India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి జిల్లాలో పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా బీజేపీ మహిళా మోర్చా జిల్లా కమిటీని నియమించినట్లు జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, మహిళా మెర్చా అధ్యక్షురాలు అనిత తెలిపారు. కమిటీలో నియమించిన 25 మంది సభ్యుల పేర్లను విడుదల చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని వెల్లడించారు.
మండలానికి చెందిన ఓ బాలిక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బోధన్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో వెతకగా 10 పేజీల లెటర్ లభ్యమైనట్లు వెల్లడించారు. 4 ఏళ్ల క్రితం ఆమె తండ్రి చనిపోవడంతో మనస్తాపానికి గురైనట్లు ఆమె తల్లి పేర్కొంది.
నిజామాబాద్ నగరం, జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు. వ్యాపారుల వద్ద నుంచి అప్పు తీసుకున్న వారికి సంబంధించిన ఆస్తి పత్రాలు, చెక్కులు, ప్రామిసరీ నోట్లను సీజ్ చేశారు. పలువురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టీపీసీసీ ప్రచారకమిటీ ఛైర్మన్, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయ (86) కన్నుమూశారు. వయసుసంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివదేహాన్ని మధ్యాహ్నం ఓల్డ్ హయత్ నగర్‌లోని మధుయాష్కి స్వగృహానికి తీసుకురానున్నారు. ఇవాళ సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అంతంపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన జక్కుల నరసింహులు ఆదివారం తన వ్యవసాయ బావి వద్ద పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెలిపారు.
కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఛైర్‌పర్సన్‌గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గడ్డం ఇందుప్రియని అధికారికంగా కామారెడ్డి RDO శ్రీనివాస్ ప్రకటించారు. ఛైర్ పర్సన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్ద సంబరాలు చేశారు.
మనస్తాపంతో సౌజన్య అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పాల్వంచ మండలం వాడిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ వివరాల ప్రకారం.. సౌజన్య భర్త 6 నెలల క్రతం బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లాడు. ఫోన్లో మాట్లాడుకుంటుండగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన సౌజన్య పురుగు మందు తాగింది. కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఓ ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించారు. తాను స్కూటీపై వెళుతుంటే కారులో వెళుతున్న వారు ఢీ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారును ఆపి వారి నుంచి బలవంతంగా ఆర్సీ తీసుకుని అరగంట సేపు రచ్చ చేశాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న వన్ టౌన్ SHO విజయ్ బాబు ఆర్సీ తీసుకుని బాధితులకు అప్పగించి కానిస్టేబుల్‌ను స్టేషన్‌కు తరలించి టెస్ట్‌లు చేశారు
గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, నిజామాబాద్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. దుబాయ్‌లో ఆదివారం రాత్రి జరిగిన తెలంగాణ ప్రవాసుల ఆత్మీయ సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారన్నారు.
నిజామాబాద్ లో ఈ సారి పోటీ రసవత్తరంగా ఉండబోతుంది. గత MP ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 6.53 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. BJPకి 45.31శాతం, BRSకు 38.62 శాతం ఓట్లు వచ్చాయి. మెున్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలో BJP మూడో స్థానానికి వెళ్లినా, ఓట్ల పరంగా కాంగ్రెస్, BRSలకు దగ్గరగానే ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు బలపడటంతో త్రిముఖ పోటీ నెలకొంది. మరీ ఎవరు గెలుస్తారో చూడాలి.. దీనిపై మీ కామెంట్
Sorry, no posts matched your criteria.