India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి NZB జిల్లా రోజు రోజుకు నిప్పుల కొలిమిని తలపిస్తుంది. మధ్యాహ్నం వేళ జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్య పట్టణాల్లోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నేడు NZB జిల్లా డిచ్పల్లి (మం) కొరట్పల్లిలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. KMR జిల్లా నిజాంసాగర్ (మం) హాసన్ పల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
ప్రాచీన కట్టడాలను పునరుద్ధరించడానికి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లింగంపేటలోని పురాతన మెట్ల బావిని శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురాతన బావిలో పూడిక తీస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. యువకులు శ్రమదాన కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందనీయమని కొనియాడారు.
అర్వింద్ ఎంపీగా ఉండి జిల్లాకు చేసింది శూన్యమని బాజిరెడ్డి అన్నారు. ఆయనపై ఏడు సెగ్మెంట్ల ప్రజలు గుర్రుగా ఉన్నారన్నారు. ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి.. రైతులను మోసం చేశాడని మండిపడ్డారు. అప్పుడేమో బాండ్ పేపర్ చూపించి ఓట్లు దండుకున్న అర్వింద్ మళ్లీ ఇప్పుడు ఇటీవల ఏదో జీవో కాపీ తీసుకువచ్చి ఎంపీగా గెలిపించాలని ఓట్లు అడగడం ఎంతవరకు సమంజసమన్నారు.
పొతంగల్‌లో అన్నను తమ్ముడు <<12993064>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గోవింద్, విఠల్ అన్నాదమ్ములు. విఠల్ తరచూ తన భార్యతో గొడవపడుతుండడంతో అన్న మందలించేవాడు. ఈక్రమంలో గోవింద్‌పై కక్షపెంచుకున్నాడు. గురువారం ఇంటికి వచ్చిన అన్నను విఠల్ గొడ్డలితో నరికి హతమార్చాడు. మృతుడి భార్య విఠల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కొడుకులు గొడవ పడుతున్నారని తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన నవీపేట మండలం నాగేపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంగామణి(55)కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యవసాయ భూమి విషయంలో కొడుకులిద్దరూ 15 రోజులుగా గొడవ పడుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన గంగామణి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కొడుకుల మధ్య జరిగిన గొడవతో తల్లి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు వివరించారు. కేసు నమోదైంది.
మెండోరా(M) బుస్సాపూర్ NH 44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. SI శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ మండలం సుర్బీర్యాల్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు గోదావరి నదికి పూజలు చేసేందుకు వెళ్తున్నారు. రహదారి మధ్యలో ఉన్న పువ్వులు తెంపడానికి వచ్చింది. తిరిగి ఆటో వద్దకు వెళ్లే క్రమంలో ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గర్భిణి మృతి చెందినట్లు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలోని పురపాలికల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం పన్ను రాయితీ కల్పిస్తూ సర్కారు తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఈ నెలాఖరులోపు చెల్లించేవారికి అవకాశం వర్తించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో బకాయిలు లేనివారికి ప్రస్తుతం రాయితీ ఇచ్చారు. బకాయిలు 85 శాతం దాటి వసూలు కావడంతో ఈ సారి నూతనంగా ప్రకటించిన పథకానికి స్పందన వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రుద్రూర్: రథసప్తమి సందర్భంగా ఇండియన్ యోగ అసోసియేషన్ యోగాలయ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ తమిళనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన 108 రౌండ్ల సూర్య నమస్కార సాధనలో రుద్రూర్ యోగ సాధకులు ప్రత్యేకత చాటారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కూతురు, కుమారుడు డాక్టర్ విశ్వనాధ్ మహాజన్, అక్షయ శ్రీ, అద్వైత్ మహాజన్ తమ ప్రతిభ తో నోవా వరల్డ్ రికార్డ్, ప్రశంసా పత్రాన్ని సాధించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆరేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గోసం బస్తీకి చెందిన రేణుక తన కొడుకు నాని(6)ని తీసుకుని రాకాసిపేటలో కూలీ పనికి వెళ్లింది. అక్కడ నాని ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవటంతో రేణుక బోధన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు.
డిచ్పల్లి, నిజామాబాద్ రైల్వే స్టేషన్ మధ్యలో కిలో మీటర్ 467/8-7 వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే SI సాయి రెడ్డి తెలిపారు. మృతుడి వయస్సు 45-50 సంవత్సారాలు ఉంటుందని, అతని కుడి చేతి పైన శంకర్ అని పచ్చ బొట్టు ఉందన్నారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తు పడితే వెంటనే నిజామాబాద్ రైల్వే పోలీసులను సంప్రదించాలని, ఫోన్ నంబర్ 87126 58591కు సమాచారం ఇవ్వాలని SI సూచించారు.
Sorry, no posts matched your criteria.