Nizamabad

News March 28, 2024

NZB: రైళ్లలో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరికి జైలు శిక్ష

image

రైళ్లలో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరికి 8 నెలల జైలుశిక్ష విధిస్తూ రైల్వే మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు చెప్పారని నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లాకు చెందిన జూలు శ్రీకాంత్, నిజామాబాద్ జిల్లాకు చెందిన గజం సత్యం కలిసి కామారెడ్డి, నిజామాబాద్ మధ్య నడిచే రైళ్లలో 9 సెల్‌ఫోన్లు దొంగలించారని సాయిరెడ్డి వివరించారు.

News March 28, 2024

నిజామాబాదీలు జర జాగ్రత్త..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రత 40 సెల్సియస్ డిగ్రీలు దాటుతోంది. నిన్న బుధవారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోని ముగ్పాల్ మండలం మంచిప్పలో 42.2, నిజామాబాద్ లో 41.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా కామారెడ్డి జిల్లాలోని బిచ్కుందలో 40.9, తాడ్వాయిలో 39.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మున్ముందు ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది.

News March 28, 2024

నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా టీ. జీవన్ రెడ్డి

image

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా టీ.జీవన్ రెడ్డిను ఆపార్టీ అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. ఈయన1983లో TDP నుంచి తొలిసారిగా జగిత్యాల MLAగా ఎన్నికై.. మంత్రివర్గంలో చేరారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ లో చేరి 1989, 1996, 1999, 2004, 2014లలో కాంగ్రెస్ పార్టీ నుంచి MLAగా గెలిచారు. 2019లో కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ MLCగా ఎన్నికయ్యారు.

News March 28, 2024

NZB: పోటీ పరీక్షల కోసం ఉచిత కోచింగ్

image

గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు టీఎస్ఎస్సీ స్టీడీ సర్కిల్, షెడ్యూల్డ్ కులాల అభివృది శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శశికళ తెలిపారు. డిగ్రీ అర్హత ఉన్న ఎస్సీ అభ్యర్థుల దీనికి అప్లయ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గలవారు జిల్లా కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News March 28, 2024

NZB: ఎన్నికల వేళ పోలీసుల ప్రత్యేక నిఘా

image

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జిల్లాలో డబ్బు, మద్యంఅక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడంపై పోలీసుశాఖ దృష్టి సారించింది. అందులో భాగంగానే నిజామాబాద్ డివిజన్‌లోని చంద్రశేఖర్ కాలనీ SST చెక్‌పోస్ట్, కంఠేశ్వర్ టెంపుల్, వర్ని ‘X’ రోడ్, SST చెక్‌పోస్ట్, మద్దుల్ ‘X’ రోడ్ SST చెక్‌పోస్ట్, బోధన్ డివిజన్‌లోని ఖండ్‌గాం అంతరాష్ట్ర చెక్‌పోస్ట్, సాలురా అంతరాష్ట్ర చెక్‌పోస్ట్‌ల వద్ద పోలీసులు విస్తృతవాహన తనిఖీలు చేపట్టారు.

News March 27, 2024

నిజామాబాద్ జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు

image

నిజామాబాద్: మంచిప్పలో 42.2℃, నిజామాబాద్ 41.1, కల్దుర్కి 41.1, భీమ్‌గల్ 41.1, గోపన్నపల్లి 41, బెల్లాల్ 40.8, కోరాట్‌పల్లి 40.8, స
సాలూర 40.4, లక్మాపూర్ 40.2, వేంపల్లి 40.1, జక్రాన్‌పల్లి 40.1, కోనసమందర్ 39.9, ధర్పల్లి 39.9, పెర్కిట్ 39.8, కోటగిరి 39.7, చిన్న మావంది 39.6, మదనపల్లె 39.6, వేల్పూర్ 39.3, డిచ్‌పల్లి 39.2, ఆలూర్ 39.1, పొతంగల్ 39, జానకంపేట్ 39, యడపల్లె 38.9, రెంజల్లో 38.7℃గా నమోదైంది.

News March 27, 2024

NZB: KTRపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

image

సీఎం రేవంత్‌పై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందన్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ బుధవారం నిజామాబాద్ 1టౌన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తాహెర్ మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ పాలన సాగిస్తున్నారు. ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 

News March 27, 2024

జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ క్రీడాకారులు

image

జాతీయస్థాయి సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, గంగమోహన్ తెలిపారు. ఇటీవల అదిలాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఈజట్లు ఈనెల 29 నుంచి ఏప్రిల్ 1 వరకు ఔరంగాబాద్‌లో జరిగే జాతీయస్థాయి టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్నారు.

News March 27, 2024

కామారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు ఎంతంటే!

image

భిక్కనూర్ 38.7, బీబీపేట్ 37.7, బాన్సువాడ 35.8, మద్నూర్ 39.2, గాంధారి 35.7, ఎల్లారెడ్డి 37.4, కామారెడ్డి 39.9, రామారెడ్డి 37.8, నసురుల్లాబాద్ 36.2, బిచ్కుంద 40.8, నాగిరెడ్డిపేట్ 37.3,పిట్లం 38.5, లింగంపేట్ 37.3, పెద్ద కొడపగల్ 39.9, మాచారెడ్డి 36.6, దోమకొండ 37.7,సదాశివనగర్ 38.0, రాజంపేట 35.2 డోంగ్లి 36.0, నిజాంసాగర్ 38.1 బీర్కూర్ 34.9, జుక్కల్ 38.2, తాడ్వాయి 39.డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 27, 2024

UPDATE కామారెడ్డిలో యువకుడి హత్య.. పరారీలో నిందితులు

image

రామేశ్వర్‌పల్లిలో <<12928467>>యువకుడి హత్య<<>> కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. CI రామన్ వివరాలు.. నిన్న ఉదయం నవీన్ ఆటోలో జిల్లా కేంద్రానికి వెళ్తుండగా గ్రామానికి చెందిన మధు, ప్రవీణ్ దారికాచి కత్తులతో దాడి చేశారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అది చూసి ఆపే ప్రయత్నం చేశాడు. వారు అతడిపై దాడికి యత్నించగా పరారై గ్రామస్థులకు చెప్పాడు. తీవ్ర రక్తస్రావంతో అప్పటికే నవీన్ చనిపోయాడు. నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు.