Nizamabad

News May 29, 2024

NZB: న్యూడ్ వీడియో ఘటనపై కమిటీ ఏర్పాటు

image

జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్కానింగ్ ఘటనపై నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్ ప్రకటించారు. విచారణ నివేదిక వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్కానింగ్ కోసం వచ్చే మహిళలను రహస్యంగా న్యూడ్ ఫొటోలు, వీడియో చిత్రీకరించిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. స్కానింగ్ సెంటర్లకు వెళ్లే మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News May 29, 2024

మంజీరా నదిలో నీట మునిగి ఇద్దరు మృతి

image

బీర్కూర్ మండలం మంజీరా నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు గల్లంతైన ఘటన బుధవారం కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బీర్కూర్‌కు చెందిన కటికే పండరి(30), టిల్లు(12) స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. కాసేపటికి పండరి, టిల్లు మృతదేహాలు బయటకు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News May 29, 2024

UPDATE: అస్థి పంజరం గుర్తింపు.. ఎవరిదంటే..?

image

కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్ మండలం షేర్ ఖాన్ పల్లి గ్రామ శివారులో బుధవారం ఓ మానవ అస్థిపంజరం వెలుగు చూసిన విషయం తెలిసిందే. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మహమ్మద్‌నగర్ మండలం తుంకిపల్లి గ్రామానికి చెందిన గుమ్మడి రవీందర్‌గా గుర్తించారు. మృతుని భార్య వదిలి వెళ్లిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని బాన్సువాడ CI కృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News May 29, 2024

KMR: కలకలం రేపిన అస్థిపంజరం.. ఎవరిదో..?

image

కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం షేర్ ఖాన్ పల్లి గ్రామ శివారులో బుధవారం వెలుగు చూసిన ఓ మానవ అస్థిపంజరం కలకలం రేపింది. సమాచారం అందుకున్న బాన్సువాడ పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో దర్యాప్తు చేపట్టి, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇది ఎవరిది? ఈ అస్థిపంజరం ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పడి ఉంది? తదితరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

News May 29, 2024

NZB: ఇంటిపై నుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతి

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ని రోడ్ సాయి నగర్‌లో నివాసముంటున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ బుధవారం నూతనంగా నిర్మిస్తున్న భవనం 3వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం ఇంటికి వాటర్ కొడుతుండగా ప్రమాదవశాత్తు జారి పడినట్లు వెల్లడించారు.

News May 29, 2024

NZB: ఇన్‌స్టాలో లవ్.. యువకుడి సూసైడ్

image

లవ్ ఫెయిల్ అయి ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన ZHBలో జరిగింది. ఆనెగుంటకు చెందిన వెంకట్(30) HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో NZB జిల్లా బాల్కొండకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కాగా వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. కొద్దిరోజులకు ఆమె కూడా పెళ్లికి నో చెప్పడంతో మనస్తాపం చెంది పట్టణ శివారులో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.

News May 29, 2024

ఆర్మూర్ పట్టణంలో పర్యటించిన ఎంపీ అరవింద్

image

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంగళవారం రోజు ఆర్మూర్ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఆర్మూర్ పట్టణానికి చెందిన రాజశేఖర్ ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఎంపీ అరవింద్‌ను కలవడం ఆనందంగా ఉందన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో పలు అంశాలపై చర్చించామన్నారు.

News May 28, 2024

మాక్లూర్: ప్రమాదవశాత్తు చెరువులో పడి గేదెల కాపరి మృతి

image

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్రపల్లి గ్రామ చెరువులో పడి గేదెల కాపరి మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన దుర్గయ్య (65) గేదెలను చెరువులోకి తీసుకెళ్లాడు. కాగా అక్కడ దుర్గయ్య కాలుజారి చెరువులో పడగా ఊపిరాడక మృతి చెందాడు. మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి, పంచనామ నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News May 28, 2024

ఆర్మూర్: రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంక్ 

image

ఆర్మూర్ పట్టణం మామిడిపల్లికి చెందిన దొండి హర్షిని మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన డోండి ప్రకాష్, సునీత కుమార్తె హర్షిని మోడల్ స్కూల్ ఆరవ తరగతిలో చేరడానికి ప్రవేశ పరీక్ష రాసింది. ఈ ప్రవేశ పరీక్షలో 100కు గాను 90 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించగా జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది.

News May 28, 2024

సాలూర్ అంతరాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద ఏసీబీ తనిఖీలు

image

రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ జిల్లా సాలూర అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. చెక్ పోస్టు వద్ద ఆర్టీఏ అధికారులు వాహనదారుల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నారనే సమాచారంతో నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!