Nizamabad

News July 18, 2024

అంకాపూర్ చికెన్ తినిపిస్తావా.. బోధన్ రైతుతో CM రేవంత్

image

అంకాపూర్ చికెన్ తినిపిస్తావా? లేదా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన యువ రైతు రవిని అడిగారు. రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవితో మాట్లాడుతూ.. చికెన్ గురించి అడిగారు.

News July 18, 2024

NZB: కలెక్టర్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు

image

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో 2022 ఆగస్టులో బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో జాతీయ మానవ హక్కుల కమిషన్ తాజాగా జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఘటనలో బాధితురాలికి పరిహారం చెల్లింపులో కాలయాపన జరుగుతోందని వరంగల్‌కు చెందిన పౌర హక్కుల సంఘం ప్రతినిధి బక్క జడ్సన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక కోరుతూ కమిషన్ జిల్లా కలెక్టర్‌కు సమన్లు జారీ చేసిందని జడ్సన్ తెలిపారు.

News July 18, 2024

NZBలో కారు బీభత్సం.. చికిత్స పొందుతున్న బాలిక మృతి

image

నిజామాబాద్ నగర శివారులోని దాస్ నగర్‌లో జరిగిన <<13627996>>కారు ప్రమాదంలో<<>> గాయపడిన బాలికల్లో ఒకరైన ఈశ్వరి (13) గురువారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈరోజు మరణించింది. కాగా ఇప్పటికే ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే.

News July 18, 2024

నిజామాబాద్ జిల్లాలో మూడు రోజులు భారీ వర్షాలు

image

నిజామాబాద్ జిల్లాలో గురువారం, శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 11.5 నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా శనివారం కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

News July 18, 2024

నిజామాబాద్ జిల్లాలో మూడు రోజులు భారీ వర్షాలు

image

నిజామాబాద్ జిల్లాలో గురువారం, శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 11.5 నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా శనివారం కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

News July 18, 2024

నిజామాబాద్‌లో కాసేపట్లో DSC పరీక్ష

image

రాష్ట్ర వ్యాప్తంగా DSC పరీక్షలు గురువారం ప్రారంభమై ఆగస్టు 7వరకు జరగనున్నాయి. కాగా జిల్లాలో 640 పోస్టులకు 7వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిజామాబాద్‌లోని నాలెడ్జి పార్క్ స్కూల్‌లో 2,600 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందే రావాలని అధికారులు సూచించారు. >> ALL THE BEST

News July 18, 2024

నిజామాబాద్‌లో హత్య.. వివరాలు ఇవే.!

image

పట్టణంలోని వినాయక్ నగర్‌లో బుధవారం <<13645139>>హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. బిహార్‌కు చెందిన ఆనంద్(23) ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి బయటికి వెళ్లిన అతడు బుధవారం శవమై కనిపించాడు. ఆనంద్ పర్మిట్ రూంలో మద్యం మత్తులో ముగ్గురు యువకులతో గొడవ పడ్డినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. వారిలో ఒకరు అతడిపై దాడి చేయడంతో ఆనంద్ మృతి చెందినట్లు ఎస్ఐ పాండేరావు వెల్లడించారు.

News July 18, 2024

నిజామాబాద్ జిల్లాలో 94,010 మందికి రుణమాఫీ

image

రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం విడుదల చేసే రుణమాఫీ నిధులతో ఉమ్మడి NZB జిల్లాలో 94,010 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారీగా రైతుల జాబితాను రూపొందించారు. తొలి విడతగా NZBలో 44,469, KMRలో 49,541 మంది రైతుల ఖాతాల్లో రూ.లక్ష జమకానున్నాయి. ఈ నెలాఖరులోపు రూ.1.5లక్షల వరకు ఉన్న రుణాలు, ఆగస్టులో రూ.2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయనున్నారు.

News July 18, 2024

రైతులకు మేలు జరిగే విధంగా పనులు చేస్తా: కాసుల బాల్‌రాజ్

image

ఆగ్రోస్ సంస్థ ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా పనులు చేస్తానని రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో బాలరాజు మాట్లాడుతూ.. పోచారం శీనన్న నాయకత్వంలో బాన్సువాడ నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఈ అభివృద్ధి కొనసాగుతుందన్నారు. కొంతమంది హైదరాబాద్‌లో కూర్చొని గాలి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

News July 17, 2024

NZB: విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి

image

భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతిచెందిన ఘటన బుధవారం మూడవ టౌన్ పరిధిలో జరిగింది. నగరంలోని గాయత్రినగర్ చెందిన షేక్ మెహబూబ్(49) గౌతంనగర్ నూతన భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న మూడవ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.