Nizamabad

News July 24, 2024

కామారెడ్డి: బోడ కాకరకాయ కేజీ రూ. 280

image

బోడ కాకరకాయలకు మార్కెట్లో భలే డిమాండ్ పెరిగింది. ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే ఈ బోడ కాకరకాయలను ఇష్టంగా తీంటారు. దీంతో బోడ కాకరకాయలకు మార్కెట్లో రేటు విపరీతంగా పెరిగిపోయింది. కేజీ  రూ.280 మార్కెట్లో అమ్ముతున్నారు. అయినప్పటికీ వాటిని పలువురు కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో బోడ కాకరకాయలు మార్కెట్లోకి వస్తాయి. మార్కెట్లో ధర ఎక్కువ ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నారు.

News July 24, 2024

సదాశివనగర్: 44వ నంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి కుంగలేదు: NHAI

image

సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామశివారులో 44 నంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి కుంగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం హైవే అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వచ్చి రోడ్డును పరిశీలించారు. రోడ్డు కుంగలేదని, ఒక ఇనుప పట్టి విరిగిందని, దాని పక్కన ఉన్న డాంబర్ వర్షపు తాకిడికి లేచిందని అధికారులు తెలిపారు.

News July 24, 2024

NZB: భూసమస్యల పరిష్కారానికి భూ ఆధార్

image

భూ సంస్కరణల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య(భూఆధార్‌)ను కేటాయించాలని, పట్టణ భూ రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. దీంతో భూసంబంధిత సమస్యలకు పరిష్కారం లభించనుంది. కామారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 3,12,987, పట్టణాల్లో 1,02,456 ఎకరాల భూమి ఉంది. నిజామాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 4,03,312 పట్టణ ప్రాంతాల్లో 2,08,800 ఎకరాల భూమి ఉంది.

News July 24, 2024

కేంద్ర బడ్జెట్.. మధుయాష్కీ గౌడ్ ఏమన్నారంటే..?

image

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై NZB మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ స్పందించారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే.. TG ప్రజలకు BJP ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ‘గుండు సున్నానా ‘ అని ప్రశ్నించారు. కేంద్రంలో BJP అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ TGకు బడ్జెట్లో అన్యాయమే జరుగుతుందని విమర్శించారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి, మిగతా రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సమంజసం కాదన్నారు.

News July 24, 2024

NZB: ఇళ్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్

image

ఇళ్లు లేని వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. PM ఆవాస్ యోజన కింద వచ్చే ఐదేళ్లకూ రూ.2.2 లక్షల కోట్లు ప్రతిపాదించింది. ఈ పథకంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి రుణాలు తీసుకునే వారికి వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రజాపాలనలో KMR 2,45,542, NZB జిల్లాల్లో 3,32,663 మంది ఇళ్ల కోసం అప్లయ్ చేసుకున్నారు.

News July 24, 2024

వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి: ప్రతిమా రాజ్

image

క్షయ వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (GGH) సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ సూచించారు. GGH లో
మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒక వేళ టీబీ నిర్ధారణ అయితే ఆందోళన చెందకుండా చికిత్స చేయించుకోవాలని సూచించారు. కాగా కేంద్ర బృందం సభ్యుడు డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ప్రతిమారాజ్ అందిస్తున్న సేవలను కొనియాడారు.

News July 23, 2024

కామారెడ్డి: వికసించిన బ్రహ్మ కమలం

image

కామారెడ్డి పట్టణంలో బ్రహ్మకమలం వికసించింది. ప్రతి ఆషాఢమాసంలో బ్రహ్మకమలం రాత్రిపూట వికసిస్తుందని రిటైర్డ్ ఉపాధ్యాయుడు శ్రీనివాస శర్మ తెలిపారు. బ్రహ్మకమలం వికసించడం ఎంతో అదృష్టంగా భావిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో బ్రహ్మ కమలం చెట్లు పెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బ్రహ్మ కమలం పువ్వును తిలకిస్తే కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుందని ఆయన చెప్పారు.

News July 23, 2024

నిజామాబాద్: నేటి వార్తల్లోని ముఖ్యంశాలు

image

*NZB: వేతన జీవులను నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్: రామ్మోహన్ రావు
*తెలంగాణ వర్సిటీలో ఏబీవీపీ ధర్నా (వీడియో)
*కేంద్ర బడ్జెట్.. NZB జిల్లాకు మొండి చేయి
*గ్యారంటీలు, హామీలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం: ఎమ్మెల్యే ధన్పాల్
*NZB: ఆ చెరువు 14 ఊర్లకు ఆదేరువు
*నిజామాబాద్: మార్ట్ లో అగ్నిప్రమాదం
*ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద
*నిజామాబాద్: మత్స్యకారుడి వలకు చిక్కిన 30 కిలోల చేప

News July 23, 2024

NZB: వేతన జీవులను నిరాశపరిచిన కేంద్రబడ్జెట్: రామ్మోహన్ రావు

image

కేంద్రబడ్జెట్ వేతన జీవులను నిరాశ పరిచిందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆదాయ పన్ను చెల్లించే మధ్యతరగతి వేతన జీవులకు ఈ బడ్జెట్‌లోనైనా కొంత ఊరట దక్కుతుందని ఆశించామన్నారు. ఐటీ స్లాబులను సవరించాలని, స్టాండర్డ్ డిడక్షన్ కనీసం లక్షకు పెంచాలనేది తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు.

News July 23, 2024

పారిస్ ఒలింపిక్స్‌కు నిఖత్.. ప్రత్యేక శిక్షణకు రూ. 91.71 లక్షలు

image

ఈనెల 26 నుంచి ఒలింపిక్స్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి. వందేళ్ల తర్వాత ఒలింపిక్స్‌కు పారిస్ అతిథ్యం ఇస్తోంది. విశ్వక్రీడల్లో భారత్ తరఫున సత్తాచాటి పతకాలు తెచ్చెందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం’ పేరుతో క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ఇందుకు రూ.470 కోట్లకు పైగా వెచ్చించింది. అయితే NZBకు చెందిన నిఖత్‌జరీన్ (బాక్సింగ్) శిక్షణకు రూ.91.71 లక్షలు ఖర్చు చేసింది.