India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ పులాంగ్ చౌరస్తా బ్రిడ్జి దాటిన తరువాత యాదగిరి బాగ్ కమాన్ ఎదురుగా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైందని నిజామాబాద్ 4వ టౌన్ SHO తెలిపారు. సుమారు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసుగల ఈ వ్యక్తి రోడ్డు దాటుతుండగా కిందపడి దెబ్బలు తగిలి మరణించాడన్నారు. ఇతని వివరాలు తెలిసినవారుSHO NZB 4 Town 8712659840, NZB 4 town PS 8712659719 నంబర్లను సంప్రదించాలని కోరారు.
కామారెడ్డి మహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం వంతెన పై నుంచి లారీ కింద పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొగ్గుగుడిసె నుంచి బాన్సువాడ వైపు అతివేగంగా వెళ్తున్న ఓ లారీ నర్వ గ్రామ సమీపంలో అదుపుతప్పి సింగీతం ప్రాజెక్టు వంతెనపై నుంచి కిందికి పడిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. అంబులెన్స్ ద్వారా అతన్ని బాన్సువాడ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
నవీపేట పోలీస్ స్టేషన్ వద్ద ఓ వ్యక్తికి చెందిన బైక్ చోరీ జరిగింది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. నవీపేట కుమ్మరికాలనీకి చెందిన మల్లేశ్ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. దీనిపై సదరు బాధితుడు శుక్రవారం ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. తన బైక్‌ను పోలీస్ స్టేషన్ పార్కింగ్ స్థలంలో తాళం వేసి నిలిపాడు. తిరిగి వచ్చే సరికి వాహనం కనిపించలేదు. విస్మయానికి గురైన ఆయన మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కామారెడ్డి పట్టణంలోని కల్కి నగర్‌లోని శ్రీ కల్కి భగవాన్ శ్రీ భగవతి పద్మావతి దేవి కళ్యాణ మహోత్సవానికి ఆదివారం మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. గుడిలకు సంబంధించిన ఏ సమస్య ఉన్న నా దగ్గర దాకా తీసుకురావాలని, ఆలయాలకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.
మూగజీవాలను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాగిరెడ్డిపేట మండల ఎస్సై రాజు తెలిపారు. బక్రీద్ సందర్భంగా గోవులను తరలించడానికి పశువైద్యాధికారి ధ్రువీకరణపత్రం తప్పనిసరిగా ఉండాలన్నారు. మూగజీవాలను తరలిస్తున్నట్లు తెలిస్తే వారికి సమాచారం ఇవ్వాలని, వాహనాలను అడ్డుకొని గొడవలు చేయడం సరికాదన్నారు. పశువుల రవాణాకు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బక్రీద్‌ను శాంతియుతంగా చేసుకోవాలని సూచించారు.
నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాలో ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అభ్యర్థులు పరీక్ష రాశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని సెంటర్లలో మహిళా అభ్యర్థులను మెడలోంచి చైన్లు తీయాలంటూ ఒత్తిడి చేశారని పలువురు ఆరోపించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థుల కోసం ఈ నెల 14న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈవో షేక్ సలాం ఓ ప్రకటనలో తెలిపారు. టెక్ బి ప్రోగ్రాం కోసం సీఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్ గ్రూప్‌లలో ఇంటర్ పూర్తి చేసుకున్నవారు మేళాకు రావాలన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రం, ఇంటర్ మార్కుల ఆన్ లైన్ జాబితా, ఆధార్ కార్డుతో మేళాకు హాజరుకావాలని సూచించారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ ద్వారా 17వేల కేసులు పరిష్కారమైనట్లు న్యాయసేవా సంస్థ కార్యదర్శి పద్మావతి తెపారు. 153 సైబర్ క్రైం కేసులు పరిష్కరించి రూ.9 లక్షలు బాధితులకు పోలీసుల ద్వారా అందజేశారు. మోటారు బీమాకు 51 కేసులకు సంబంధించి రూ. 2.18 కోట్ల పరిహారం అందించారు. జిల్లా జడ్జి కుంచాల సునీత మాట్లాడుతూ.. పట్టు విడుపు ధోరణితో కక్షిదారులు కేసులు పరిష్కరించుకోవాలని అన్నారు.
చెల్లిని కాపాడబోయి అక్క మృతి చెందిన ఘటన కమ్మర్ పల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కమ్మర్‌పల్లి గాంధీ నగర్‌కు చెందిన మంజుల భర్తతో గొడవలు జరుగుతున్నాయని ఇంటికి సమీపంలో ఉన్న వరద కాలువలో దూకింది. ఆమె వెనుక అక్క శ్యామల పరుగెత్తుకుంటూ వెళ్లి కాపాడడానికి వరద కాలువలో దూకగా అక్క మరణించింది. అక్కడ ఉన్నవారు చీరను విసరగా మంజుల దానిని పట్టుకొని పైకి వచ్చింది. శ్యామల మరణించింది.
Sorry, no posts matched your criteria.