India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎలాంటి ఆటంకాలు లేకుండా జిల్లాలో ఎన్నికలను సాఫీగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అంకితభావంతో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో తన విజయం పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క నిజామాబాద్ మోదీ కుటుంబ సభ్యుల విజయమని ఎంపీ అరవింద్ అన్నారు. మంగళవారం ఆయన ఎన్నికల కౌంటింగ్ హాల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారన్నారు. తనపై నమ్మకంతో రెండోసారి గెలిపించిన ప్రజల ఆశలను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
ప్రజా తీర్పును గౌరవిస్తానని NZB పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో MPగా గెలిచిన BJP అభ్యర్థి ధర్మపురి అరవింద్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన అరవింద్ NZB పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, ఇప్పుడైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అరవింద్ కు సూచించారు.
నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ సిట్టింగ్ బీజేపీ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. కాగా ప్రస్తుతం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ప్రత్యర్థి అభ్యర్థి జీవన్ రెడ్డి పై భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం భారీ మెజార్టీ దిశగా ధర్మపురి అర్వింద్ దూసుకెళ్తున్నారు.1,22,890 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం వెళ్లిపోయారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ లక్షకు పైగా మెజారిటీతో ఆధిక్యంలో ఉండడంతో ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల తీర్పును శిరసా వహిస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేరకు అర్వింద్ హామీలను అమలు చేయాలని కోరారు.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ధర్మపురి అర్వింద్ 1,00,760 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. రౌండ్ రౌండ్‌కి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ధర్మపురి అర్వింద్ 58,306 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
నిజామాబాద్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో మంగళవారం ఉదయం ఎన్నికల సిబ్బంది ఒకరు స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే సిబ్బంది 108లో నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు. కాగా ఆ ఉద్యోగిని జిల్లాలోని బడా భీంగల్ కు చెందిన జె.నవీన్ గా ఆయన ఐడెంటిటీ కార్డు ద్వారా గుర్తించారు.
NZB పార్లమెంట్ కౌంటింగ్ లో బాల్కొండ నియోజకవర్గంలో BRS మాజీ మంత్రి, MLA ఇలాకాలో BJP అభ్యర్థి అర్వింద్ ధర్మపురి హవా కొనసాగుతోంది. 8వ రౌండు కౌంటింగ్ వరకు మొత్తం 97,909 ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు అరవింద్ ధర్మపురి 49,865 ఓట్లు సాధించి 16,891 మెజారిటీతో ఉన్నారు. ఇక 32,974 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి 2వ స్థానంలో, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ 9,452 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
Sorry, no posts matched your criteria.