India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఆర్మూర్ డివిజన్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ డివిజన్లోని కమ్మర్ పల్లి – అంతర్ జిల్లా చెక్ పోస్ట్, దూద్గాం – అంతర్ జిల్లా చెక్ పోస్ట్, తల్వేదా – అంతర్ జిల్లా చెక్ పోస్ట్, భీంగల్ – SST చెక్ పోస్ట్ పరిధిలో SST& పోలీస్ సిబ్బంది విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో సిబ్బంది పాల్గొన్నారు.
మద్యం తాగి వాహనం నడుపుతూ..హైదరాబాద్‌కి చెందిన వ్యక్తి సయ్యద్ సుల్తాన్.. సదాశివనగర్ పోలీసులకి పట్టుబడ్డాడు. ఆ వ్యక్తిని పోలీసులు కామారెడ్డి రెండవ తరగతి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ప్రతాప్ ముందు హాజరు పరచగా మూడు రోజుల జైలు శిక్ష, రూ.300 జరిమానాన్ని విధించారు. మద్యం తాగి వాహనాలని నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో దండబోయిన మణేమ్మ (40) అనే అంగన్వాడీ ఆయా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్తనే హత్య చేసి ఉంటారని మృతురాలి బంధువుల ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రామారెడ్డి పోలీసులకి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యనా..? హత్యనా అనే కోణంలో పోలిసులు విచారణ చేపట్టారు. మణెమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
‘A’ సర్టిఫికేట్ పొందిన సినిమాలను చూడటానికి మైనర్‌లను సినిమా థియేటర్లలోకి అనుమతించకూడదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ శింగేనవార్ అన్నారు. వ్యక్తులుగానీ, యాజమాన్యం గాని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు థియేటర్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమాచారం థియేటర్ గేట్ల ముందు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు.
ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిలుక సత్యనారాయణ మృతి చెందగా, అతడి కుమారుడు మధు గాయపడినట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. బోధన్ వైపు వెళ్తున్న బైక్ అదుపు తప్పి బస్సు ఢీకొన్నట్లు పేర్కన్నారు. ఘటనపై సోమవారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఆర్మూర్‌లోని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ 82-2 కో నంబర్ ప్రధాన కాలువ కట్ట సోమవారం తెల్లవారుజామున తెగిపోయింది. దీంతో కాలువను ఆనుకుని ఉన్న జర్నలిస్ట్ కాలనీలోకి భారీగా నీరు వచ్చి చేరింది. నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా రైతుల పంటల సాగు కోసం నీటిని చెరువులకు వదిలే సమయంలో ప్రాజెక్టు ప్రధాన కాలువలను ఇరిగేషన్ అధికారులు శుభ్రం చేయకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని కాలనీవాసులు పేర్కొన్నారు.
కొడుకును తల్లి హత్య చేసిన ఘటన సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో జరిగినట్లు CI సంతోశ్ తెలిపారు. గ్రామానికి చెందిన సాయిలు మార్చి 24న హత్యకు గురైన విషయం తెలిసిందే. జల్సాలకు బానిసైన సాయిలు 7 పెళ్లిళ్లు చేసుకొని భార్యలను వదిలేశాడు. ఈక్రమంలో మద్యానికి బానిసై తల్లి లచ్చవ్వను రోజు వేధించేవాడు. అది సహించలేని లచ్చవ్వ మనుమడు దేవ్, మారుతితో కలిసి అతడి మెడకు టవల్ బిగించి హత్యచేసినట్లు CI వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిలను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా సుదర్శన్ రెడ్డి, జహీరాబాద్ ఇన్‌ఛార్జిగా దామోదర్ రాజ నర్సింహను నియమించారు.
రంజాన్ పండుగ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటు చూసిన సందడి వాతావరణం నెలకొంది. రంజాన్ మాసం మొదలైనప్పటి నుంచి రాత్రంతా దుకాణాలతో వీధులు, ఫుట్ పాత్‌లో కొనుగోలుదారులతో సందడిగా మారాయి. పగలు భారీగా ఎండ ఉండటంతో రాత్రి వేళల్లో రంజాన్ షాపింగ్ చేయడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మీ ప్రాంతంలో రంజాన్ సందడి ఎలా ఉందో కామెంట్ చేయండి.!
మోర్తాడ్ మండలంలోని వడ్యాట్ రోడ్డు వద్ద ఉన్న పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. గుర్తు తెలియని దుండగులు గుడి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు పేర్కొన్నారు. అమ్మవారి బంగారు ముక్కుపుడక, బొట్టు బిల్ల , హుండీలోని డబ్బులు సుమారు రూ.6వేలు దొంగలించినట్లు వెల్లడించారు. పోలీసుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.