India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన జక్రాన్ పల్లిలో జరిగింది. సికింద్రాపూర్ గ్రామానికి చెందిన తలారి బుర్రన్న(42) బాల్ నగర్ నుంచి స్కూటీ పై సికింద్రాపూర్‌కి వస్తుండగా వెనకనుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజాంసాగర్‌లోని నవోదయలో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి జనవరి 20న పరీక్ష నిర్వహించారు. cbseit.in వెబ్ సైట్‌లో రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ సత్యవతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఏడాది లోపు బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ (NSF) ని ప్రభుత్వం తెరిపించబోతుందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ఎన్నో ఖాయిలా ఫ్యాక్టరీలు తెరిపించారని ప్రగల్బాలు పలుకుతున్న అర్వింద్ NSFను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
నిజామాబాద్ నగరంలో ఒకటో టౌన్ పోలీసులు రూ.4.8 లక్షల నగదును పట్టుకున్నారు. శనివారం వీక్లీ మార్కెట్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. శివప్రసాద్ అనే ఫైనాన్స్ వ్యాపారి ఎలాంటి పత్రాలూ లేకుండా రూ.4.8 లక్షల నగదును తరలిస్తుండగా సీజ్ చేసినట్లు వన్‌టౌన్ SHO విజయబాబు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బును తరలించేవారు నగదుకు సంబంధించిన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలన్నారు.
బాన్సువాడ శివారులోని చాదర్ లాక్ కెనాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం బాన్సువాడకు చెందిన దంపతులు మహమ్మద్ ముఖ్తాద్, ఆయేషా దంపతులు వెల్లుట్ల నుంచి బాన్సువాడకు బైక్ పై వస్తున్నారు. వారిని అతివేగంగా వచ్చిన బొలెరో ఢీకొట్టింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు నిజామాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో ముఖ్తార్ మృతి చెందారు.
ఓ రైస్ మిల్లులో చోరీకి వచ్చిన వ్యక్తిని స్థానికులు చితక బాధడంతో మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లోని పాల్దా గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామ పరిధిలోని మూసివేతకు గురైన శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్‌లో ఓ తండాకు చెందిన 8 మంది చోరీకి యత్నించారు. గ్రామస్థులు ప్రతిఘటించడంతో ఏడుగురు పారిపోగా.. బానోతు సునీల్ వారికి దొరికాడు. దీంతో వారు అతడిని తీవ్రంగా కొట్టడంతో సునీల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
వేసవి ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నగర, పురపాలికలకు వివిధ పనులకు సంబంధించి రూ.2.72 ఓట్ల నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తాగునీటి సరఫరాకు, పైప్ లైన్‌లో మరమ్మత్తులకు ఈ నిధులు వినియోగించుకోవాలి. నిజామాబాద్ రూ.96.30 లక్షలు, బాన్సువాడ 38.12, ఎల్లారెడ్డి 35.36, బోధన్ 52.44, కామారెడ్డి 28.31, ఆర్మూర్18.24, బాన్సువాడ 4.19 వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అభినందించారు. ఈ మేరకు ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందచేశారు. 19 సంవత్సరాల తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పటిష్ఠంగా తయారైందన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్నికల సన్నహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాటి చెట్టుపై నుంచి పడి యువకుడు మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన మక్కల శేఖర్(33) శనివారం గ్రామంలోని తాటి ముంజల కోసం చెట్టు ఎక్కి ప్రమాదవ శాత్తు కిందపడ్డాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి భార్య రాజ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వంశీకృష్ణ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.