Nizamabad

News May 3, 2024

NZB: ఓటు వేసిన 108 సంవత్సరాల అవ్వ

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఫ్రం హోంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డులోని కేసీఆర్ కాలనీకి చెందిన 108 సంవత్సరాల ఈశ్వరమ్మ శుక్రవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ కోసం నియమించిన బృందాలు ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఆమె ఇంటి వద్దనే ఓటింగ్ కంపార్టుమెంట్ ఏర్పాటు చేసి ఓటు గోప్యతకు భంగం లేకుండా ఓటు వేయించారు.

News May 3, 2024

చెరుకు ఫ్యాక్టరీలు తెరిచే యత్నం ఎన్నికల స్టంట్: అరవింద్

image

చెరుకు ఫ్యాక్టరీలు తెరిచే యత్నం ఎన్నికల స్టంట్ అని బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కోసమే రూ. 43 కోట్ల నిధులు విడుదల చేశారని అన్నారు. ఫ్యాక్టరీలు తెరిచేందుకు రూ. 800 కోట్లు అవసరం కాగా ఐదు శాతం నిధులు విడుదల చేశారని విమర్శించారు.

News May 3, 2024

NZB: ఓటు హక్కు వినియోగించుకున్న స్వాతంత్ర్య సమరయోధుడు

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు దొండి జగ్గే శివదాస్ (93) శుక్రవారం తన ఓటు హక్కును ఆయన స్వగృహంలో వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనలాంటి వయోవృద్ధులకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అందరూ తమ ఓటు హక్కును తప్పనిసరి వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

News May 3, 2024

సిరికొండ: మంటలంటుకుని రైతు మృతి

image

ప్రమాదవశాత్తు మంటలంటుకుని ఓ రైతు మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో చోటుచేసుకుంది. సిరికొండ మండలంలోని పెదవాల్గోట్ గ్రామానికి చెందిన లాయిడి కిషన్(58) పోత్నూర్ గ్రామ శివారులోని తన పంట పొలం వరి కంకులకు నిప్పు పట్టాడు. ఈ క్రమంలో మంటలంటుకుని కిషన్ మృతిచెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 3, 2024

NZB: అత్తమామ వేధిస్తున్నారని.. వివాహిత ఆత్మహత్య

image

అత్తమామల వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంసాగర్ మండలంలోని ఆరేడులో జరిగింది. బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నారాయణఖేడ్ మండలంలోని లింగాపూర్‌కు చెందిన స్వప్న (22)కు నిజాంసాగర్ మండలంలోని ఆరేడుకు చెందిన గడ్డం రాజుతో పెళ్లయింది. ఉపాధి నిమిత్తం రాజు హైదరాబాద్‌కు వచ్చాడు. అత్తమామలు రత్నవ్వ, క్రీసూస్తం తరచూ వేధిస్తున్నారు. దీంతో స్వప్న ఉరేసుకుని చనిపోయింది.

News May 3, 2024

KMR: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

బిక్కనూర్ మండలంలోని పొందుర్తి ఆర్టీఏ చెక్‌పోస్ట్ 44వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి చనిపోయాడు.
కామారెడ్డికి చెందిన అర్కల వెంకట్ (39) అనే వ్యక్తి చెక్‌పోస్ట్ వద్ద రోడ్డుపై ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాదు నుంచి అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆయన స్పాట్‌లోనే మృతిచెందాడు. ఈ మేరకు ఎస్సై సాయికుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు.

News May 3, 2024

NZB: రెండు నియోజకవర్గాలు.. 3768 పోలింగ్ బూత్‌లు

image

నిజామాబాద్ MP స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. జహీరాబాద్ MPస్థానంలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. నిజామాబాద్ పరిధిలో నిజామాబాద్ రూరల్ 293, నిజామాబాద్ అర్బన్ 289, జగిత్యాల 254, కోరుట్ల 252, బాల్కొండ 246, బోధన్ 246, ఆర్మూర్ 217 బూత్‌లు ఉన్నాయి. జహీరాబాద్ పరిధిలో జహీరాబాద్ 313, అందోల్ 313, నారాయణఖేడ్ 296, ఎల్లారెడ్డి 270, కామారెడ్డి 266, బాన్సువాడ 258, జుక్కల్ 255 బూత్‌లు ఉన్నాయి.

News May 3, 2024

ఇందూరుకు విమాన మోక్షమెప్పుడో!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం చాలా విదేశాలకు వెళ్తుంటారు. ఒక్క బాల్కొండ నుంచే సుమారు 2,200 మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. వీరందరికి రాకపోకలకు విమానాశ్రయం అనేది సాధారణ అవసరంగా మారింది. జక్రాన్‌పల్లిలో ఏర్పాటు చేస్తామన్న విమానాశ్రయం హమీ ఆచరణకు నోచుకోలేదు. జక్రాన్‌పల్లిలో 1200 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. కానీ నిర్మాణ పనులకు మాత్రం నోచుకోలేదు.

News May 3, 2024

నిజామాబాద్: ‘బీడీ కార్మికుల బతుకు పోరాటంపై కాంగ్రెస్ ప్రత్యేక శ్రద్ధ’

image

బీడీ కార్మికుల బతుకు పోరాటంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ హామీ ఇచ్చారు. గురువారం నిజామాబాద్‌లో బీడీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఏడు లక్షల బీడీ కార్మికులు 14 బీడీ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే బీడీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తేసి వారికి ఉపాధి భరోసా కల్పిస్తామని చెప్పారు.

News May 2, 2024

నిజామాబాద్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించే గడువును మే 4వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ తెలిపారు. వార్షిక పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుంచి నిర్వహించబడతాయని తెలిపారు. ఈ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు మరో రెండు రోజులు ఫీజు గడువును పొడిగించామని తెలిపారు.