Nizamabad

News June 13, 2024

KMR: మౌలిక సదుపాయాల కల్పన పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

image

అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్‌షిప్‌లో మౌలిక సదుపాయాల కల్పన పై అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సమీక్ష నిర్వహించారు. బిటీ రోడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మురుగు కాలువల నిర్మాణం వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు అధికారులు అంచనాలు రూపొందించాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

News June 12, 2024

గగ్గుపల్లిలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

image

ఆర్మూర్ మండలం గగ్గుపల్లి గ్రామానికి చెందిన పోషన్న (55) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోషన్న బుధవారం ఉదయం వ్యవసాయ క్షేత్రానికి పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి చూసింది. అక్కడ భర్త మృతి చెంది కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 12, 2024

NZB జిల్లా నుంచి వరంగల్‌కి డీలక్స్ బస్‌లు

image

నిజమాబాద్ జిల్లా ప్రజలకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్తగా డీలక్స్ బస్‌లను అందుబాటులోకి తెచ్చింది. నిజమాబాద్ నుంచి వరంగల్‌కు ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఆర్టీసీ అధికారులు డీలక్స్ బస్‌లను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం నుంచి డీలక్స్ బస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.

News June 12, 2024

బాన్సువాడలో వృద్ధురాలిని హత్య చేసిన దుండగులు

image

వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన బాన్సువాడలో చోటుచేసుకుంది. మండలంలోని తాడ్కోల్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల కాలనీలో బుధవారం ఓ ఇంట్లో నిద్రిస్తున్న ఉప్పెర సాయవ్వను గొంతుకోసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల సమాచారంలో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె మెడలోని బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 12, 2024

FLASH.. నిజామాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజ్ వద్ద డీసీఎంను బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కాగా, మృతులు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం మల్లుపల్లె వాసులు షేక్ అబ్దుల్లా, సయ్యద్ పైరాగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 12, 2024

సౌదీలో అనారోగ్యంతో రామారెడ్డి వాసి మృతి

image

సౌదీలో రామారెడ్డి వాసి అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యునుస్(45) బతుకుదెరువు నిమిత్తం 10 రోజుల క్రితం సౌదీకి వెళ్లారు. అక్కడ మూడు రోజులు పని చేశాడని అనారోగ్యంతో మంచం పట్టి మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి ప్రభుత్వం తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

News June 12, 2024

ఆర్మూర్‌: హత్య కేసులో యావజ్జీవ శిక్ష

image

ఇద్దరిని హత్య చేసిన కేసులో శ్రీనివాస్‌కు యావజ్జీవ శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి సునీత మంగళవారం తీర్పునిచ్చారు. వివరాలిలా.. వేల్పూర్‌కి చెందిన అనిల్‌కి ఆర్మూర్‌(M)మామిడిపల్లి వాసి శ్రీనివాస్ పరిచయమయ్యాడు. ఈక్రమంలో అనిల్ దగ్గర శ్రీనివాస్ రూ.500 అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వలేదు. 2021 NOVలో ఇద్దరికి గొడవ జరగగా శ్రీనివాస్ అనిల్‌‌, తన తల్లి రాజుబాయిని గొడ్డలితో నరికి పారిపోయాడు.

News June 12, 2024

NZB: నేటి నుంచి పాఠశాలు ప్రారంభం

image

ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవుల సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మూసి వేసిన బడులు నేటితో ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు పున: ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి సిద్ధం చేశారు. పాఠశాలల్లో చేపట్టవలసిన కార్యక్రమాలపై పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయనున్నారు.

News June 11, 2024

పిట్లం: భార్యను ఉరేసి చంపిన భర్త

image

కుటుంబ కలహాల కారణంగా భర్యను చంపేశాడో భర్త. పిట్లం మండలంలోని గద్ద గుండు తండాకు చెందిన బూలి బాయి, అంబ్రియ నాయక్ భార్యాభర్తలు. అయితే బూలి బాయికి కొన్నేళ్లుగా ఆరోగ్యం బాగా లేక భర్త పట్టించుకోలేదు. ఈ విషయంలో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో అంబ్రియ నాయక్ మంగళవారం భార్యను ఉరేసి చంపేశాడు. మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 11, 2024

KMR: ఉరేసుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

image

ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పిట్లంలో జరిగింది. మండలానికి చెందిన ప్రవీణ్ సాఫ్ట్ వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఇంటి వద్దే వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కుటుంబీకులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతికి గల కారణాలేంటో తెలియాల్సి ఉంది.