Nizamabad

News May 24, 2024

NZB: విషాదం.. 15 నిమిషాల్లో తండ్రి, కూతురు మృతి

image

తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 15 నిమిషాల వ్యవధిలోనే ఆయన కూతురు జిల్లా ఆసుపత్రిలో మృతి చెందిన విషాద ఘటన ఇది. రెంజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన జ్యోతి భర్త వేధింపులు భరించలేక ఈ నెల21న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు GGHలో చేర్పించారు. ఆమెకు భోజనం తెద్దామని బయలుదేరిన తండ్రి లక్ష్మణ్ రాథోడ్ (60) రాత్రి ప్రమాదంలో మృతి చెందగా కూతురు జ్యోతి చికిత్స పొందుతూ మృతి చెందింది.

News May 24, 2024

నిజామాబాద్: ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్ -2024 పరీక్ష

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పాలిసెట్-2024 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్, సమన్వయకర్త ఏ.ఎన్. ఫణిరాజ్ పర్యవేక్షణలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ పరీక్ష నిర్వహించారు. 5586 మంది విద్యార్థుల నుంచి 2559 మంది బాలురు, 2402 మంది బాలికలు హాజరుకాగా మొత్తం 88.81 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.

News May 24, 2024

NZB: మరికాసేపట్లో పాలిసెట్‌ పరీక్ష

image

నిజామాబాద్ జిల్లాలో పాలిసెట్ పరీక్ష మొదలైంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ ఉండదు. కాగా ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు జరగనుంది. ఇందు కొరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా పలు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి నెలకొంది. 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,586 మంది విద్యార్థులు పరీక్ష కు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు

News May 24, 2024

బాన్సువాడ: రేప్ చేసి.. చంపేశారు?

image

బాన్సువాడ అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. వివరాలిలా.. మృతదేహంపై దుస్తులు చిందరవందరగా ఉండటం, పుర్రె పగిలి, దవడ విరిగి ఉంది. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన SP పోస్టుమార్టం నిర్వహించి కుంటుబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి అక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు పోలీసులు తెలిపారు.

News May 24, 2024

నిజామాబాద్: నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు ఉంటాయి. 28,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అధికారులు పేర్కొన్నారు

News May 24, 2024

NZB: పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

image

పాలిసెట్- 2024కు ఏర్పాట్లు పూర్తయ్యాయని నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్, సమన్వయకర్త ఫణిరాజ్ తెలిపారు. 16 పరీక్ష కేంద్రాల్లో 5,586 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్ష ఉ. 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఉంటుందని విద్యార్థులు 10 గంటలలోపు చేరుకోవాలన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లు, పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ పెన్ను తీసుకురావాలని తెలిపారు.

News May 23, 2024

BSWD: మహిళ మృతదేహం వివరాలను గుర్తించిన పోలీసులు

image

బాన్సువాడ మండలంలోని కృష్ణా నగర్ తండా అటవీ ప్రాంతంలో గురువారం లభ్యమైన గుర్తు తెలియని మహిళ (35) వివరాలను పోలీసులు గుర్తించారు. మృతురాలిని గాంధారి మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన వారాంతపు సంతలో కూరగాయలు అమ్మే లక్ష్మీగా గుర్తించారు. వారం క్రితం బాన్సువాడ వెళ్లి తిరిగి రాకపోవడంతో గాంధారి పోలీసు స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కాగా సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ సింధూ శర్మ పరిశీలించారు.

News May 23, 2024

BSWD: అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం

image

బాన్సువాడ మండలంలోని కృష్ణా నగర్ తండా అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ (35) మృతదేహం లభ్యమైనట్లు బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మృతురాలు ఒంటిపై గులాబీ రంగు చీర, బంగారు రంగు జాకెట్ ధరించి ఉందని, నలుపు రంగు స్కార్ఫ్ కూడా ఉన్నట్లు సీఐ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా మృతురాలి ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని ఆయన సూచించారు.

News May 23, 2024

నవీపేట్ మండలంలో పేలిన సెల్ ఫోన్

image

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని ఫకీరాబాద్ గ్రామంలో సెల్ ఫోన్ పేలింది. కొమ్మొల్ల యోగేష్ కు చెందిన మెుబైల్ సెల్‌ఫోన్ పేలడంతో భయభ్రాంతులకు లోనయ్యారు. మంటలు రావటంతో అతని కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. అనంతరం మంటలను ఆర్పివేశారు. ఎవరికి ఎలాంటి హని జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News May 23, 2024

ఎడపల్లి: యువతిపై ఆగంతకుల దాడి..!

image

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో దారుణం జరిగింది. జాన్కంపేట శివారులోని కెనాల్ వద్ద ఇవాళ ఉదయం ఓ యువతి తీవ్రగాయాలతో అపస్మారక స్థతిలో పడి ఉంది. ఇది గమనించిన వాకర్స్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని తీవ్రగాయలతో ఉన్న యువతిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. యువతి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.

error: Content is protected !!