India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ CP ఆఫీస్‌లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మాక్లూర్ మండలం దాస్‌నగర్‌కు చెందిన నర్సమ్మ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నర్సమ్మకు చెందిన 20 గజాల స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు ఆమె కూతురు గంగాలక్ష్మి తెలిపింది.
భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురై భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. వినాయక్ నగర్‌కు చెందిన మహమ్మద్ అన్వర్‌కు భార్యతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అన్వర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు 4వ టౌన్ ఎస్ఐ సంజీవ్ తెలిపారు.
డిచ్పల్లిలోని సీఎంసీ ప్రాంతంలో జరిగిన వెంగల్ హత్య కేసులో నిందితులను రిమాండుకు తరలించినట్లు సీఐ మల్లేశ్ తెలిపారు. వెంగల్‌కు చెందిన భూమి అతని బంధువు బిజ్జు పేరుపై ధరణిలో ఉండగా కొత్త పట్టాదాసు పాస్ పుస్తకం వచ్చింది. భూమికి సంబంధించి రుణమాఫీ, రైతు బంధు డబ్బులు బిజ్జు తీసుకుంటోంది. తన భూమిని తన పేరుపై మర్చాలని వెంగల్ అడగటంతో బిజ్జు, ఆమె కొడుకు ప్లాన్ ప్రకారం మద్యం తాగించి వెంగళ్ ను హత్య చేశారు.
ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అమెరికాలోని అట్లాంటా నగరంలో పర్యటించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా అట్లాంటా నగరంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సంస్థ నిర్వహించిన (NDA) విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని చూసి మరోసారి BJP పార్టీని ప్రజలు ఆశీర్వదించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆల్ ఇండియా రైఫిల్ రైఫిల్ షూటింగ్ పోటీలకు నగరంలోని నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ మహిళ కానిస్టేబుల్ రేఖారాణి (డబ్ల్యూ పీసీ 325) ఎంపికయ్యారు. ఇటీవల హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీ ల్లో రేఖారాణి రాణించారు. ఈనెల 15 నుం చి తమిళనాడులోని ఒతీవాకం ఫైరింగ్ రేంజ్లో నిర్వహించనున్న ఆలిండియా పోలీస్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో రాష్ట్ర పోలీస్ జట్టు తరఫున రేఖారాణి పాల్గొననున్నారు.
నిజాంసాగర్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు JEE అడ్వాన్స్‌డ్ ప్రవేశ పరీక్షలలో ఆల్ ఓవర్ ఇండియాలోనే బి. శ్రీకాంత్ (265)వ ర్యాంక్, బి. జగన్ (953)వ ర్యాంక్ సాధించినట్లు ప్రిన్సిపాల్ సత్యవతి తెలిపారు. దీంతో విద్యార్థులను ప్రిన్సిపల్ సత్యవతి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు ప్రత్యేక విద్య బోధన అందించిన ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ అభినందించారు.
జుక్కల్ మండలంలో దారుణం జరిగింది. తండ్రిని కొడుకు హత్య చేశాడు. ఎస్సై వివరాల ప్రకారం.. సోపూర్ కు చెందిన లాలప్పకు(75) ఇద్దరు కొడుకులు. లాలప్ప తనకున్న భూమిలో కొడుకులకు వాటా ఇచ్చి భిక్షాటన చేస్తున్నాడు. అయితే చిన్న కుమారుడు సుభాష్ చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో తరచూ గొడవపడేవాడు. భూమిని సుభాష్ ఎక్కడ అమ్ముతాడోనని లాలప్ప కొంత భూమి కోడలి పేరుపై మార్చారు. దీంతో కోపం పెంచుకున్న సుభాష్ తండ్రిని హత్య చేశాడు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు చర్యలు చేపట్టాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు.
2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, భవిత కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు (PTI), కేర్ గివింగ్ వాలంటీర్లు (CGV)లను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని సమగ్ర శిక్ష ఎక్స్ అఫిషియో స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ డా.మల్లయ్య భట్టు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 88 మంది PTIలు, 19 మంది CGVలు విధుల్లో చేరనున్నారు.
నాగిరెడ్డిపేటలోని మహిళా సమైక్య కార్యాలయంలో సోమవారం నూతనంగా ఎంపీపీ బాధ్యతలు చేపట్టిన టేకులపల్లి వినీతను మండల సమైక్య అధ్యక్షురాలు సుశీల, ఐకేపీ ఏపీఎం జగదీశ్ శాలువాతో సన్మానించారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే ఎంపీపీని సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.