India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ తొలి ఉద్యమకారుడు అతిమాముల రమేష్ గుప్తా ఆదివారం జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు, ఇటీవల BRSకి రాజీనామా చేసిన రమేష్ గుప్తా, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే KVR, జిల్లా అధ్యక్షురాలు అరుణతార, యెండల లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నక్కవార్ లక్ష్మణ్ ఆదివారం రాత్రి గుండె పోటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసినట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల గ్రామస్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు, హామీలను అమలు చేసే శ్రద్ధ ఆ పార్టీకి లేదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలను మోసం చేసిన మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని, రుణమాఫీ అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ హామీలను మరిచిపోయారని మండిపడ్డారు.
ప్రజల సంక్షేమం కోసం జహీరాబాద్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు గాంధారి మండలం గుడిమెట్ మహాదేవ ఆలయ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ తెలిపారు. ఆదివారం కామారెడ్డిలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో స్వార్థ రాజకీయాల కోసం తప్ప ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకులు లేరన్నారు. ప్రజలు తనకు ఒకసారి అవకాశం కల్పించాలని కోరారు.
అంబేడ్కర్ సాక్షిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్బంగా బీజేపీ ఎస్సి మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఎన్నికల్లో పోటీచేస్తే ఆయన్ని కుతంత్రాలతో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. అలాగే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసింది బీఆర్ఎస్ అని, వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.
కోతల సమయంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం చిన్న మావందిలో 40.3 మి.మీ, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 26.5, బిచ్కందలో 25, మద్నూర్ మండలం మేనూరులో 20 జుక్కల్ లో 10.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మార్కెట్ యార్డులు, కొనుగొలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు కన్నిటిపర్యంతమయ్యారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండా అని ఆ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నవీపేటలో ఆయన మాట్లాడుతూ.. తాను ఎంపీగా గెలిస్తే మెుదటగా బోధన్ నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తానని అన్నారు. బీదర్ -బోధన్ రైల్వే లైన్ ఏర్పాటుకు కృష్ చేస్తామని ప్రకటించారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు క్వింటాకు రూ. 15 వేల మద్దతు ధర కల్పిస్తామని జీవన్ రెడ్డి వెల్లడించారు.
క్రికెట్ ప్లేయర్లకు HYD క్రికెట్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. HCA ఆధ్వర్యంలో ఈ నెల 20న జిల్లాల వారిగా సమ్మర్ క్యాంప్ మొదలుపెడుతామని HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్‌రావు తెలిపారు. ఉచితంగానే ఈ క్యాంప్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కేంద్రాల వివరాలు:
నిజామాబాద్: 98490 73809
కామారెడ్డి: 96666 77786
ఆర్మూర్: 96405 73060
మక్లూర్ మండలం ఒడ్యాట్‌పల్లిలోని చెరువులోకి ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి వరకు తమతో సరదగా గడిపిన స్నేహితులు కళ్ల ముందే మృత్యుఒడికి చేరడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తిరుపతి (19), మహేశ్(19), నరేశ్ (18) మృతితో గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటనా స్థలి వద్ద బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. వారిని ఆపడం ఎవరితరం కాలేదు.
నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్‌రావు పల్లి జాతీయ రహదారిలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. దెగ్లూర్ పట్టణానికి చెందిన ఫిజొద్దీన్ (22), అబ్దుల్ రజాక్ (22)కు గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారి సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని వారిని హైవే అంబులెన్స్‌లో పిట్లం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
Sorry, no posts matched your criteria.