India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని సూచించారు. CS శాంతికుమారి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు.

నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో 15వ జాతీయ ఓటరు దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాదిగా నిలుస్తోందని, దీనిని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును తెరపైకి తెచ్చిందని మాజీ మంత్రి, బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. BRS ఆధ్వర్యంలో సాగు, సంక్షేమ పరిస్థితులపై అధ్యయనానికి ఏర్పాటైన కమిటీ జిల్లాలో పర్యటిస్తోంది. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, MLCలు యాదవరెడ్డి, కోటిరెడ్డి, మెండోరా మండలం బుస్సాపూర్‌లో రైతులతో శనివారం సమావేశమయ్యారు.

ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న 80 ఏళ్లు పైబడిన వృద్ధులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్లు నాగుల సాయమ్మ, కొట్టూర్ ఇందిరా, అవధూత భూమయ్య, మెరుగు ఒడ్డెమ్మ, అంకం సుశీల, వై.నర్సయ్యలను ఘనంగా సన్మానించారు. కొత్తగా నమోదైన యువ ఓటర్లకు ఐడీ కార్డులను అందజేశారు.

ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. B.Ped, M.Ped చేసిన వారికి అనుభవాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 27న సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ, డెమో ఉంటుందన్నారు.

జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శుక్రవారం ఢిల్లీలో బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు, OBC మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గంగారెడ్డి పసుపు బోర్డు ఛైర్మన్ ఎన్నికకు సహకరించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పసుపు బోర్డు, పసుపు రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు.

ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. B.Ped, M.Ped చేసిన వారికి అనుభవాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 27న సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ, డెమో ఉంటుందన్నారు.

అనారోగ్య సమస్యలతో ఓ మహిళ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. ఆదర్శనగర్‌కు చెందిన లక్ష్మీ 52 కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆమె భర్తకు ఏడాది క్రితం హార్ట్ ఆపరేషన్ అయింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

నిజామాబాద్ ఆర్సపల్లి బైపాస్ రోడ్డులో లారీ ఢీకొని ఓ రైతు మృతి చెందినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు గురువారం తెలిపారు. ఆర్సపల్లికి చెందిన తరికంటి యాదయ్య(78) అర్సపల్లి శివారులోని తన వ్యవసాయ భూమిలో పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా రైల్వే గేటు మూల మలుపు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నిజామాబాద్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీసులు గురువారం ఒకరిని గంజాయితో అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.స్వప్న తెలిపారు. నగరంలో తనిఖీలు నిర్వహిస్తుండగా జునైద్ అనే ఓ యువకుడు 0.7 కిలోల గంజాయితో పట్టుబడ్డాడన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు స్వప్న వివరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై బి.రాం కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు రాజన్న, భూమన్న, కానిస్టేబుళ్లు భోజన్న, సుకన్య పాల్గొన్నారన్నారు.
Sorry, no posts matched your criteria.