India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదల చేయనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి షేక్ సలాం తెలిపారు. ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 7658కి 2666, రెండో సంవత్సరంలో 7234కి 3204 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. దీంతో జిల్లాకు 35వ స్థానం దక్కింది. కాగా మొదటి సం.లో 6236, రెండో సం.లో 4275 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
తాను స్వలాభం కోసమో పదవి కోసమో కాంగ్రెస్‌లో చేరలేదని, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల అనంతరం ఆయన మాట్లాడారు. కార్యకర్తల సూచన మేరకు నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకే కాంగ్రెస్‌లోకి వెళ్లానన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, నియోజకవర్గ అభివృద్దే లక్ష్యమని పోచారం స్పష్టం చేశారు.
నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ ప్రాంతంలోని డ్రైనేజీలో (35) వ్యక్తి మృతదేహం ఒంటి నిండా గాయాలతో ఆదివారం లభ్యమైంది. అతడు డ్రైనేజీలో పడి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి వర్షం ధాటికి అతడు డ్రైనేజీలో పడి మృతి చెందాడా.? లేదా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సదరు వ్యక్తిపై దాడి చేసి డ్రైనేజీలో పడేశారా.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాన్సువాడ మండలంలో దారుణం జరిగింది. మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో జులాయిగా తిరుగుతూ తాగి వచ్చి కొడుతూ ఇబ్బందులు పెడుతున్న రాములు (33)ను అతడి భార్య మంజుల తన మామ నారాయణతో కలిసి హత్య చేసింది. మృతదేహాన్ని ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో 2 రోజులు ఉంచి తదుపరి ఇంటి ఆవరణలోనే గుంత తీసి పాతిపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం మృతదేహాన్ని వెలికి తీసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోచారం శ్రీనివాస్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించాలని రేవంత్ సర్కార్ చూస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చనడుస్తోంది. కాంగ్రెస్‌లో చేరగానే ఆయనకు మంత్రి పదవి ఖాయమని, వ్యవసాయ శాఖ కూడా ఇస్తామని ప్రచారం జరిగింది. అయితే పదవి కోసమే తాను పార్టీలోకి వచ్చినట్లు అవుతుందని భావించి ఆయన పదవీ తిరస్కరించినట్లు సమాచారం. దీంతో అతడిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించేందుకు అవకాశాలు ఉన్నాయి.
నిజామాబాద్ మల్టీ జోన్1 పరిధిలో పనిచేస్తున్న 19 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమందిని పోస్టింగ్ నుంచి తప్పించి వీఆర్‌కు అటాచ్ చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో రానున్న రోజుల్లో మరికొంతమందిని బదిలీ చేసే అవకాశం ఉంది.
ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన బీబీపేట్‌లో చోటుచేసుకుంది. మండలానికి చెందిన వీణ ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తుంది. ఆమెకు సిద్ధిపేటకు చెందిన శ్రావణ్‌తో 2015లో వివాహం కాగా HYDలో కాపురం ఉంటున్నారు. అయితే కొద్దిరోజులుగా వీణ మానసిక పరిస్థితి బాగా లేక పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఆమె ఈనెల 21న రాత్రి పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం మల్లుపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం మలావత్ శ్రీకాంత్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జేసీబీ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులకు సమాచారం అందించారు.
టీయూ గర్ల్స్ హాస్టల్లో నిన్న <<13488521>>అల్పాహారంలో కీటకం<<>> ఘటన పై వర్సిటీ అధికారులు స్పందించారు. హాస్టల్ కేర్ టేకర్, వార్డెన్ విచారణ జరిపి రిజిస్ట్రార్‌కు నివేదిక అందజేశారు. దీంతో వైస్ ఛాన్స్‌లర్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి హెడ్ కుక్ రాజేష్‌ను సస్పెండ్ చేసి, విధుల నుంచి తొలగించారు. మిగతా సిబ్బంది కిచెన్లో పరిశుభ్రత పాటించాలని లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్‌స్ట్రక్షన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ తెలిపారు. ల్యాండ్ సర్వేయర్, ప్లంబర్, జనరల్ సూపర్వైజర్, స్ట్రక్చర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జూన్ 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.