Nizamabad

News March 27, 2024

కామారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు ఎంతంటే!

image

భిక్కనూర్ 38.7, బీబీపేట్ 37.7, బాన్సువాడ 35.8, మద్నూర్ 39.2, గాంధారి 35.7, ఎల్లారెడ్డి 37.4, కామారెడ్డి 39.9, రామారెడ్డి 37.8, నసురుల్లాబాద్ 36.2, బిచ్కుంద 40.8, నాగిరెడ్డిపేట్ 37.3,పిట్లం 38.5, లింగంపేట్ 37.3, పెద్ద కొడపగల్ 39.9, మాచారెడ్డి 36.6, దోమకొండ 37.7,సదాశివనగర్ 38.0, రాజంపేట 35.2 డోంగ్లి 36.0, నిజాంసాగర్ 38.1 బీర్కూర్ 34.9, జుక్కల్ 38.2, తాడ్వాయి 39.డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 27, 2024

UPDATE కామారెడ్డిలో యువకుడి హత్య.. పరారీలో నిందితులు

image

రామేశ్వర్‌పల్లిలో <<12928467>>యువకుడి హత్య<<>> కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. CI రామన్ వివరాలు.. నిన్న ఉదయం నవీన్ ఆటోలో జిల్లా కేంద్రానికి వెళ్తుండగా గ్రామానికి చెందిన మధు, ప్రవీణ్ దారికాచి కత్తులతో దాడి చేశారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి అది చూసి ఆపే ప్రయత్నం చేశాడు. వారు అతడిపై దాడికి యత్నించగా పరారై గ్రామస్థులకు చెప్పాడు. తీవ్ర రక్తస్రావంతో అప్పటికే నవీన్ చనిపోయాడు. నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు.

News March 27, 2024

6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: కలెక్టర్

image

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి మంగళవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ కోసం జిల్లాలో చేపడుతున్న చర్యల గురించి సీ.ఎస్ దృష్టికి తెచ్చారు. రబీ సీజన్లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు.

News March 27, 2024

మద్నూర్: ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, నగదు చోరీ

image

ఉమ్మడి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా మద్నూరులో ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. మద్నూరుకు చెందిన మహజన్ బాలాజీ ఈనెల 26న సాయంత్రం ఇంటికి తాళం వేసి మార్కెట్‌లో సరుకులు కొనుగోలు కోసం వెళ్లాడు. తిరిగి రాత్రి 8:45 ప్రాంతంలో ఇంటికి రాగా తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని 25 తులాల బంగారం, రూ.16వేలు ఎత్తుకెళ్లారని బాలాజీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI శ్రీకాంత్ తెలిపారు.

News March 27, 2024

నిజామాబాద్ జిల్లాలో కుష్ఠి వ్యాధి విస్తరిస్తోంది..!

image

ఉమ్మడి జిల్లాలో కుష్ఠి వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. NZBజిల్లాలో గతేడాది సెప్టెంబరులో చేపట్టిన సర్వేలో 214 మంది అనుమానితులను గుర్తించి 15 మందిలో వ్యాధిని గుర్తించారు. తాజాగా జరిగిన సర్వేలో 462 మందిని అనుమానితులను గుర్తించగా వీరికి వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంది. 6నెలల్లోనే అనుమానితుల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. కాగా వ్యాధిని నివారణకు జిల్లా వైద్యాశాఖ చర్యలు చేపట్టింది.

News March 27, 2024

మహిళా గురుకుల డిగ్రీ కాలేజీలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

image

2024-25 విద్యా సంవత్సరంలో సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు టీఎస్ఆర్డీసీ సెట్-2024ను ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయా విద్యాసంస్థలు తెలిపాయి. ప్రవేశ పరీక్ష కోసం ఏప్రిల్ 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని మర్కల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాధిక తెలిపారు.

News March 27, 2024

KMR: రహదారులు కన్నీరు పెట్టిస్తున్నాయి..

image

కామారెడ్డి జిల్లాలోని రహదారులు రక్త మోడుతూ..కన్నీరు పెట్టిస్తున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. రోడ్డు ప్రమాదాలకు గురై ఎక్కడో చోట మరణాలు సంభవిస్తునే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో 96 ప్రమాదాలు జరగడం గమనార్హం. తాజాగా ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాల పరిసర ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో హాసన్ పల్లి యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

News March 27, 2024

బీబీ పాటిల్ పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశావు: పోచారం

image

బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ జహీరాబాద్ MP బిబి పాటిల్ పై విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బాన్సువాడ శివారులో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్ళు అధికారంలో ఉండి ఏం పని చేశావు అని బిబి పాటిల్ ను ప్రశ్నించారు. ఢిల్లీలో కూర్చోని స్వంత ఫైరవీలు, వ్యాపారులు చేసుకోవడం తప్ప ఈ ప్రాంత ప్రజలకు అయన ఏ మేలు చేయలేదని ఆరోపించారు.

News March 26, 2024

తన రాజకీయ వారసుడిని ప్రకటించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

image

మాజీ స్పీకర్, బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి తన రాజకీయ వారసుడిని ప్రకటించారు. ఆయన తనయుడు, ఉమ్మడి NZB జిల్లా మాజీ డీసీసీబీ ఛైర్మెన్, పోచారం భాస్కర్ రెడ్డి పేరును ఆయన వెల్లడించారు. మంగళవారం బాన్సువాడ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా భాస్కర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

News March 26, 2024

‘ఏ ముఖం పెట్టుకొని రైతుల వద్దకు వెళ్తున్నారు’

image

BRS నాయకులు పంట నష్టం పై పరిశీలనకు వెళ్లడంపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పందించారు. BRS పాలనలో అనావృష్టి వల్ల ఆరుసార్లు పంట నష్టపోతే ఒక్కసారి కూడా పంట నష్టపరిహారం అందించలేదని విమర్శించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రైతుల వద్దకు వెళుతున్నారన్నారు. పంట నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.