India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని జప్తి జానకంపల్లి గ్రామంలో పాము కాటుతో చిన్నారి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. జోడు శంకరయ్య(60) తన కుటుంబ సభ్యులతో ఇంటి ముందు నిద్రిస్తున్నాడు. ఈక్రమంలో తన మనమరాలు వైష్ణవి(7)ని పాము కాటేసింది. మనవరాలు ఏడుస్తుండటంతో దగ్గర తీసుకునే శంకరయ్యను కూడా పాము కాటేసింది. దీంతో వైష్ణవి మృతి చెందగా, శంకరయ్య చికిత్స పొందుతున్నాడు.
బాయ్స్ హస్టల్‌లో యువతికి ఓ స్టూడెంట్ 15రోజుల క్రితం ఆశ్రయమిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్సిటీ అధికారుల వివరాలిలా.. టీయూలో విద్యార్థి పీజీ చదువుతూ యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్నాడు. అతను ఓ యువతికి ఆశ్రయమిచ్చిన విషయాన్ని తోటి విద్యార్థులు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఆ స్టూడెంట్‌ని సస్పెండ్ చేశారు.
చేపల వేటకు వెళ్ళిన వ్యక్తి ప్రమాదవశాత్తు వల చుట్టుకొని మృతి చెందిన ఘటన మోపాల్ మండలం సింగంపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన పల్లికొండ నరసయ్య చేపలు పట్టేందుకు గ్రామ శివారులోని చెరువులోకి వెళ్లాడు. చేపలు పడుతుండగా కాళ్లకు, చేతులకు వల చుట్టుకోవడంతో నీట మునిగి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తండ్రిని చంపిన కొడుకుకు KMR జిల్లా కోర్టు సోమవారం జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. బీబీపేట వాసులు బోయిని రాజయ్య తండ్రి నరసయ్యకు ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో మే 5న పొలంలో రాజయ్య తండ్రిని కొట్టి చంపాడు. పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరగగా నేరం ఋజువు అయ్యింది. ఈ మేరకు జిల్లా జడ్జి వరప్రసాద్ తీర్పును వెలువరించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న ఇంటింటా ఇన్నోవేషన్- 2024 కార్యక్రమ పోస్టర్‌ను సోమవారం నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. ప్రతి ఏడాది తరహాలోనే ఈ ఏడాది సైతం ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వివరించారు.
బైక్ అదుపు తప్పి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రామారెడ్డి PS పరిధిలో జరిగింది. SI విజయ్ కొండ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్ (45) మేస్త్రిగా పని చేస్తున్నాడు. సోమవారం పని నిమిత్తం ఉప్పల్వాయి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా పోసాని పేట్ జంక్షన్ వద్ద బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.
పిట్లం మండలం తిమ్మా నగర్ గ్రామానికి చెందిన దామరంచ అనిల్ గౌడ్ గ్రూప్ 1 మెయిన్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని మొదట బ్యాంక్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం సాధించాడు. అనంతరం సివిల్స్ ఎస్సై ఉద్యోగానికి ఎంపిక అయి కొన్ని రోజుల పాటు ఎస్సైగా విధులు నిర్వహించాడు. అనంతరం గ్రూప్-2లో ఉద్యోగం సాధించి ప్రస్తుతం ACTOగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
భారత వాయుసేన అగ్నిపథ్‌లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ఉపాధి అధికారి సిరిమల్ల శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన యువతీ యువకులు జులై 8 నుంచి జులై 28 వరకు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
రేషన్ కార్డుల్లో చిరునామా మార్పులు, కొత్త సభ్యుల పేర్ల నమోదుకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మీ సేవ జిల్లా మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రెండు రోజుల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
NZB జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గత 6 నెలల నుంచి 134 కేసులు నమోదవ్వగా కేవలం జూన్‌లోనే మెడికల్ ఆఫీసర్లు 9 కేసులు గుర్తించారు. వైరల్ ఫీవర్, డయేరియా, టైఫాయిడ్ వ్యాధులు ప్రజలను కుదిపేస్తున్నాయి. సర్కారు ఆస్పత్రుల్లో జూన్ నుంచి డయేరియా 263,37, టైఫాయిడ్, 467 వైరల్ ఫీవర్ కేసులను గుర్తించి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. దీంతో అంగన్వాడీ, ఆశావర్కర్లను స్థానిక అధికారులను అలర్ట్ చేసింది.
Sorry, no posts matched your criteria.