Nizamabad

News May 23, 2024

NZB: నిఖత్ జరీన్‌కు సన్మానం

image

ఇటీవల కజకిస్థాన్‌లో జరిగిన ఎలోర్డా పోటీల్లో 52 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్.. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్‌ను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కమిషనర్ శాలువాతో సత్కరించారు. దేశ గౌరవం విశ్వ వ్యాప్తం చేసేలా మున్ముందు మరింత రాణించాలని కమిషనర్ కోరారు.

News May 23, 2024

NZB: గంజాయి కేసులో 9 మంది అరెస్ట్

image

గంజాయి కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఏర్గట్ల SI మచ్చేందర్ రెడ్డి తెలిపారు. కమ్మర్‌పల్లికి చెందిన ఆరీఫ్ ఇంట్లో ఫంక్షన్‌కి HYDకి చెందిన అబ్దుల్ రెహమాన్, అజర్, శంషద్, సమీర్, వంశీవర్ధన్, సలీం పాషా హాజరయ్యారు. నిర్మల్‌కి చెందిన షాదుల్లా, అజారుద్దీన్ వద్ద గంజాయి కొని తాళ్లరాంపూర్ ఈతవనంలో గంజాయి తాగుతూ హంగామా చేశారు. దీంతో వారిని అరెస్ట్ చేసి 268 గ్రా. గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు SI వెల్లడించారు.

News May 23, 2024

NZB: ఫలితాలకు ఇంకా 13 రోజులే

image

ఈ నెల 13న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఆభ్యర్థులుగా పోటీ చేసిన వారే కాకుండా పార్టీల గెలుపు కోసం నిరంతరం కృషి చేసిన నాయకులు సైతం ఎన్నికల రిజల్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సారి గెలుపుపై ప్రధాన పార్టీల నేతలు గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. ఇంకా 13రోజులే ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మెదలైంది.

News May 23, 2024

తెలంగాణ విశ్వవిద్యాలయ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ విశ్వవిద్యాలయపరిధిలో స్కిల్ కోర్స్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం తెలంగాణ యూనివర్సిటీ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారం ఉందని వివరించారు.

News May 22, 2024

BREAKING: బాన్సువాడ మున్సిపల్ కమిషనర్‌ సస్పెండ్

image

బాన్సువాడ మున్సిపల్ కమిషనర్‌ అలీంపై వేటుపడింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి. భైంసా మున్సిపల్ కమిషనర్‌గా చేసినప్పుడు అలీంపై అవినీతికి ఆరోపణలు వచ్చాయి. విచారణ అనంతరం అలీంను ఈరోజు సీడీఎంఏ దివ్య సస్పెండ్ చేశారు.

News May 22, 2024

పిట్లం: రోడ్డుపై పడిన భారీవృక్షం

image

పిట్లం మండలంలో బుధవారం మధ్యాహ్నం తీవ్రమైన గాలిదుమారంతో కూడిన అకాల వర్షం రావడంతో మండలంలోని పలు ప్రాంతాల్లో మొక్కజొన్న, జొన్న కుప్పలు తడిసిపోయాయి. సిద్దాపూర్ నుంచి రాంపూర్ వైపు వెళ్లేదారిలో చెరువు కట్టపై ఒక చెట్టు, నర్సరీ వద్ద మరోచెట్టు కూలిపోయింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు పడటంతో భారీసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులే చెట్టును తొలగించే ప్రయత్నం చేశారు.

News May 22, 2024

KMR: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

KMR, BKNR రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్టు రైల్వే SI తావునాయక్ తెలిపారు. గుర్తుతెలియని రైలులో డోర్ వద్ద ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడన్నారు. మృతుడు 35 – 40 సం.ల మధ్య వయస్సు కలిగి తెల్లచొక్కా, నల్ల ప్యాంటు ధరించాడన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని ఎస్సై సూచించారు.

News May 22, 2024

NZB: రేపు క్రికెట్ క్రీడాకారుల ఎంపికలు

image

నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 19, (అండర్ 23) సీనియర్ క్రికెట్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి వెంకటరెడ్డి తెలిపారు. ఈ ఎంపికలు జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్‌లో ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఎంపికల్లో పాల్గొనేవారు SSC మెమో, ఆధార్ కార్డ్, క్రికెట్ కిట్, వైట్ యూనిఫామ్‌తో హాజరు కావాలన్నారు.

News May 22, 2024

కామారెడ్డిలో అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్

image

అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు కామారెడ్డి SP సింధూశర్మ తెలిపారు. మంగళవారం పట్టణంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రాజస్థాన్‌కు చెందిన కుమావత్ బుందారం, లక్ష్మణ్ రామ్‌లను పట్టుకున్నారు. పట్టణంలో ఈ నెల 2వ తేదీన సిగరేట్ గోదాంలో వారు చోరీ చేసినట్లు గుర్తించారు. వారి వద్ద రూ.15.50 లక్షల నగదుతో పాటు ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. మరో నింధితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

News May 22, 2024

పిట్లంలో వ్యక్తి హత్య.. అతడి భార్యపై ఫిర్యాదు

image

ఓ వ్యక్తిని దారుణంగా <<13288336>>హత్య చేసిన<<>> ఘటన పిట్లం మండలం చిన్నకొడప్గల్‌లో జరిగిన విషయం తెలిసిందే. కృష్ణయ్య(40)ను సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు చిన్నకొడప్గల్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి తలపై బండరాయితో బాది, తల భాగాన్ని నుజ్జు నుజ్జు చేసి చంపినట్లు SI నీరేశ్ తెలిపారు. మృతుడి భార్య రుక్మిణిపై అనుమానం ఉందని అతడి అన్న కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు చేసినట్లు SI వెల్లడించారు.

error: Content is protected !!