Nizamabad

News April 12, 2024

కామారెడ్డి: 53 గ్రామాల్లో తాగునీటి సమస్య

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 53 గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడనున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో నిజామాబాద్ లో 37, కామారెడ్డిలో 16 ఉన్నాయి. ఇక్కడ చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మిషన్ భగీరథ పథకం అమల్లోకి వచ్చాక బోరుబావులు, చేతి పంపులను పట్టించుకోలేదు. ఇప్పుడు వాటి అవసరాన్ని గుర్తించి పునరుద్ధరించాలని అధికారులు నిర్ణయించారు.

News April 12, 2024

నిజామాబాద్‌లో త్రిముఖ పోరు..!

image

నిజామాబాద్‌‌ లోక్‌సభ స్థానంలో ప్రధాన పార్టీలకు అభ్యర్థులు ఖరారవడంతో తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. మరో 6 రోజుల్లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో అభ్యర్థులు జనం మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాలో మూడు పార్టీల అభ్యర్థులు అర్వింద్, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.

News April 12, 2024

కామారెడ్డి: ‘సార్ నేను పెళ్లి చేసుకోను’

image

కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన ఓ బాలిక స్థానిక వసతి గృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుకుంటోంది. 2 నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన ఓ అబ్బాయి (30)తో ఆ బాలికకు కుటుంబ సభ్యులు వివాహం నిశ్చయించారు. దీంతో బాలిక పెళ్లి వద్దని తాను చదువుకుంటానని ఎంత చెప్పినా తల్లి వినలేదు. దీంతో బాలిక గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించి కన్నీరు పెట్టుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులను పిలిపించి వివరాలు సేకరించారు.

News April 12, 2024

బీర్కూర్ : సీడ్ సక్రమంగా లేకనే పంట రాలేదు :అవినాష్ రెడ్డి

image

బీర్కూర్ మండల కేంద్రంలో పంట నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించామని  సీడ్ సక్రమంగా లేకనే రైతులకు పంట నష్టం జరిగిందని కిసాన్ కేత్ రాష్ర్ట అధ్యక్షుడు అవినాష్ రెడ్డి ఆరోపించారు. గురువారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్లో ఆయన మాట్లాడారు. బీర్కూర్‌లోని గ్రోమోర్‌కు చెందిన ఓ షాప్లో ఆర్కె సోనా విత్తనం రైతులకు అమ్మారని,  ఈ సీడ్ సక్రమంగా లేక పంట రాలేదన్నారు.

News April 12, 2024

బీజేపీ జెండా ఎగురవేయాలి: KVR

image

ఆందోల్ నియోజకవర్గం టెక్మాల్‌లో జహీరాబాద్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల ప్రభారీ అభయ్ పాటిల్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమెందర్ రెడ్డి హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయాలని వారు సూచించారు.

News April 11, 2024

నవీపేట: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

image

నవీపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోస్లి గ్రామశివారులో గల లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్‌లో గురువారం గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మృతురాలి వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే నవీపేట్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్సై యాదగిరి గౌడ్ కోరారు.

News April 11, 2024

NZB: ప్రేమ పేరుతో యువతిని మోసగించిన ఎంపీవో

image

ప్రేమ పేరుతో మోసం చేసిన MPO కటకటాల పాలయ్యాయడు. ఎడపల్లి MPOగా పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ అదేశాఖలో పనిచేస్తున్న యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి వలలో వేసుకున్నాడు. యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ఇవాలా, రేపు అంటూ దాటేశాడు. అనుమానం వచ్చిన యువతి నిలదీయడంతో పెళ్లికి నిరాకరించాడు. గత నెల 27న యువతి నగరంలోని మూడో ఠాణా పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. నిందితుడిని పోలీసులు రిమాండుకు తరలించారు.

News April 11, 2024

నిజామాబాద్ నగర మేయర్ భర్త బైండోవర్

image

నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త చంద్రశేఖర్‌ను పోలీసులు బైండోవర్ చేశారు. దండు చంద్రశేఖర్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని NZB శివారు ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వకాల్లో భాగస్వాములుగా ఉన్నారని పోలీసులు బుధవారం నిజామాబాద్ దక్షిణ మండల నాయబ్ తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. NZB నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న దండు చంద్రశేఖర్‌ను పోలీసులు రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ చేశారు.

News April 11, 2024

నిజామాబాదీలు నేడే రంజాన్

image

రంజాన్ మాసంలో 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులు నేడు రంజాన్ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. నెలవంక దర్శనం ఇవ్వడంతో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు మసీదులు, ఈద్గా మైదానాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇవాళ ఉదయాన్నే ముస్లింలు ఈద్గాలకు చేరుకోనున్నారు. నమాజ్, ప్రత్యేక ప్రార్థనలతో మసీదులు, ఈద్గాలు ముస్లింలతో కిటకిటలాడనున్నాయి.

News April 11, 2024

నిజామాబాద్: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వేసవి తీవ్రతలో నియమనిష్ఠలతో నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.