Nizamabad

News March 26, 2024

కమ్మర్‌పల్లి: లంచం తీసుకొని ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్

image

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి ఎంపీడీవో కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్ పనులు పూర్తి చేయడానికి రూ.8 వేలు లంచంగా తీసుకున్న సీనియర్ అసిస్టెంట్ హరిబాబును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ పై కేసు నమోదు చేసి కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టుకు తరలించారు.

News March 26, 2024

NZB: డ్రంక్ అండ్ డ్రైవ్..ఇద్దరికీ జైలు శిక్ష

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తులకు NZB ద్వితీయ శ్రేణి మేజిస్ట్రేట్ సయ్యద్ ఖదీర్ జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. NZB పట్టణ పరిధిలో ఇటీవల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 12 మంది పట్టుబడ్డారు. వారిని మంగళవారం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 10 మందికి రూ. 11300 జరిమానాలు మరో ఇద్దరికి 2 రోజుల జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్ ACP నారాయణ తెలిపారు.

News March 26, 2024

నిజామాబాద్: మట్టి కుండ.. సల్ల గుండ

image

వేసవిలో ప్రత్యేకంగా ఉపయోగించే మట్టి కుండలకు ట్యాప్‌ (నల్ల) ఏర్పాటు చేసి NZB జిల్లా కేంద్రంలో విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లకు ఏ మాత్రం తగ్గకుండా ఈ కుండలు లభిస్తున్నాయి. వివిధ సైజులు, ఆకృతులను బట్టి విటి ధర నిర్ణయించబడి ఉంది. వేసవిలో పేదవాడి ఫ్రిజ్‌గా చెప్పుకునే వీటికి సౌత్ ఇండియాలోనే మంచి డిమాండ్ ఉంది. ఎర్రటి మట్టి కుండలోని చల్లటి నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు

News March 26, 2024

ఎల్లారెడ్డిలో బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

image

కామారెడ్డి జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ మహేశ్ వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి నుంచి నిజాంసాగర్ వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు మహమ్మద్ నగర్ మండలం అసన్ పల్లికి చెందిన కురుమ ప్రశాంత్ (23)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 26, 2024

కామారెడ్డిలో యువకుడి దారుణ హత్య

image

కామారెడ్డి మండలం రామేశ్వర్ పల్లి, ఆరేపల్లి గ్రామాల మధ్య రోడ్డుపై వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు ఈరోజు ఉదయం గుర్తించారు. అతడు సోమవారం రాత్రి హత్యకు గురైనట్లు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News March 26, 2024

కామారెడ్డి చరిత్రలో తొలిసారి ‘అవిశ్వాసం’

image

కామారెడ్డి మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారి అవిశ్వాస తీర్మానానికి తెరలేచింది. ఈ నెల 30న తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఐదేళ్ల కింద BRS అధికారంలోకి రాగా ఛైర్‌పర్సన్ పదవిని అదే పార్టీకి చెందిన వ్యక్తికి కేటాయించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సభ్యులు అవిశ్వాస ప్రక్రియకు సిద్ధమయ్యారు. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ నుంచి 27 మంది, BRS నుంచి 8 మంది సభ్యులు శిబిరానికి వెళ్లినట్లు సమాచారం.

News March 26, 2024

నేడే నిజామాబాద్ DCCB ఛైర్మన్ ఎన్నిక

image

నిజామాబాద్ DCCB ఛైర్మన్ ఎన్నిక ఈరోజు జరగనుంది. ఈ ఎన్నిక కోసం సహకార కేంద్ర బ్యాంకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకునేందుకు మొత్తం 21 మంది సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ రమేశ్ రెడ్డికే పట్టం కట్టేందుకు సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 21న మాజీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాసం తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోయిన విషయం తెలిసిందే.

News March 25, 2024

నిజామాబాద్: పడిపోయిన పసుపు ధరలు

image

నిజామాబాద్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అల్‌టైం రికార్డు ధర పలికిన పసుపు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. పది రోజుల క్రితం గరిష్ఠంగా రూ.18,299 పలికిన పసుపు రూ.1,500 వరకు తగ్గడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం మార్కెట్‌లో పసుప ధర గరిష్ఠంగా క్వింటాలుకు రూ.16,666 ఉంది. దానికి తోడు ఈ నెలాఖరు వరకు రెండు రోజులు మాత్రమే పసుపు కొనుగోళ్లు సాగుతాయని మార్కెట్ అధికారులు వెల్లడించారు.

News March 25, 2024

నిజామాబాద్ జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న హోళీ సంబురాలు

image

నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా హోళీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాత్రి శాస్త్రోక్తంగా కామదహనం కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఉదయం నుండి పిల్లలు, పెద్దలు రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ వేడుకలు జరుపుతున్నారు. అలాగే వివిధ సంఘాలు, యూనియన్ల ఆధ్వర్యంలో హోళీ సంబురాలు నిర్వహిస్తున్నారు.

News March 25, 2024

ఒకప్పటి నిజామాబాద్ కలెక్టర్..ఇప్పుడు MLA అభ్యర్థి

image

ఒకప్పుడు నిజామాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన దేవ వరప్రసాద్‌ ఈసారి ఏపీలో MLA అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దేవ వరప్రసాద్‌కు టికెట్ ఖరారు చేశారు. 2021లో జనసేన జనవాణి విభాగం కన్వీనర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. గతంలో పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరక్టర్, అబ్కారీ శాఖ డైరక్టర్‌గా ఆయన సేవలందించారు.