Nizamabad

News April 4, 2024

NZB: ఉపాధ్యాయులకు షాక్ ఇచ్చిన డీఈవో

image

నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కోసం నిర్వహించిన శిక్షణకు డుమ్మా కొట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు డీఈవో షాక్ ఇచ్చారు. ఈ నెల 1, 2 తేదీల్లో జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణకు జిల్లాలోని 84 మంది ఉపాధ్యాయులు డుమ్మా కొట్టారు. వారికి నోటీసులు జారీ చేసి సంజాయిషీ చెప్పాలన్నారు.

News April 4, 2024

NZB: రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం యువతే: సీపీ

image

యువత మద్యం తాగి వాహనాలు నడపరాదని, గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదాలలో యువతే అత్యధికంగా ఉన్నారని నిజమాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బుధవారం పేర్కొన్నారు. కాగా 2023లో మొత్తం 767 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా అందులో 337మంది మరణించారు. మార్చ్(2024)నెలలో 649 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా అందులో 267మందికి జైలుశిక్ష పడింది. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సీపీ సూచించారు.

News April 3, 2024

నిజామాబాద్: తాగునీటి పర్యవేక్షణకు ఐఏఎస్‌ నియామకం

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాగునీటిని పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తాగునీటిని పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా శరత్‌ను నియమించారు.

News April 3, 2024

NZB: బాలికకు లైంగిక వేధింపులు.. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

image

విద్యార్థినిపై లైంగిక వేధింపులకు దిగిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన 9తరగతి విద్యార్థినిని అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ శర్మ లైంగిక వేధించసాగాడు. సదరు బాలిక ఈ విషయం తల్లిదండ్రులకు వివరించింది. వారు షీ టీంను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన షీటీం విచారణ చేపట్టి ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసింది.

News April 3, 2024

రాష్ట్రంలో CAA ఎందుకు అమలు చేయరు: MP అర్వింద్

image

రాష్ట్రంలో CAA ఎందుకు అమలు చేయరో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. బుధవారం ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించాలన్నారు. పార్లమెంటులో ఆమోదం పొందిన చట్టం దేశం మొత్తం అమలు చేయాలి కానీ ఇలా ‘ మేము అమలు చేయం ’ అని అనడానికి ఉత్తమ్‌ ఎవరని నిలదీశారు. ఏ అధికారంతో ఈవ్యాఖ్యలు చేశారో చెప్పాలని MP ప్రశ్నించారు.

News April 3, 2024

భిక్కనూరులో ప్రేమ జంటపై దాడి.. ఆరుగురిపై కేసు

image

ప్రేమ జంటపై ఇరు కుంటుంబీకులు దాడి చేసిన ఘటన సోమవారం రాత్రి భిక్కనూరులో జరిగింది. మండలానికి చెందిన యువకుడు, తిప్పాపూర్‌కి చెందిన యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం భిక్కనూరు టోల్ గేట్ వద్ద HYD బస్సు ఎక్కారు. వారిని వెంబడించిన కుటుంబీకులు రామయంపేట శివారులో యువకుడిని కొట్టి అమ్మాయిని తీసుకెళ్లారు. యువకుడి ఫిర్యాదు మేరకు మంగళవారం ఆరుగురిపై కిడ్నాప్ కేసు నమోదుచేసినట్లు SI సాయికుమార్ తెలిపారు.

News April 3, 2024

KMR: బైక్ కొనివ్వలేదని యువకుడి సూసైడ్

image

తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెంది యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన దోమకొండలో జరిగింది. మండలానికి చెందిన వంశీ(24) కొన్నిరోజులుగా బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడు. వారు నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యి సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు SI గణేశ్ తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 3, 2024

కామారెడ్డి: ముగ్గురు MPDOలకు షోకాజ్ నోటీసులు

image

ఉపాధిహామీ కూలీలకు అవగాహన కల్పించకుండా పనులు చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు MPDOలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం మండలస్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గాంధారి, నస్రుల్లాబాద్, బిచ్కుంద MPDOలు రాజేశ్వర్, గోపాల్, నీలావతికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.

News April 3, 2024

NZB: ప్రతినెల మొదటి బుధవారం సైబర్ జాగృక్తా దివాస్ : సీపీ

image

ప్రతినెల మొదటి బుధవారం “సైబర్ జాగృక్తా దివాస్” కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ వెల్లడించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హైదరాబాద్ ఆదేశానుసారంతో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో ప్రజలకు ప్రతినెల మొదటి బుధవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

News April 3, 2024

కామారెడ్డి: జిల్లాలో 1013 బడుల్లో అమ్మ ఆదర్శ పాఠశాల అమలు: కలెక్టర్

image

జిల్లాలోని 1013 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మహిళా సంఘాలలోని సభ్యులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆకమిటీ ఆద్వర్యంలో స్కూల్లో తాగునీరు, తరగతిగదుల్లో చిన్నచిన్న మరమ్మతులు, టాయిలెట్లు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు సమస్యలను గుర్తించాలన్నారు. ఆ కమిటీల ఆధ్వర్యంలో అన్ని మరమ్మతు పనులు చేయించాలని ఆదేశించారు.