India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. రాష్ట్ర ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ సస్పెన్షన్ ఉత్తర్వులను శనివారం జారీ చేశారు. ఆయనపై పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదు కావడం, విచారణ నివేదిక ఆధారంగా ఆయనను సస్పెండ్ చేశారు.
రేపు జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో హైదరాబాద్ జట్టు గెలవాలని ఇందల్వాయి గ్రామంలో ప్రత్యేక పూజలు చేశారు. కోల్‌కతాతో జరిగే ఫైనల్ మ్యాచులో హైదరాబాద్ జట్టు సభ్యులు రాణించాలని కోరారు. ఈ మేరకు రామాలయంలో దీపక్ పంతులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. గోపి, అశోక్, సతీశ్ కుమార్, మను సందీప్ తదితరులు ఉన్నారు.
కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పిట్లం మండలం చిల్లర్గిలో జరిగింది. SI నీరేశ్ వివరాలిలా.. చిల్లర్గి వాసి చాకలి సాయిలు (52) గురువారం సాయంత్రం తన పొలంలో వరి కొయ్య కాళ్ళు కాల్చుతుండగా.. ఒకే సారి మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో నీళ్లతో మంటలు ఆర్పడానికి బోరు స్టార్టర్ బాక్స్ వద్దకు వెళ్లి మోటారు ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కామారెడ్డి జిల్లాలో ఎలుగు బంటి కలకలం రేపింది. లింగంపేటలోని మేంగారం-బోనాల్ మధ్య ఉన్న రోడ్డు పై ఎలుగుబంటి సంచరించడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నీరు తాగేందుకు వచ్చిందని ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జానకంపేటలోని నిజాంసాగర్ కాలువ గట్టు వద్ద గురువారం కొందరు దుండగులు ఓ <<13301418>>బాలికపై దాడి<<>> చేసిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనలో పలు విషయాలు వెల్లడైనట్లు SI వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఓ ఆటో డ్రైవర్, మరో వ్యక్తి ఆమెపై దాడి చేసినట్లు బాలిక తల్లి అనుమానిస్తున్నారు. దీంతో ఆమెను ఉద్దేశ పూర్వకంగానే తీసుకెళ్లి దాడి చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.
ఇటీవల కజకిస్థాన్లో జరిగిన ఎలోర్డా పోటీల్లో 52 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్‌ను ప్రముఖ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను సచిన్ టెండూల్కర్ సత్కరించారు. దేశ గౌరవం విశ్వ వ్యాప్తం చేసేలా మున్ముందు మరింత రాణించాలని కోరారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఓ భారీ చేప చిక్కింది. అన్నారం గ్రామానికి చెందిన రవి చేపల వేటకు వెళ్లి గోదావరిలో వల వేయగా 23 కిలోల భారీ చేప చిక్కింది. విషయం తెలుసుకున్న పరిసర ప్రాంత ప్రజలు చేపను ఆసక్తిగా తిలకించారు. అనంతరం నందిపేటకు చెందిన ఓ వ్యక్తికి చేపను విక్రయించినట్లు రవి తెలిపారు.
తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 15 నిమిషాల వ్యవధిలోనే ఆయన కూతురు జిల్లా ఆసుపత్రిలో మృతి చెందిన విషాద ఘటన ఇది. రెంజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన జ్యోతి భర్త వేధింపులు భరించలేక ఈ నెల21న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు GGHలో చేర్పించారు. ఆమెకు భోజనం తెద్దామని బయలుదేరిన తండ్రి లక్ష్మణ్ రాథోడ్ (60) రాత్రి ప్రమాదంలో మృతి చెందగా కూతురు జ్యోతి చికిత్స పొందుతూ మృతి చెందింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పాలిసెట్-2024 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్, సమన్వయకర్త ఏ.ఎన్. ఫణిరాజ్ పర్యవేక్షణలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ పరీక్ష నిర్వహించారు. 5586 మంది విద్యార్థుల నుంచి 2559 మంది బాలురు, 2402 మంది బాలికలు హాజరుకాగా మొత్తం 88.81 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో పాలిసెట్ పరీక్ష మొదలైంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ ఉండదు. కాగా ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు జరగనుంది. ఇందు కొరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా పలు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి నెలకొంది. 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,586 మంది విద్యార్థులు పరీక్ష కు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు
Sorry, no posts matched your criteria.