India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగిరెడ్డిపేట్ ఇన్‌ఛార్జ్ MPP, వైస్ ఎంపీపీ దివిటి రాజ్ దాస్‌పై BRS పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. MPP ఆఫీస్‌లో RDO ప్రభాకర్ సమక్షంలో గురువారం అవిశ్వాస తీర్మానంపై బలనిరూపణ జరిగింది. 9 మంది ఎంపీటీసీ సభ్యుల్లో ఆరుగురు ఆయనకు వ్యతిరేఖంగా ఓటు వేశారు.
చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేయబోయిన ఘటనలో ఓ వ్యక్తికి కామారెడ్డి జిల్లా అడిషనల్ డిస్టిక్ సెషన్స్ జడ్జి శ్రీనివాస్ నాయక్ మూడేళ్ల జైలు శిక్ష విధించారు. రామారెడ్డి మండలానికి చెందిన కనకయ్య(55) 2022వ సంవత్సరంలో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి యత్నించినట్లు సీఐ నరేశ్ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కోర్టు బుధవారం నిందితుడికి జైలు శిక్ష విధించింది.
ఇన్‌స్టాలో పరిచయమైన యువతిపై అత్యాచారం చేసిన ఘటనపై బుధవారం హన్మకొండ జిల్లా సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. KNRకు చెందిన నర్సింగ్ విద్యార్థిని WGL ప్రభుత్వ సంస్థలో శిక్షణ పొందుతోంది. ఇటీవల KMRకి చెందిన సతీశ్‌తో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో సతీశ్ ఆమెను KMRకి రావాలని కోరాడు. 2రోజుల కిందట అక్కడకు వెళ్లిన ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కోసం నిర్వహించిన శిక్షణకు డుమ్మా కొట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు డీఈవో షాక్ ఇచ్చారు. ఈ నెల 1, 2 తేదీల్లో జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణకు జిల్లాలోని 84 మంది ఉపాధ్యాయులు డుమ్మా కొట్టారు. వారికి నోటీసులు జారీ చేసి సంజాయిషీ చెప్పాలన్నారు.
యువత మద్యం తాగి వాహనాలు నడపరాదని, గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదాలలో యువతే అత్యధికంగా ఉన్నారని నిజమాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బుధవారం పేర్కొన్నారు. కాగా 2023లో మొత్తం 767 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా అందులో 337మంది మరణించారు. మార్చ్(2024)నెలలో 649 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా అందులో 267మందికి జైలుశిక్ష పడింది. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సీపీ సూచించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాగునీటిని పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తాగునీటిని పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా శరత్‌ను నియమించారు.
విద్యార్థినిపై లైంగిక వేధింపులకు దిగిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన 9తరగతి విద్యార్థినిని అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ శర్మ లైంగిక వేధించసాగాడు. సదరు బాలిక ఈ విషయం తల్లిదండ్రులకు వివరించింది. వారు షీ టీంను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన షీటీం విచారణ చేపట్టి ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసింది.
రాష్ట్రంలో CAA ఎందుకు అమలు చేయరో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. బుధవారం ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించాలన్నారు. పార్లమెంటులో ఆమోదం పొందిన చట్టం దేశం మొత్తం అమలు చేయాలి కానీ ఇలా ‘ మేము అమలు చేయం ’ అని అనడానికి ఉత్తమ్ ఎవరని నిలదీశారు. ఏ అధికారంతో ఈవ్యాఖ్యలు చేశారో చెప్పాలని MP ప్రశ్నించారు.
ప్రేమ జంటపై ఇరు కుంటుంబీకులు దాడి చేసిన ఘటన సోమవారం రాత్రి భిక్కనూరులో జరిగింది. మండలానికి చెందిన యువకుడు, తిప్పాపూర్‌కి చెందిన యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం భిక్కనూరు టోల్ గేట్ వద్ద HYD బస్సు ఎక్కారు. వారిని వెంబడించిన కుటుంబీకులు రామయంపేట శివారులో యువకుడిని కొట్టి అమ్మాయిని తీసుకెళ్లారు. యువకుడి ఫిర్యాదు మేరకు మంగళవారం ఆరుగురిపై కిడ్నాప్ కేసు నమోదుచేసినట్లు SI సాయికుమార్ తెలిపారు.
తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెంది యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన దోమకొండలో జరిగింది. మండలానికి చెందిన వంశీ(24) కొన్నిరోజులుగా బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడు. వారు నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యి సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు SI గణేశ్ తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.