India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేడు మరణించిన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ (డీఎస్) పార్ధీవదేహానికి రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ఆదేశించారు. ఈ మేరకు రేపు డీఎస్ స్వస్థలం నిజామాబాద్ లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఈ తెల్లవారు జామున కన్నుమూశారు. కాగా ఆయన 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశారు. 1989లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఆయన NZB అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో MLAగా గెలిచారు. 1998లో ఉమ్మడి ఏపీ PCC అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2004, 2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్ మంత్రిగా సేవలందించారు.
పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డీఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి నేటి మధ్యాహ్ననికి హైదరాబాద్ చేరుకోనున్నారు. డీఎస్ పార్ధివ దేహాన్ని హైదరాబాద్‌లోని స్వగృహం నుంచి మధ్యాహ్నం 2 గంటల తరువాత ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్ తరలిస్తారు. రేపు మధ్యాహ్నం డీఎస్ సొంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో అంత్యక్రియలు జరగనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు.
డి శ్రీనివాస్ ఈ తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలో ఒక దశలో ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనే అందరు భావించారు. రాజకీయ పరిస్థితుల వల్ల అది కుదరలేదు. కాగా రాష్ట్ర విభజన తర్వాత 2015లో బిఆర్ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే బీఆర్ఎస్‌లో ఆయనకు తగిన ప్రాధాన్యం లభించకపోవడంతో స్తబ్దుగా ఉండిపోయారు. అనంతరం ఇటీవల కాలంలో మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
తన తండ్రి D.శ్రీనివాస్ మృతి పట్ల ఎంపీ అర్వింద్ FB ఎమోషనల్ పోస్టు చేశారు. ‘అన్నా అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. I WILL MISS YOU DADDY! నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే..! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు. వారి కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్న..! నువ్వు ఎప్పటికీ మాతోనే ఉంటావు, ఎప్పటికీ మాలోనే ఉంటావు’ అని పోస్ట్ చేశారు.
ఢిల్లీలో కాంగ్రెస్ PCC అధ్యక్షుడి నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణపై కసరత్తు సాగుతోంది. జిల్లా నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. MLC మహేశ్‌కుమార్ గౌడ్, అధ్యక్షపీఠాన్ని ఆశిస్తున్నారు. NZBఎంపీగా 2సార్లు గెలిచిన మధుయాష్కీ కూడా ఈ పదవీ కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణలో జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. కాగా జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట శుక్రవారం బోధనా వైద్యులు ఆందోళన చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోధనా వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్. కిరణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. నల్గొండలోని జనరల్ ఆస్పత్రిలో వైద్యుల హాజరును పర్యవేక్షించేందుకు రోజుకో ఆఫీసర్‌ను నియమిస్తూ అక్కడి కలెక్టర్ నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
కామారెడ్డి జిల్లాలోని BRS మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, BRS అధినేత KCRను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ BRS జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు.
పట్టాలు దాటుతున్న ఓ వృద్ధుడు రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. సికింద్రాబాద్ జీర్పీ పోలీసుల ప్రకారం NZB జిల్లా కోటగిరికి చెందిన పెద్దరాజు(69) తిరుపతి వెళ్లి వస్తానంటూ బుధవారం ఇంటి నుంచి వెళ్లాడు. కాగా రైలులో చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. గురువారం పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్‌లో రాంమందిరం వెనుక వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం సాయంత్రం కొందరు వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు మూడవ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మెరుపు దాడి చేశారు. దాడిలో ఒక నిర్వాహకురాలితో పాటుగా, బిఎల్‌ఎఫ్ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఓ బాధిత మహిళను సఖి కేంద్రానికి తరలించారు.
Sorry, no posts matched your criteria.