది. కరీంనగర్‌కు చెందిన శేఖర్(47) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ సాయికుమార్ కేసు నమోదు చేశారు.
అత్తింటి వేధింపులు తాళలేక నిజామాబాద్ ఆర్యనగర్‌కు చెందిన వివాహిత యువతి లావణ్య(23) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్యకు తొమ్మిది నెలల కిందట ఆర్యనగర్‌కు చెందిన వెంకటేశ్‌తో వివాహం జరిగింది. ఆషాఢం కావడంతో సుభాష్ నగర్‌లోని తన పుట్టింటికి వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డొంకేశ్వర్ మండలం నూత్‌పల్లికి చెందిన సాయన్న సౌదీలో ఈనెల 4న మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయన్న మృతదేహాన్ని తొందరగా స్వదేశానికి రప్పించాలని కోరుతూ ఆర్మూర్‌లో ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడును కలిసి అభ్యర్థించారు. స్పందించిన కోటపాటి సౌదీ రాయబార కార్యాలయానికి కావలసిన సమాచారాన్ని పంపించామని పేర్కొన్నారు.
బిచ్కుందలోని ATM మెషిన్‌ను దొంగలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. చోరికి వినియోగించిన వాహనం మహారాష్ట్ర సరిహద్దులో కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు బిచ్కుంద మీదుగా జుక్కల్‌కు చేరుకొని గుల్ల ప్రాంతం వద్ద వాహనాన్ని వదిలేసి మహారాష్ట్రకు పారిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దుండగులు పారిపోతూ మార్గమధ్యలో పెద్ద ఏడ్గిలో 2 బైక్‌లను సైతం చోరీ చేశారనీ SI సత్యనారాయణ తెలిపారు.
నేడు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. నిజామాబాద్‌తో పాటు పక్కనే ఉన్న నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సరైనా వర్షాలు లేక జిల్లాలోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి.
బాన్సువాడకి చెందిన తాళ్ల గంగాధర్ అనే వ్యక్తి మద్యం తాగి మృతి చెందినట్లు సీఐ కృష్ణ తెలిపారు. మున్సిపల్ కార్మికుడిగా పనిచేస్తున్న గంగాధర్ కొంతకాలం నుంచి మద్యానికి బానిస అయ్యారు. భార్య కొంతకాలం కిందట పుట్టింటికి వెళ్ళిపోయారు. పట్టణంలోని సినిమా థియేటర్ సమీపంలోని ములుగు కాలువలో మంగళవారం గంగాధర్ మృతదేహం లభించిందని పోలీసులు వెల్లడించారు.
ఫోన్‌కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే బెల్ట్ వచ్చిన ఘటన నవీపేట మండలం శివతండాలో జరిగింది. గ్రామస్థుల ప్రకారం.. రైతు జీవన్‌కు గతనెల 10న ఓ ఆన్‌లైన్ కంపెనీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రూ. 25వేల ఫోన్..మీకు లక్కీ డ్రాలో రూ.5 వేలకు వచ్చిందని చెప్పారు. దీంతో రైతు సమ్మతించారు. నిన్న ఆర్డర్‌బాక్స్‌ను పోస్ట్‌మెన్ జీవన్‌కు ఇచ్చి రూ.5 వేలు తీసుకున్నాడు. డబ్బాను తెరిచి చూడగా అందులో బెల్ట్ ఉండటంతో రైతు అవాక్కయ్యాడు.
తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో కార్పొరేషన్ పదవి ఇచ్చినందుకు ఆయనకు అనిల్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనిల్‌కు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో పోలీసులు మంగళవారం భారీగా గుట్కాను పట్టుకున్నారు. నగరంలోని మార్కెట్లోని వెల్కమ్ ఏజెన్సీ సంబంధించిన అబ్దుల్ బాసిత్ గోడౌన్‌లో రూ.4,26,873 గుట్కాను పట్టుకున్నట్లు SHO విజయ్ బాబు తెలిపారు. దాంతో పాటు ఈరోజు ఉదయం డిచ్పల్లిలోని మెంట్రాజ్‌పల్లి సమీపంలో డీసీఎంలో తరలిస్తున్న రూ.39లక్షల విలువైన గుట్కాను ఎస్ఐ మహేశ్ స్వాధీనం చేసుకున్నారు.
హిస్టరీ జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్‌ను కామారెడ్డి వాసి సాధించారు. గాంధారీ మండలం నేరాల్ తండా గ్రామానికి చెందిన బర్దావల్ మేఘరాజ్ నాయక్ జూనియర్ లెక్చరర్‌గా రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించారు. మారుమూల తండాలో పుట్టిన కాయితి లబాన్ బర్దావల్ మేఘరాజ్ ఉత్తమ ప్రతిభ కనబరచడంతో గ్రామస్థులతో పాటు పలువురు అభినందిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.