Nizamabad

News May 28, 2024

NZB: ఈసారి మంత్రి పదవి ఎవరికి?

image

సీఎం రేవంత్ రెడ్డి త్వరలో కేబినేట్‌ను విస్తరించనున్న నేపథ్యంలో ఉమ్మడి NZB జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కనుందోనని ఉత్కంఠ నెలకొంది. సీనియర్ నేత, బోధన్ MLA సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి MLA మదన్ మోహన్ రావు పోటీలో ఉన్నారని శ్రేణులు చెబుతున్నాయి. కాగా ఇప్పటి వరకు జుక్కల్ నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో ఈసారి MLA లక్ష్మీకాంతరావుకి అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. మీ కామెంట్?

News May 28, 2024

బిక్కనూర్‌లో ఉపాధి హామీ కూలి మృతి

image

ఉపాధి పని చేస్తూ కూలి మృతి చెందిన ఘటన బిక్కనూర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలానికి చెందిన అంబల్ల పెద్ద మల్లయ్య(60) మంగళవారం ఉపాధి పనికి వెళ్లాడు. పని చేస్తుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలాడు. దీంతో తోటి కూలీలు ఆసుపత్రికి తరలించారు. కాగా అతడు గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News May 28, 2024

నిజామాబాదీలు రూ.129 కోట్ల బీర్లు తాగేశారు

image

వేసవిలో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 151 వైన్స్, 29 బార్లు ఉన్నాయి. ఇక్కడ రోజుకు రూ.5కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా అందులో రూ.1.50కోట్ల బీర్ల విక్రయాలు జరుగుతున్నాయి. వేసవి మొదలైనప్పటి నుంచి బీర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ ఏడాది మార్చి నుంచి మే 27 నాటికి జిల్లా వాసులు రూ.129 కోట్ల విలువైన బీర్లు తాగారు.

News May 28, 2024

KMR: స.హా చట్టంపై ఉచిత శిక్షణ తరగతులు విజయవంతం

image

KMRలోని PVNRడైరీ కళాశాలలో సమాచార హక్కు చట్టం 2005 పై ఉచిత శిక్షణ తరగతులను సోమవారం నిర్వహించినట్లు రాష్ట్ర డైరెక్టర్ MA సలీం తెలిపారు. దరఖాస్తు విధానము సెక్షన్ 6(1), మొదటి ఆపిల్ సెక్షన్ 19(1), రెండవ ఆపిల్ సెక్షన్ 19(3), సమాచారాన్ని ఇవ్వని అధికారులపై రాష్ట్ర సమాచార కమిషన్కు ఫిర్యాదు చేసే విధానాన్ని క్లుప్తంగా వివరించినట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ సాహిల్ ఖాన్ పాల్గొన్నారు.

News May 27, 2024

KMR: ఆటో, ట్రాక్టర్ ఢీ.. మహిళ మృతి

image

ఆటో, ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి చెందింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సోమవారం రాత్రి జరిగింది. రాంపూర్ గడ్డకు చెందిన ముగ్గురు మహిళలు ఆటోలో ఇంటికి వెళ్తుండగా.. కామారెడ్డి వైపు నుంచి అతివేగంగా ట్రాక్టర్ వచ్చి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్యావల లచ్చవ్వ (40) అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News May 27, 2024

BREAKING: బాసర IIITలో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

image

నిర్మల్ జిల్లాలోని బాసరలో IIIT కళాశాలలో 2024-25లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా 22 వరకు స్వీకరించనున్నారు. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు తీసుకోనున్నారు. మరిన్ని వివరాల కోసం www.rgukt.ac.in లేదా ఇమెయిల్ ద్వారా admissions @rgukt.ac.inని సందర్శించండి.

News May 27, 2024

NZB: దారుణం.. చాక్లెట్ ఆశ చూపించి 6 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం

image

చాక్లెట్ ఆశ చూపించి ఆరేళ్ల బాలికపై ఒక కామాంధుడు అఘాయిత్యానికి యత్నించాడు. బాలిక పినతల్లి చూడడంతో బాలికను వదిలి పరారీ అయ్యాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు స్థానికులు చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన యువకుడి ఇంటిపై దాడి చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

News May 27, 2024

ఆర్మూర్‌లో బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

image

బాలికపై అత్యాచారం చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆర్మూర్‌లోని రాజారాంనగర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన ఓ బాలికి తల్లిదండ్రులు శనివారం బాలిక(12)ను ఇంటి వద్ద వదిలి పనికి వెళ్లారు. ఇదే అదును భావించిన ఆ వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడగా బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

News May 27, 2024

NZB: విదేశాల్లో జాబ్ పేరిట రూ.31.10 లక్షల స్కామ్

image

ఏజెంట్ల చేతిలో మోసపోయిన ఘటన బాల్కొండలో జరిగింది. శేఖర్, జశ్విందర్ సింగ్, మహజన్ అనే ముగ్గురు చంఢీగర్, ఢిల్లీలో ఏజెంట్లుగా పని చేస్తున్నామని మండలానికి చెందిన ఏడుగురిని నమ్మించారు. విదేశాల్లో జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి వారి వద్ద రూ.31.10 లక్షలు వసూలు చేశారు. నకిలీ వీసాలు, టికెట్లు పంపించడంతో వీరు నమ్మి డబ్బులు చెల్లించారు. గడువు సమీపించడంతో ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 27, 2024

మస్కట్‌లో తాడ్వాయి వాసి మృతి

image

ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన దాసరి నర్సింలు(41) గత నెల 24న ఒమన్‌లోని మస్కట్‌కు పని నిమిత్తం వెళ్లాడు. ఈ నెల 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కంపెనీ ప్రతినిధులు పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నారు.

error: Content is protected !!