Nizamabad

News July 16, 2024

KCRను కలిసిన ఆర్మూర్ BRS పార్టీ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం, BRS పార్టీ అధినేత KCRను ఆర్మూర్ నియోజకవర్గం BRS పార్టీ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి పలు అంశాలపై చర్చించామని రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

News July 16, 2024

సీఎం సమీక్ష సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

image

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొని జిల్లా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. రూరల్ వైద్యులను ప్రోత్సాహించేలా ఎక్కువ పారితోషికం ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్‌కు సీరియల్ నంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలి ఆదేశించారు.

News July 16, 2024

NZB: బీజేపీ, బీఆర్ఎస్‌ కుమ్మక్కయ్యాయి: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

image

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆరోపించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. ఆ రెండు పార్టీలు కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ కొన్ని రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ఎవరితో సంప్రదింపులు చేస్తున్నారో తమకు తెలుసన్నారు.

News July 16, 2024

నిజామాబాద్: పంచాయతీ కార్మికులకు తీపి కబురు 

image

ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. జిల్లాలోని 1,056 పంచాయతీల్లో పనిచేస్తున్న 2,909 మంది మల్టీపర్పస్ కార్మికులకు రూ.5.79కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికుల ఖాతాలో నగదును వెంటనే జమ చేయాలని పేర్కొంది. కార్మికులు వేతనాల కోసం నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

News July 16, 2024

నిజామాబాద్: పంచాయతీ కార్మికులకు తీపి కబురు 

image

ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. జిల్లాలోని 1,056 పంచాయతీల్లో పనిచేస్తున్న 2,909 మంది మల్టీపర్పస్ కార్మికులకు రూ.5.79కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికుల ఖాతాలో నగదును వెంటనే జమ చేయాలని పేర్కొంది. కార్మికులు వేతనాల కోసం నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

News July 16, 2024

బిక్కనూర్‌లో ఆగి ఉన్న లారీ ఢీకొన్న కారు

image

కామారెడ్డి జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బిక్కనూర్‌లోని సిద్ధిరామేశ్వర్ నగర్ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలైనట్లు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు, మిగతా నలుగురు నిర్మల్‌కి చెందిన వారిగా గుర్తించారు.

News July 16, 2024

NZB: విషాదం.. యువజంట సూసైడ్

image

యువజంట సూసైడ్ చేసుకున్న ఘటన నవీపేటలో జరిగింది. పోలీసుల వివరాలు.. పోతంగల్ మం. హెగ్డోలికి చెందిన అనిల్(28), శైలజ(24)కు ఏడాది కిందట పెళ్లైంది. కాగా తాను ఓ తప్పు చేశానని, దాన్ని భర్త క్షమించినా బంధువుల దుష్పప్రచారం తట్టుకోలేక బాసర గోదావరిలో దూకి సూసైడ్ చేసుకొంటున్నామని దంపతులు కోటగిరి SI సందీప్‌కి వీడియో పంపించారు. దీంతో పోలీసులు గాలించగా పకీరాబాద్-మిట్టాపూర్ రైలు పట్టాలపై వారి మృతదేహాలు గుర్తించారు.

News July 16, 2024

కామారెడ్డి: PGT పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలో PGT పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజేందర్ తెలిపారు. బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో ఒక్కొక్క పోస్టు ఖాళీగా ఉందన్నారు. సంబంధిత సబ్జెక్టుల్లో PG, B.Ed పూర్తి చేసిన వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈనెల 18న ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని వెల్లడించారు.

News July 16, 2024

కామారెడ్డి: ప్రజావాణిలో 127 ఫిర్యాదులు: కలెక్టర్

image

కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 127 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 66 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. వచ్చిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News July 15, 2024

కామారెడ్డి: ప్రభుత్వ న్యాయవాదిగా లక్ష్మణ్ లాయర్ నియామకం

image

బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్ రావు లాయర్ ప్రభుత్వ న్యాయవాదిగా నియామకం అయ్యారని తెలిపారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా న్యాయవాదిగా కొనసాగుతూ బిచ్కుంద కోర్టు ప్రభుత్వ న్యాయ వాదిగా నియామకం కావడం జరిగిందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఉచిత న్యాయము, సందేహాలు కల్పిస్తానని అన్నారు.