Nizamabad

News March 22, 2024

బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే: మాజీ ఎమ్మెల్యే

image

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై ఎమ్మెల్సీ కవితను ఈడీ కేసులో రిమాండ్‌కు పంపాయని ఆర్టీసీ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ నాయకులకు అభ్యర్థులు లేరని పేర్కొన్నారు.

News March 22, 2024

బోధన్: నీటి కుంటలో పడి సూసైడ్

image

ఖాజాపూర్ గ్రామానికి చెందిన సుభద్రబాయి(83)కి మతిస్థిమితం సరిగ్గా ఉండేది కాదు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం సాలూర శివారులోని ఓ కుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహం గురువారం నీటిలో తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 22, 2024

నిజామాబాద్: మైనర్‌ను పెళ్లి చేసుకున్నాడు.. చివరికి

image

నిజామాబాద్ గాంధీనగర్‌కు చెందిన సుధాకర్(25), బోధన్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16)ను వారం కిందట తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. నవీన్ అనే యువకుడు సహకరించాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సుధాకర్‌పై పోక్సో, అతని స్నేహితుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగనాథ్ తెలిపారు. గురువారం వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

News March 22, 2024

సదాశివనగర్: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

image

రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామ శివారులోని గంజి వాగు దగ్గర ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పోసానిపేటకు చెందిన బలగం రాజయ్యకు తీవ్ర గాయాలయ్యాయ. ఆయనను కామారెడ్డి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు.

News March 22, 2024

కామారెడ్డి: అనుమతులు లేని డబ్బు, మద్యం పట్టివేత

image

జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వెలువడిన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. గత 3 రోజుల్లో రూ.7.6 లక్షలు, నేడు రూ.4.50 లక్షల నగదుతో పాటు 986 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు వెల్లడించారు. అధికారులు సమిష్టిగా కృషిచేస్తూ అక్రమ డబ్బు, మద్యం రవాణాను అరికట్టాలని ఆమె సూచించారు.

News March 21, 2024

NZB: గూడ్స్ రైల్లో పొగలు

image

నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలులో ఎండ తీవ్రతకు స్వల్పంగా నిప్పురాజుకొని పొగలు వచ్చాయి. బొగ్గును తరలిస్తున్న వ్యాగన్‌లో పొగలు రాగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిజామాబాద్ స్టేషన్‌లో ఆపివేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

News March 21, 2024

FLASH.. నిజామాబాద్ డీసీసీబీ ఛైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

image

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం పాలకవర్గం పెట్టిన అవిశ్వాస తీర్మాన సమావేశంలో భాస్కర్ రెడ్డికీ వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొనడంతో ఆయన పదవి కోల్పోయారు. 21 మంది పాలకవర్గ సభ్యులకుగాను 17 మంది హాజరయ్యారు. అందులో 16 మంది భాస్కర్ రెడ్డి పై వ్యతిరేకంగా చేతులెత్తి అవిశ్వాసానికి మద్దతు తెలిపారు.

News March 21, 2024

కామారెడ్డి జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన

image

అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. బిక్కనూర్ మండలం అంతంపల్లి, జంగంపల్లి గ్రామాలలో ఆయన పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులు ఎలాంటి ఆందోళన పడవద్దని చెప్పారు. త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఉన్నారు.

News March 21, 2024

రెండు రోజుల్లో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

రెండు రోజుల్లో నిజామాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఈ స్థానానికి ప్రముఖ నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, BJP నుంచి ధర్మపురి అర్వింద్‌ను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పెండింగ్‌లో ఉంచింది. ఆపార్టీ అభ్యర్థి ఎవరని శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

News March 21, 2024

కామారెడ్డి: ఎన్నికల కోడ్.. రూ.1.20 లక్షలు పట్టివేత..

image

నిజాంసాగర్ మండలం బ్రాహ్మణ పల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు రూ.లక్ష 20 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద బుధవారం వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో HYD నుంచి జాల్నాకు వెళ్తున్న ఓ కారులో ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు SI సుధాకర్ పేర్కొన్నారు.