India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి జిల్లా పిట్లంలోని సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ వెనుకాల ఆటోలో శుక్రవారం ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆటోలో దొరికిన పత్రాల ఆధారంగా మృతుడు సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మార్డి గ్రామానికి చెందిన చాకలి కాశీరాంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
KMR జిల్లాకు చెందిన డా.బాలు రక్త దాతల సమూహాన్ని 2007లో ఏర్పాటు చేశారు. వాట్సప్ గ్రూప్ ద్వారా సమాచారాన్ని సేకరించి ఆపదలో ఉన్న వారికి వీరు రక్తం అందిస్తున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 2yrsలో 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఫలితంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు డా. బాలు 73 సార్లు రక్త దానం చేసి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఏడేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈదాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. సోమారం తండాకు చెందిన శైలజ అనే బాలిక తన ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు గమనించి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తన ప్రియురాలి కుమార్తెను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 11న నల్గొండ జిల్లా ఐలాపురంలో 22 నెలల చిన్నారిని హత్య చేసిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామానికి చెందిన అరవింద్ రెడ్డి వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నవ్య శ్రీ తన ఇద్దరి కుమార్తెలతో కలిసి అరవింద్ రెడ్డితో ఐలాపురంలో నివాసం ఉంటోంది.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ పది, ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు డీఈవో దుర్గాప్రసాద్, ఉమ్మడి జిల్లా సమన్వయకర్త తుల రవీందర్ తెలిపారు. పది పరీక్షలకు జిల్లా నుంచి మెుత్తం 1592 మంది హాజరుకాగా 1310 మంది ఉత్తీర్ణులై 82.29 శాతం సాధించినట్లు పేర్కొన్నారు. ఇంటర్ లో మెుత్తం 1699 మందికి 1100 మందితో 64.74 ఉత్తీర్ణత శాతం సాధించినట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్, TPCC క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించినందుకు వారు ఆయన్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి సంబంధించిన మధ్యాహ్న భోజన పథకం నిధులను విడుదల చేసింది. ఒకటి నుంచి 8వ తరగతి కుకింగ్ కాస్ట్ రూ.3.81 కోట్లు, సీసీహెచ్‌ల వేతనం రూ.78.86 కోట్లు మండలాల వారీగా ఎంఈవో ఎస్ఎన్ఏ అకౌంట్‌లో జమ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. అలాగే మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు పీఎఫ్ ఎంఎస్ ద్వారా బిల్లులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన బిక్కనూరులో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఆకుల నర్సింలు (56) నిన్న బుధవారం చేపల వేటకై బొబ్బిలి చెరువులోకి వెళ్లాడు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఈతరాక మృతి చెందాడు. కాగా ఇవాళ మృతదేహం బయటకు తేలింది. మృతుడి భార్య కిష్టవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కువైట్‌లోని మంగాఫ్ లేబర్ క్యాంపులో జరిగిన ప్రమాద ఘటనపై నిజామాబాద్ వాసుల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా మృతి చెందగా మరో 50 మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో జిల్లా మెుత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 12 వేల మంది అక్కడ లేబర్ క్యాంపుల్లో ఉన్నట్లు సమాచారం. ఎప్పుడు ఎలాంటి విషయం వినాల్సి వస్తుందోనని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. NZB జిల్లా రెంజల్ మండలానికి చెందిన నవ్యశ్రీకి అదే మండలానికి చెందిన లక్ష్మణ్‌తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి అరుణ్య, మహన్వి(22నెలలు) కుమార్తెలున్నారు. 7 నెలల క్రితం అరవిందరెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తను వదిలేసి చిన్నారులతో నల్గొండ జిల్లాకు వెళ్లి నివాసం ఉంటోంది. తన వివాహేతర సంబంధానికి మహన్వి అడ్డువస్తోందని అరవిందరెడ్డి హతమార్చాడు.
Sorry, no posts matched your criteria.