India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఈనెల 4న అథ్లెటిక్స్ పోటీలకు బాల, బాలికల ఎంపిక జరుగుతుందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు. 8,10,12 సంవత్సరాల బాలబాలికలకు రన్నింగ్, లంగ్ జంప్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాల్గొనే క్రీడాకారులు బర్త్ సర్టిఫికేట్, క్రీడా దుస్తులు, బూట్లు వెంట తెచ్చుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన సదాశివనగర్‌లో చోటుచేసుకుంది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను సత్య పీర్ల దర్గా సమీపంలోని 44వ జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జిల్లా వ్యాప్తంగా 1,321 మంది ఎస్టీటీలను బదిలీ చేస్తూ డీఈవో దుర్గాప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ గతేడాది జనవరిలో ప్రారంభం కాగా సోమవారంతో ముగిసింది. వారితో పాటు మరో 46 మంది భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయులను బదిలీ చేశారు. 2021లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 25 ఆధారంగా ఈ ప్రక్రియ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
సదాశివనగర్: సదాశివనగర్ మండల కేంద్రంలోని సత్య పీర్ల దర్గా సమీపంలో 44 వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం కామారెడ్డి నుంచి నిజాంబాద్ వైపు వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించారు. ఘటన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
నిజామాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 130 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందజేశారు. కాగా అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన బిక్కనూర్‌లో చోటుచేసుకుంది. పెద్దమల్లారెడ్డి గ్రామంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి వద్ద పని చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన హరిబాబు కుమార్తె సాయి(15) సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు SI సాయికుమార్ తెలిపారు. మతిస్తిమితం బాగా లేక గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరేసుకున్నట్లు వెల్లడించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మోస్తా మండలంలో చోటుచేసుకుంది. సోమవారం బైక్‌పై నిజామాబాద్ వెళ్తున్న సాయికిరణ్‌ను గోపూర్ శివారు వద్ద ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు వర్ని పోలీసులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన పేర్కొన్నారు. పలువురి మంత్రుల శాఖలు మార్చే అవకాశం ఉందని, మంత్రి సీతక్కకు హోం శాఖ మంత్రి ఇచ్చే అవకాశం ఉందన్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం మొదటిసారి ముసురు ముంచెత్తింది. ఆదివారం సాయంత్రం మొదలైన వర్షం కొనసాగుతూనే ఉంది. జిల్లా అంతటా రుతు పవనాలు విస్తరించడంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. నెల రోజులుగా వానలు ఇలా వచ్చి అలా వెళ్లాయి. కానీ, ఇప్పుడు ముసురుకోవడంతో రైతులు మురిసిపోతున్నారు.
నిజామాబాద్ నగరంలోని రెండో టౌన్ పరిధిలో గుర్తు తెలియని యువకుడు మురుగు కాలువలో పడి మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రెండో పోలీస్ స్టేషన్ ఎస్సై రామ్ అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.