Nizamabad

News June 22, 2024

NZB: మురికి కాలువలో అప్పుడే పుట్టిన చిన్నారి మృతదేహం లభ్యం

image

నిజామాబాద్‌లో అప్పుడే పుట్టిన చిన్నారి మృతదేహం లభ్యమైంది. సుభాష్ నగర్ పరిధిలోని పాముల బస్తీ పరిసర ప్రాంతంలో ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు మురికి కాలువలో పడేశారు. గమనించిన స్థానికులు 3 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రవీణ్ కేసు నమోదు చేసి చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News June 22, 2024

ఎల్లారెడ్డిలో కత్తిపోట్లకు గురైన వ్యక్తి మృతి

image

నాగిరెడ్డిపేటలోని రాఘవపల్లిలో <<13461096>>కత్తిపోట్లకు<<>> గురైన నాగయ్య(55) చికిత్స పొందులూ శుక్రవారం మృతి చెందారు. ఈనెల 18న ఇద్దరు యువకులు అతడిపై కత్తితో దాడి చేసి గోంతు కోశారు. తీవ్రంగా గాయపడిన నాగయ్యను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతున్న అతడికి నిన్న గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

News June 22, 2024

నిజామాబాద్ జిల్లాలో బలపడుతున్న కాంగ్రెస్.!

image

బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉమ్మడి NZB జిల్లాలో ఆ పార్టీ బలం పెరగనుంది. జిల్లాలోని 9 మంది MLAల్లో నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఉన్నారు. తాజాగా పోచారం చేరికతో ఆ సంఖ్య ఐదుగురికి చేరింది. ఆయన చేరిక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు జిల్లాలోని పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

News June 22, 2024

నిజామాబాద్‌లో హైటెక్ వ్యభిచారం.. గుట్టును రట్టు చేసిన పోలీసులు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వాట్సాప్‌లో అమ్మాయిల ఫొటోలు పంపి విటులను రప్పించి హైటెక్ వ్యభిచారం చేస్తున్న గుట్టును పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. సుభాష్ నగర్ ఏరియాలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్క సమాచారం మేరకు 3 టౌన్ ఎస్ఐ ప్రవీణ్, టౌన్ సీఐ నరహరి వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఇద్దరు మహిళలతో పాటు, ఒక విటుడిని, వ్యభిచార నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

News June 21, 2024

నిజామాబాద్: ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

image

నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులను ఎక్కించుకొని వెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడటంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం నలుగురు విద్యార్థులు ఉన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని స్థానికులు వెల్లడిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News June 21, 2024

NZB: బండరాయితో కొట్టి హత్య..?

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం అర్ధరాత్రి వన్ టౌన్ పరిధిలోని పవన్ థియేటర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి తలపై దుండగులు బండరాయితో మోదడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఎవరనేది ఇంకా తెలియలేదు.

News June 21, 2024

కామారెడ్డి: బావిలో దూకి వివాహిత ఆత్మహత్య

image

భర్తతో ఉండటం ఇష్టం లేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలో జరిగింది. ఎస్ఐ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాకు చెందిన రూప, బస్వాపూర్‌కు చెందిన బొల్లం శ్రీనివాస్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. కాగా భర్తతో ఉండటం ఇష్టం లేక కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వెళ్ళింది. ఈనెల 19న ఆమెను కుటుంబీకులు అత్తారింటికి పంపించడంతో గురువారం బావిలో దూకి సూసైడ్ చేసుకుంది.

News June 21, 2024

NZB: పలు RDO కార్యాలయాలకు సబ్ కలెక్టర్ హోదా

image

నిజామాబాద్ జిల్లాలోని పలు RDO కార్యాలయాలకు సబ్ కలెక్టర్ హోదా గుర్తింపునిస్తూ సాధారణ పరిపాలనాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా సులభతరం చేసేందకు రాష్ట్రంలో 15 RDO కార్యాలయాలకు ఈ హోదా కల్పించింది. NZB జిల్లాలో బోధన్, ఆర్మూర్, కామరెడ్డి జిల్లాలో బాన్సువాడకు ఈ హోదా దక్కింది. దీంతో ఇక్కడ IAS అధికారులను సబ్ కలెక్టర్‌లుగా నియమిస్తారు. కాగా బోధన్ RDO కార్యలయానికి ఇదివరకే ఈ గుర్తింపు ఉంది.

News June 21, 2024

ఎద్దు పై ప్రేమతో విగ్రహం ఏర్పాటు.. పూజలు, అన్న దానం

image

NZB జిల్లాలోని మంచిప్పకు చెందిన సోదరులు.. రాంరావు, ప్రకాష్ రావు, రమేష్, బల్వంత్ రావు లకు పశువులంటే ప్రాణం. అయితే వీరికి గతంలో నాలుగు వందలకు పైగా ఆవులు ఉండగా అందులో ఒక ఎద్దు ఉండేది. దాన్ని ఇంట్లో ఒకరిగా చూసుకుంటూ లక్ష్మి దేవిలా పూజించే వారు. 2007 APR 5న అది చనిపోయింది. దానిపై మమకారంతో పొలంలో విగ్రహం ఏర్పాటు చేసి వారానికోసారి పూజలు చేస్తున్నారు. APR 5న అన్నదానం చేస్తున్నారు.

News June 21, 2024

నిజామాబాద్: తండ్రిని చంపిన కొడుకు.. ఐదేళ్ల జైలు శిక్ష

image

తండ్రిని చంపిన కొడుకుకి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బోధన్ 5వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రవికుమార్ తీర్పునిచ్చారు. వర్నికి చెందిన వినోద్ తరచూ దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో 2021 జూన్‌లో దొంగతనాలు మానేయాలని చెప్పిన అతడి భార్యతో గొడపడ్డాడు. అడ్డువచ్చిన తండ్రిని కర్రతో కొట్టడంతో దూప్యానాయక్ మృతిచెందాడు. ఈ ఘటనపై అప్పటి SI అనిల్ రెడ్డి కేసు నమోదు చేయగా గురువారం అతడికి జైలు శిక్ష పడింది.

error: Content is protected !!