India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదివారం రాత్రి నెల వంక దర్శనమివ్వడంతో ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తు. దీన్నే మొహర్రం అని పరిగణిస్తారు. ఈ మాసంలో పీర్ల పండుగ కూడా ప్రారంభమవుతుంది. నెల వంక స్పష్టంగా కనిపించిన ఐదో రోజు పీర్లను ప్రతిష్ఠిస్తారు. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో 10 రోజులు మాత్రమే పీర్ల పండగను జరుపుకోగా, కామారెడ్డి జిల్లా పిట్లంలో 20 రోజుల పాటు జరుపుకుంటారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల పరిధిలోని స్టోన్ క్రషర్ వద్ద ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్సై సుధాకర్.. సిబ్బందితో కలిసి ప్రమాద స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.
తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే పేద మైనార్టీ విద్యార్థులు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి దయానంద్ తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, పార్శి మతాలకు చెందిన విద్యార్థులు ఆగస్టు 8లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నిజామాబాద్ జిల్లాలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విత్తనాలు, వరి నాట్లు వేసిన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ప్రమాదాల బారీన పడకుండా ఉండాలని హెచ్చరించారు.
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బిచ్కుందకి చెందిన కుమ్మరి సాయిలు (30) భార్య కొన్ని రోజుల నుంచి కాపురానికి రావడంలేదు. దీంతో జీవితంపై విరక్తితో బిచ్కుంద శివారులోని గిద్దే చెరువులో దూకి సాయిలు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఎస్ఐ మోహన్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్‌లోని పులాంగ్ రోడ్డులో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా శనివారం రాత్రి ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో దట్టమైన మంటలు చెలరేగగా ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. అయితే మొదటి అంతస్తులో ఓ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు చిక్కుకోగా వారిని ఫైర్ సిబ్బంది కాపాడారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో TSP జేఏసీ ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TSP జేఏసీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో TSP జేఏసీ రాష్ట్ర సెక్రటరీ ప్రవీణ్, ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ నాయకులు నవీన్, వేదంత్ మౌర్య, లవకుమార్, అభిమన్యు, రవి, ప్రవీణ్, ప్రసాద్ తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఓ చిన్నారిని విక్రయించిన కేసులో ఇద్దరు డాక్టర్లతో పాటు పలువురిని శనివారం అరెస్టు చేసినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు తండ్రి కొడుకులైన ఇట్టం సిద్దిరాములు, ఇట్టం ప్రవీణ్ కుమార్‌తో పాటు ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, ఆస్పత్రి వాచ్మెన్ బాలరాజు, పాప తల్లి లావణ్య, బాలకిషన్, దేవయ్య, భూపతిని అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు.
రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం శాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ శనివారం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)ను సందర్శించారు. ఆయన ఆస్పత్రిలోని పలు వార్డులను సందర్శించి తగిన సూచనలు అందజేశారు. కాగా ఆసుపత్రికి కావలసిన అవసరాల గురించి GGH సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ కర్ణన్ దృష్టికి తీసుకెళ్లారు, దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.
జుక్కల్ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం ఓ ప్రకటనలో తెలిపారు
Sorry, no posts matched your criteria.