India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్ జరిగింది. యెండల టవర్స్ రోడ్డులో ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. మోపాల్ మండలానికి చెందిన దంపతులు శుక్రవారం ఓ పని నిమిత్తం నిజామాబాద్‌కు వచ్చారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆ మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుక్కకాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. నందిపేట లక్కంపల్లి సెజ్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహేశ్(36)ను ఈ నెల 10న విధుల్లో ఉన్న సమయంలో కుక్క కరిచింది. నందిపేట PHCలో టీకాలు ఇప్పించుకున్నాడు. అనంతరం తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స నిమిత్తం ఇవాళ మృతి చెందాడు.
క్రికెట్ ప్రేమికుల కోసం నిజామాబాద్ నగరంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెంకట్రాంరెడ్డి, సత్యపాల్ తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నగరంలోని ఉమెన్స్ కళాశాల మైదానంలో ఈ నెల 30, 31న బిగ్ స్క్రీన్ ద్వారా ఉచితంగా క్రికెట్ మ్యాచ్ చూడవచ్చన్నారు. క్రికెట్ ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నబోయిన అనిల్ (27) అనే వ్యక్తి గురువారం రాత్రి చెట్టుకు ఉరేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంట్లో గొడవ కారణంతోనే చనిపోయినట్లు స్పష్టం చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.
మండలంలో జరిగిన <<12933675>>భారీ చోరీ<<>> కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి రూ.13.50 లక్షల నగదును రికవరీ చేశారు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. మద్నూర్ మండలంలో నివాసం ఉండే మహాజన్ బాలాజీ ఇంట్లో ఈ నెల 26న రాత్రి చోరీ జరిగింది. బీరువాలో దాచిన 25 తులాల బంగారం, నగదు అపహరణకు గురైనట్లు తెలిపారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన పెద్ద చెరువు సమీపంలో వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు టవల్ మెడకు బిగించి హత్య చేసినట్లు సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన కడల సాయిలు (45) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు రోజుల క్రితం హత్య చేసినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
బుక్స్ పేపర్ అండ్ స్టేషనరీ సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. గురువారం నిజామాబాద్‌లోని బైపాస్ రోడ్డులో నిర్మించనున్న సంఘం నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యపాల్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.
పెద్ద కొడప్గల్ ఎస్సై కోనారెడ్డి, సిబ్బందిపై దాడికి పాల్పడిన దుండగులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బిచ్కుంద ఎస్సై తెలిపారు. బేగంపూర్ గేటు వద్ద మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఎస్సై కోనారెడ్డి, సిబ్బందిపై కాస్లాబాద్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మద్యం తాగి వచ్చి గొడవకు దిగి, దాడికి పాల్పడినట్లు వెల్లడించారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలే గెలుపు కొరకు మళ్లీ నిజామాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఓటమి పాలైన బాజిరెడ్డి గోవర్ధన్ BRS నుంచి, కోరుట్ల ఎమ్మెల్యేగా ఓటమి పాలైన సిట్టింగ్ ఎంపీ అర్వింద్ ధర్మపురి BJP నుంచి, జగిత్యాల ఎమ్మెల్యేగా ఓటమి పాలైన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేయనున్నారు.
నిజామాబాద్ నగరానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను గాయత్రీ నగర్ ప్రాంతానికి చెందిన మేడవరపు రాజు(55), మేడవరపు స్వాతి(53)గా పోలీసులు గుర్తించారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా సోమవార్ పేట్ పరిధిలోని లాడ్జిలో సూసైడ్ చేసుకున్నారు. ఈ మేరకు నిజామాబాద్‌కు సమాచారం అందించారు. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.