India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ ఇవ్వనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి అరుణ తెలిపారు. 2011-2016, 2016-2019 సంవత్సరాల్లో డిగ్రీ ఫేయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం ఇచ్చారు. ఈ పరీక్షలు జూన్/జులైలో జరుగుతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలను తెలంగాణ వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు.
నిజామాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం తెలంగాణ భవన్‌లో KCR చేతుల మీదుగా B-ఫారమ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్లు విఠల్ రావు, దావ వసంత, అలీం, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి అభ్యర్థుల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమయ్యింది. ఈ మేరకు స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి సత్యనారాయణ తన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా రిటర్నింగ్ అధికారి ఛాంబర్ వద్దకు చేరుకున్న వారి నామినేషన్లు మాత్రమే స్వీకరిస్తామన్నారు.
కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామంలో మురికి కాలువలో పసికందు మృతదేహం కలకలం రేపింది. ఇవాళ ఉదయం గ్రామస్థులు పసికందు మృతదేహన్ని మురికి కాలువలో గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిజామాబాద్ నగర శివారులోని బోర్గాం (పి) గ్రామంలో లారీ ఢీకొన్న ఘటనలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు నాలుగవ టౌన్ ఎస్సై సంజీవ్ తెలిపారు. ఈనెల 16వ తేదీన బోర్గాంకు చెందిన ప్రదీప్ తన ద్విచక్ర వాహనంపై, మోపాల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా, గ్రామంలో లారీ ఢీకొట్టింది. ఘటనలో ప్రదీప్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.
నేటి నుంచి 25 వరకు ప్రతి రోజు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తామని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4 న కౌంటింగ్ జరుగుతుందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించే సమయం ఆసన్నమైంది. నేటి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 17,01573 ఓటర్లున్నారు. 936 ప్రదేశాల్లో 1807 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, 85 ఏళ్లు నిండిన వారు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకొనేందుకు 12- డీ ఫారాలు ఇప్పటికే ఇచ్చారు. వీటిని 22వ తేదీ నాటికి తిరిగి బీఎల్‌వోలకు అందించాలి.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కందకుర్తి గోదావరి నదిలో బుధవారం స్నానానికి వెళ్లిన నవాజ్ (16) అనే పదో తరగతి విద్యార్థి నీట మునిగి మృతి చెందినట్లు SI సాయన్న తెలిపారు. నవాజ్.. స్నేహితులతో కలిసి మొగులపురా శివారు వద్ద గోదావరి నదిలో స్నానానికి వెళ్లాడు. నదిలో గుంతల లోతు తెలియక, ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.
కోటగిరి మండలం లింగాపూర్‌కి చెందిన నీరడి సాయిలు (45) అనే వ్యక్తి బీర్కూర్ అంగడిలో కూరగాయలు తీసుకుని బైక్ పై స్వగ్రామానికి వెళ్తున్నారు. బైరాపూర్ గేట్ వద్ద సాయిలు తన బైక్‌తో ముందున్న మరో బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో కిందపడ్డ సాయిలుకు తలకు తీవ్రగాయమైంది. చికిత్స నిమిత్తం 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సాయిలు మృతిచెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో బుధవారం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనం రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు. కామారెడ్డి కలెక్టరేట్ ప్రాంతంలో 11 మిల్లీమీటర్లు, బీబీపేటలో 3.5, సదాశివనగర్ లో 3.3, పాతరాజంపేట 3, మాచారెడ్డిలో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని మిగితా ప్రాంతాల్లో 41 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.
Sorry, no posts matched your criteria.