India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ సమన్వయకర్తలను నియమించింది. కోరుట్లకు ఎల్. రమణ, ఆర్మూర్ కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, నిజామాబాద్ అర్బన్ ప్రభాకర్‌రెడ్డి, బాల్కొండ ఎల్.ఎం.బీ రాజేశ్వర్, నిజామాబాద్ రూరల్ వి.గంగాధర్ గౌడ్, బోధన్ డి.విఠల్‌రావులను నియమించింది.
BRSకు మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేతలు BRSకు గుడ్ బై చెప్పి రేవంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. BRS నేత, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, నిజామాబాద్‌కు చెందిన మాజీ MLC రాజేశ్వర్ BRS పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు హైద్రాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆగస్టు వరకు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారో, ఉండరో అన్నారు. తాజా సర్వేల ప్రకారం రాష్ట్రంలో తాము (బీజేపీ) 12 సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. అదే జరిగితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఇక శ్రీరాముడే రక్షించాలని పేర్కొన్నారు.
నవీపేట్ మండలంలోని ఆదర్శ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న జరీనా పిర్దోస్ (48) సోమవారం గుండెపోటుకు గురై మృతి చెందినట్లు పాఠశాల ప్రిన్సిపల్ నవీన్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. లెక్చరర్ మృతిపై ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చందూర్ మండల కేంద్రానికి చెందిన మమ్మాయి గిరి (46) అనే వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై కృష్ణకుమార్ తెలిపారు. మద్యానికి బానిసైన గిరి అప్పులు చేశారు. అప్పులను తీర్చలేక చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్టు పేర్కొన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు..
బీర్కూర్ మండలం మిర్జాపూర్ గ్రామంలో సోమవారం బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని కూరగాయలు అమ్ముతున్న వ్యక్తి వద్దకు వెళ్లిన బీబీ పాటిల్ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన కూరగాయల షాపులో కొద్దిసేపు కూర్చున్నారు. కూరగాయలు కొనడానికి వచ్చిన వారిని బీజేపీకి ఓటు వేయమని కోరారు.
కామారెడ్డిలోని SLVS చిట్ ఫండ్ కంపెనీ నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు CI చంద్ర శేఖర్ రెడ్డి వెల్లడించారు. SLVS చిట్ ఫండ్ కంపెనీ పేరిట మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు అందిందని CI పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టి కామారెడ్డితో పాటు పలు ప్రాంతాల్లో రూ. కోట్లకు పైగా మోసం చేసినట్లు తేలిందని తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే KMR పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డీ వ్యాపారులపై సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు 40 చోట్ల దాడులు నిర్వహించగా 30 కేసులు నమోదు చేశామని CP కల్మేశ్వర్ తెలిపారు.వీరి వద్ద నుండి కోట్ల రూపాయలు విలువైన ప్రామిసరీ నోట్లు, పట్టా పాస్ బుక్కులు, ఏటీఎం కార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 350 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ తెలిపారు. వాటి ద్వారా 22,894 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.13 కోట్లు రైతులకు అందజేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో గన్ని బ్యాగుల కొరత లేదన్నారు. ప్రతి కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్ వేళ ఎల్లారెడ్డి మాజీ MLA కారులో డబ్బులు పట్టుబడ్డాయి. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల శివారులో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేశారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ వాహనంలో రూ.1,80,000 పట్టుబడినట్లు SI ఆనంద్ గౌడ్ తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపనందున సీజ్ చేసి కలెక్టర్ కార్యాలయంలో డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు. కారులో ఉన్న నితిన్ రెడ్డి, మనోజ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.