India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD SC స్టడీ సర్కిల్ అధ్వర్యంలో నిర్వహించే సివిల్స్ ఉచిత కోచింగ్ కోసం SC, ST, BC విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు NZB జిల్లా SC అభివృద్ధి అధికారి శశికళ తెలిపారు. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ పాసై వార్షిక ఆదాయం రూ.3లక్షలకు కంటే తక్కువ ఉన్నవారు అర్హులన్నారు. జులై 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జులై 21న రాత పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నాగయ్య అనే వ్యక్తి <<13460682>>గొంతు కొసి<<>>న విషయం తెలిసిందే. గతంలో దివ్యాంగురాలైన నాగయ్య కుమార్తెపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు స్థానికులు తెలిపారు. కాగా జైలులో శిక్ష అనుభవించిన యువకులు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు. నిన్న రాత్రి నాగయ్యపై కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
NZB జిల్లా ప్రజలకు CP కల్మేశ్వర్ పలు సూచనలు చేశారు. A సర్టిఫికెట్ సినిమాలకు థియేటర్‌లోకి బాలలను అనుమతించకూడదన్నారు.. జిల్లాలో ఊరేగింపులు, బహిరంగ ప్రదేశాల్లో, కళ్యాణ మండపాల్లో డీజేలు నిషేధమని పేర్కొన్నారు. బహిరంగ సభలకు ACP వద్ద లేదా CP వద్ద, విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు స్టాచ్యూ కమిటీ సిఫార్సు తప్పనిసరన్నారు. గల్ఫ్ ఏజెంట్లకు ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు పోలీస్ స్టేషన్‌లో ఎంక్వయిరీ చేయాలని సూచించారు.
వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గొంతు కోసిన ఘటన నాగిరెడ్డిపేటలో చోటుచేసుకుంది. మండలంలోని రాఘవపల్లికి చెందిన నాగయ్య(55) సోమవారం రాత్రి కాలకృత్యాలు తీర్చుకొని వస్తుండగా పోచమ్మ గుడి వద్ద గుర్తు తెలియని దుండగులు అతడిపై కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారయ్యారు. అతడిని చికిత్స నిమిత్తం స్థానికులు ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ CP కల్మేశ్వర్ బదిలీపై ఊహాగానాలకు తెరపడింది. నిన్న జరిగిన IPSల బదిలీల్లో ఆయన పేరు లేకపోవడంతో ఇప్పట్లో ఆయన బదిలీ లేనట్లేనని స్పష్టత వచ్చింది. కల్మేశ్వర్ సతీమణి అయిన IPS అధికారిణి రోహిణీ ప్రియదర్శిని డిచ్పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీపై వస్తుండటంతో CP ట్రాన్స్ఫర్ వార్తలకు చెక్ పడింది. సీపీ కల్మేశ్వర్ బదిలీ అవుతారంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ బెటాలియన్ పోలీస్ కమాండెంట్‌గా 2012 బ్యాచ్‌కు చెందిన IPS అధికారిణి రోహిణీ ప్రియదర్శిని నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న కమాండెంట్ బి.రాం ప్రకాశ్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో 2 దేవాలయాల్లో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హనుమాన్ దేవాలయం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారని చెప్పారు. హనుమాన్ ఆలయంలో హుండీని పగలగొట్టి నగదును అపహరించగా, శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో చోరీకి విఫలయత్నం చేశారని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ బెటాలియన్ పోలీస్ కమాండెంట్‌గా 2012 బ్యాచ్‌కు చెందిన IPS అధికారిణి రోహిణీ ప్రియదర్శిని నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న కమాండెంట్ బి.రాం ప్రకాశ్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
కామారెడ్డి జిల్లాలో ప్రాజెక్టులో పడి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలో చోటుచేసుకుంది. హాసన్ పల్లి గ్రామ శివారులోని ప్రాజెక్టులో సోమవారం తిమ్మారెడ్డి తాండకు చెందిన కేతావత్ జైపాల్ (35) చేపలు పట్టడానికి వెళ్లి నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సోమవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ.. నిబద్దతతో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసిన నాయకులను పార్టీ గుర్తిస్తుందన్నారు. దానికి కిషన్ రెడ్డి నిదర్శనమని కొనియాడారు.
Sorry, no posts matched your criteria.