India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడ్కోల్ డబుల్ బెడ్రూం కాలనీలో ఒంటరిగా నివాసం ఉంటున్న ఉప్పరి సాయవ్వ(70)ను ఈ నెల 12న గొంతు కోసి హత్య చేసిన ఘటనలో నిందితుడు తొడిమెల సాయిబాబాను శనివారం అరెస్ట్ చేసినట్లు బాన్సువాడ సీఐ కృష్ణ తెలిపారు. నిందితుడు బెట్టింగ్ లతో అప్పులపాలై సాయవ్వ వద్ద రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడని, ఒంటరిగా ఉన్న సాయవ్వను ఎలాగైనా హత్య చేసి ఆమె వద్ద ఉన్న ఆభరణాలు దోచుకునేందుకు పథకం ప్రకారం హత్య చేశాడని సీఐ వివరించారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బదిలీ అయ్యారు. ఆయనను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. కాగా కామారెడ్డి కలెక్టర్‌గా 2016 బ్యాచ్ IAS అధికారి ఆశీష్ సంగ్వాన్ నియమితులయ్యారు. ఈయన నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకుసాగుతోంది. నిజామాబాద్ రీజీయన్‌లో ఏసీ బస్సులు ఆర్టీసీకి భారీగా ఆదాయాన్ని సమకూర్చాయి. వేసవిలో వేడిమి తట్టుకునేందుకు ప్రయాణీకులు వీటిని ఆశ్రయించారు. రెండు డిపోల్లోని ఏసీ బస్సులు పిబ్రవరి నుంచి మే వరకు రూ. 8.52 కోట్ల ఆదాయం సమాకూర్చాయి. నిజామాబాద్ – JBSకు నిత్యం 19 ఏసీ బస్సులు నడిపిస్తున్నారు. నిత్యం సగటున రూ.6 లక్షల ఆదాయం సమకూరుతోంది.
నిజామాబాద్ రెడ్ క్రాస్ శాఖకు అవార్డుల పంట పండింది. ఈ సందర్భంగా రావాణాశాఖ మంత్ర పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఉత్తమ రక్తదాతగా పురుషోత్తం రెడ్డి, ఉత్తమ ప్రోత్సాహకుడిగా రవీందర్, స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించిన మోహన్ రెడ్డి, కళాశాల విభాగంలో విజయ్ బాబు అవార్డులు అందుకున్నారు. కామారెడ్డికి చెందిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర ఛైర్మన్ బాలు ఉత్తమ రక్తదాత పురస్కారం అందుకున్నారు.
విద్యార్థులు తక్కువగా ఉన్నారనే కారణంతో ఎనిమిదేళ్ల క్రితం కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లి(జి) ప్రాథమిక పాఠశాలను అప్పటి ప్రభుత్వం మూసేసింది. దీంతో విద్యార్థులు పక్క గ్రామాలకు వెళ్లి చదువుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ ప్రతి గ్రామంలో పాఠశాల ఉండాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎనిమిదేళ్ల తర్వాత తిమ్మక్ పల్లి పాఠశాలను తెరిపించారు.
ఓ మహిళ మెడలోంచి 3 తులాల బంగారు పుస్తెల తాడును లాకెళ్లిన ఘటన డిచ్పల్లి PS పరిధిలో శుక్రవారం జరిగింది. SI మహేష్ వివరాలిలా.. మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో మొగుళ్ల వినోద కిరణా షాప్‌లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి సిగరెట్ తీసుకొని రూ.50 ఇచ్చారు. తిరిగి డబ్బులు ఇచ్చే క్రమంలో మహిళ మెడలోంచి పుస్తెలతాడును లాక్కెళ్లారు. ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ధరణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో సమావేశమయ్యారు. ధరణిలో వివిధ మాడ్యూల్స్ కింద దాఖలైన దరఖాస్తులను తక్షణమే పరిశీలిస్తూ, యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు.
డిచ్పల్లి మండలం నడిపల్లి శివారులోని చెరువులో ఈనెల 12న మృతిచెందిన పవర్ లలిత ది హత్యేనని డిచ్‌పల్లి సీఐ మల్లేశ్ తెలిపారు. లలిత భర్తతో గొడవపడి, నడిపల్లిలో గత కొన్ని ఏళ్లుగా జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రాథోడ్ వినోద్ అనే వ్యక్తితో లలిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. లలితను ఎలాగైనా వదిలించుకోవాలని వినోద్ ఈనెల 12న నడిపల్లి శివారులోని చెరువు వద్దకు తీసుకెళ్లి హత్యచేశాడు.
నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో ఇద్దరు మధ్యలో జరిగిన గొడవలో ఒకరు మృతిచెందినట్లు శుక్రవారం రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం1లో నాందేడ్‌కు చెందిన సతీశ్‌శర్మ, రాజు ఇద్దరు గొడవపడ్డారు. ఈ గొడవలో సతీష్‌శర్మ, రాజును నెట్టివేశాడు. దీంతో రాజు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై తెలిపారు.
అర్జీలపై తక్షణమే స్పందిస్తూ, సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజావాణి కార్యక్రమం పట్ల ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంపొందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ.. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం చేపడుతున్న చర్యలకు సంబంధించి రోజువారీగా తనకు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.