Nizamabad

News March 19, 2024

బాల్కొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోదేపల్లి గ్రామ శివారులో కాసేపటి క్రితం రోడ్డుప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2024

NZB: డబ్బుల కోసం తల్లి పై దాడి.. కొడుకుకు రిమాండ్

image

విచక్షణా రహితంగా కన్న తల్లిపై దాడి చేసిన కుమారుడిని రిమాండ్‌కు తరలించారు. జిల్లా కేంద్రంలోని గౌతమ్ నగర్‌లో బంగారం, ఫించన్ డబ్బుల కోసం తల్లి గంగామణి కొట్టిన కుమారుడు పవన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల7న గంగమ్మ వద్ద ఉన్న బంగారం, పించన్ డబ్బులు ఇవ్వాలని చితకబాదాడు. మనువడు మనోజ్ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు.

News March 19, 2024

నిజామాబాద్: పరీక్ష తేదీలు వెల్లడి

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బి.పి.ఎడ్ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈనెల 26న ప్రారంభమై 30 తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య.ఎం.అరుణ తెలిపారు. పూర్తి వివరాల కోసం విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్
www.telanganauniversity.ac.in చూడాలని విద్యార్థులకు సూచించారు.

News March 19, 2024

1.61వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేసి బిల్డర్లకు కేటాయింపు, కలెక్టర్

image

కామారెడ్డి ,2022- 23 రబీకి సంబంధించిన ధాన్యాన్ని బిడ్డర్లకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అప్పగించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైస్ మిల్లర్లను కోరారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్ల తో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత రబీకి సంబంధించి లక్ష 61వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేసి ప్రభుత్వం బిడ్డర్లను కేటాయించిందని అన్నారు.

News March 19, 2024

నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులపాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News March 19, 2024

NZB: ఏప్రిల్ 25 నుంచి ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్పీ దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30ల నుంచి 5.30ల వరకు జరగుతాయన్నారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

News March 19, 2024

NZB: పిల్లలు మృతి.. తల్లికి ఐదేళ్ల జైలు శిక్ష

image

కన్న పిల్లల మృతికి కారణమైన తల్లికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ నిజామాబాద్ జిల్లా జడ్జి కుంటాల సునీత తీర్పు వెల్లడించారు. నందిపేటకు చెందిన అమృత 2022 ఫిబ్రవరి 28న గుత్ప కెనాల్‌లో తన పిల్లలను పారేసి తాను దూకింది. ఓ కానిస్టేబుల్ ఆమెను రక్షించగా పిల్లలు నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా జడ్జి ఈ మేరకు తీర్పు చెప్పారు.

News March 19, 2024

రాజంపేటలో కరెంటు షాక్ తగిలి యువకుడి మృతి

image

మండలంలోని తలమడ్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు ఎస్ఐ సంపత్ తెలిపారు. గ్రామానికి చెందిన ప్రవీణ్ తన ఇంటి వద్ద నల్ల నీటికి మోటార్ కనెక్షన్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలిందన్నారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News March 19, 2024

నిజామాబాద్‌లో ఈ నంబర్‌కు రూ. లక్ష..!

image

నిజామాబాద్, బోధన్, ఆర్మూర్‌లో రవాణాశాఖ కార్యాలయాల్లో ఫ్యాన్సీ నంబర్లకు ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ నిర్వహించారు. దీంతో రూ.9,69,872 ఆదాయం వచ్చింది. NZBకు టీజీ 16 0001, ఆర్మూర్‌కు టీజీ 16 ఏ 0001, బోధన్‌కు టీజీ 16B 0001 నంబర్లను కేటాయించారు. ఇందులో టీజీ 16A 0001 నంబర్ కోసం ఓ వాహనదారుడు రూ.లక్ష చెల్లించాడు. టీజీ 16 0789కు రూ.52,665, టీజీ 16 0001కు రూ.50 వేలు, టీజీ 16B 0333 నంబర్ రూ. 30వేల ధర పలికింది.

News March 19, 2024

NZB: తాడు కట్టుకుని కాల్వలో దూకి దంపతుల ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. బోధన్ మండలం అమ్ధాపూర్‌కి చెందిన బాబయ్య(65), పోచమ్మ (60) పేదరికంలో మగ్గుతున్నారు. ఉర్లో అప్పులు కావడం, తీర్చే మార్గం లేగ నిజామాబాద్‌లో 4 నెలలుగా బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన వారు నడుముకు తాడు కట్టుకుని నుస్రత్‌నగర్‌లోని నిజాంసాగర్ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.