Nizamabad

News April 29, 2024

నిజామాబాద్ పార్లమెంట్ బరిలో 29 మంది

image

నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది. మొత్తం 42 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. స్క్రూటినీ సందర్భంగా 10 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మిగతా 32 మంది అభ్యర్థుల్లో ముగ్గురు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా.. ఎన్నికల బరిలో 29 మంది అభ్యర్థులు ఉన్నట్లు వెల్లడించారు.

News April 29, 2024

జీవన్‌రెడ్డి గెలిస్తే జగిత్యాల లవ్ జిహాద్ అవ్వడం పక్కా: అర్వింద్

image

నిజామాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలిస్తే జగిత్యాల లవ్ జిహాద్‌కు అడ్డగా మారుతుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇది వరకే జగిత్యాల పీఎఫ్ఐ‌కి అడ్డాగా మారిందని ఆరోపించారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెబుతూ పబ్బం గడుపుతున్నరని అన్నారు.

News April 29, 2024

NZB: ఎమ్మెల్యేలుగా ఓడి ఎంపీలుగా బరిలోకి..!

image

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన పలువురు నేతలు.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారు ఎవరెవరో పరిశీలిస్తే.. బాజిరెడ్డి గోవర్ధన్ NZB (రూరల్) నుంచి MLAగా పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి NZB లోక్ సభ నుంచి MPగా బరిలో దిగారు. జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయి MPగా బరిలో ఉన్నారు. అర్వింద్ కోరుట్ల నుంచి ఓడిపోయి MPగా బరిలో ఉన్నారు.

News April 29, 2024

KMR: MLA టికెట్ త్యాగం చేసి ఎంపీ బరిలోకి

image

కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేసిన ఆయనకు ఆ పార్టీ అధినాయకత్వం MP టికెట్‌ను కట్టబెట్టింది. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం చేస్తున్నారు.

News April 29, 2024

జహీరాబాద్ ఎంపీ ఎలక్షన్.. రేపు ప్రధాని మోదీ రాక

image

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అల్లాదుర్గం శివారులోని చిల్వేర్ వద్ద నిర్వహించే సభలో ఆయన పాల్గొనున్నారు. ఈ మేరకు జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ కార్యకర్తలు, శ్రేణులను తరలించనున్నారు. జహీరాబాద్ స్థానానికి 4వ సారి ఎన్నికలు జరుగుతున్నాయి. తొలిసారి కాంగ్రెస్, తర్వాత వరుసగా బీఆర్ఎస్ విజయం సాధించింది.

News April 29, 2024

NZB: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

image

రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నగరంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో అజంతా ఎక్స్ప్రెస్ రైలు వెళ్లేక్రమంలో ఓ యువకుడు హఠాత్తుగా రైలుకు అడ్డంగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. యువకుడు వైలెట్ కలర్ షర్ట్, బ్లూ జీన్ పాయింట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ఎవరైనా గుర్తుపట్టి ఉంటే రైల్వే పోలీస్ స్టేషన్ సంప్రదించాలన్నారు.

News April 29, 2024

గాంధారిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాం లభ్యం

image

కామారెడ్డి జిల్లా గాంధారిలో గల వంతెన సమీపంలో పాడుబడ్డ బాయిలో గుర్తుతెలియని మహిళ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు గాంధారి పోలీసులు తెలిపారు. మహిళ శవం కుళ్ళిన స్థితిలో ఉండి గులాబీ రంగు చీర ఉందని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాంపై వారు విచారణ చేపట్టారు.

News April 29, 2024

నిజామాబాద్: బరిలో ఉండేదెవరో?

image

నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీ స్థానాలకు ఎందరు అభ్యర్థులు పోటీలో ఉంటారనేది నేడు తేలనుంది. NZB ఎంపీ స్థానానికి 42 మంది నామినేషన్లు వేశారు. 10 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 32 మంది బరిలో ఉన్నారు. ZHB ఎంపీ స్థానానికి 40 మంది నానినేషన్లు వేశారు. 18 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నామపత్రాల ఉపంహరణకు మధ్యాహ్నం 3 వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత ఎందరు పోటీలో ఉన్నారో అధికారులు ప్రకటిస్తారు.

News April 29, 2024

మలేషియాలో కామారెడ్డి వాసి మృతి

image

కామారెడ్డి మండలంలోని కొట్టాలపల్లి గ్రామానికి చెందిన ఆకుల రమేశ్ శనివారం రాత్రి మలేషియాలో హార్ట్ స్టోక్ వచ్చి చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. రమేశ్ గత వారం మలేషియా వెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడి స్నేహితుల ద్వారా సమాచారం అందిందన్నారు. ప్రభుత్వం స్పందించి రమేశ్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

News April 29, 2024

NZB: ప్రచారంలో స్పీడ్ పెంచిన ప్రధాన పార్టీలు

image

ఉమ్మడి NZB జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్రచారంలో ప్రధాన రాజ‌కీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఈ వేసవిలో నేతలు మాటల తూటాలతో మరింత వేడిపుట్టిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.