India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన ఘటనలో 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో గంగాధర్ తెలిపారు. మోపాల్ మండలంలోని కాల్పోల్ ప్రాంతంలో శుక్రవారం ప్లాంటేషన్ భూములు దున్నడాన్ని అడ్డుకున్న ఎఫ్ఆర్వో రాధిక, సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో 30 మందిపై కేసు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. కాగా వారిలో 8 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు.
బక్రీద్ వేడుకను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం, సుహృద్భావ వాతావరణం వెల్లివిరియాలని కోరారు. సోమవారం నాటి వేడుకను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.
బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని NZB సీపీ కల్మేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖిల్లా ఈద్గా, బోధన్ బస్టాండ్ ఈద్గా, పులాంగ్ ఈద్గాల్లో ముస్లిం సోదరులు ప్రార్థన చేయనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పై మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన రమేశ్ కార్తీక్ నాయక్‌కు యువ పురస్కార్ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. వివేక్‌నగర్ తండాలో సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టిన రమేశ్.. గిరిజనుల జీవిత గాథలపై రాసిన తెలుగు కథల సంపుటి ‘ఢావ్లో’ రచనకు యువపురస్కారానికి ఎంపికయ్యారు. అతిపిన్న వయస్సులో రమేశ్ ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. రమేశ్ కార్తీక్ నాయక్‌ను బీఆర్ఎస్ నేత కేటీఆర్ అభినందించారు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన రమేశ్ కార్తీక్ నాయక్‌కు యువ పురస్కార్ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. వివేక్‌నగర్ తండాలో సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టిన రమేశ్.. గిరిజనుల జీవిత గాథలపై రాసిన తెలుగు కథల సంపుటి ‘ఢావ్లో’ రచనకు యువపురస్కారానికి ఎంపికయ్యారు. అతిపిన్న వయస్సులో రమేశ్ ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. రమేశ్ కార్తీక్ నాయక్‌ను బీఆర్ఎస్ నేత కేటీఆర్ అభినందించారు.
ఎల్లారెడ్డి మండలం సాతెల్లి గ్రామంలో శనివారం కుర్మ దుర్గయ్య హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం లక్ష్మితో 15 ఏళ్ల క్రితం దుర్గయ్య పెళ్లి జరిగింది. విడాకులు తీసుకోవడానికి కోసం భార్యకు కొంత భూమిని సైతం ఆమె పేరునా మార్చాడు. కొంత భూమి తాను ఉంచుకున్నాడు. ఆ భూమి విషయమై భార్య లక్ష్మి, కుమారుడు గౌతమ్, మామ సాయిలు కలిసి కుర్మ దుర్గయ్య పై దాడి చేయగా తీవ్ర గాయాలతో దుర్గయ్య మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
నగరంలోని 3వ టౌన్ పరిధిలో ఉన్న గౌతమ్ నగర్‌లో వ్యభిచార గృహంపై శనివారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి చేశారు. ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి, సీఐ పురుషోత్తం ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు నిర్వహించారు. నలుగురు విటులను అరెస్టు చేసి వారి వద్ద రూ.10వేలు, 5 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్మూర్ MLA పైడి రాకేశ్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని ఆయన్ను కోరారు. ఎమ్మెల్యేతో పాటు BJP రాష్ట్ర నాయకుడు పెద్దోళ్ల గంగారెడ్డి ఉన్నారు.
బీర్ బాటిల్‌తో యువకుడి గొంతు కోసిన ఘటన ఆర్మూర్‌లో జరిగింది. బిహార్‌కు చెందిన సోనుకుమార్ పై దుండగులు ఆర్మూర్‌లోని సిద్దుల గుట్ట ప్రాంతంలో శనివారం బీర్ బాటిళ్లతో దాడి చేసి గొంతు కోశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని గమనించిన స్థానికులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మానసిక ఒత్తిళ్లు, కుటుంబ, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు.. ఇలా వివిధ కారణాలతో తనువు చాలించే వారి సంఖ్య కామారెడ్డి జిల్లాలో పెరుగుతోంది. జిల్లాలో రోజూ ఏదో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య కేసులు నమోదు అవుతునే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2022లో 416 మంది, 2023లో 386 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకు 159 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.