India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నవాబ్ అలీ నవాజ్ జంగ్ జయంతిని రాష్ట్ర ఇంజినీర్స్ డేగా జులై 11న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కాగా ఆయన నిజామాబాద్ జిల్లాలో నిర్మించిన కట్టడాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు, ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం ‘బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ’ని ఆయన నిర్మించారు. వాటితో పాటు అలీ సాగర్ జలాశయానికి ఆయనే నామకరణం చేశారు.
పోతంగల్ మండలం జల్లాపల్లి గ్రామంలో పోలీసులు పేకాటాడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. వారికి అందిన సమాచారం మేరకు పేకాట స్థావరం పై దాడి చేసినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. 9 మందిని అదుపులోకి తీసుకొని రూ.70,350 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. గ్రామాల్లో ఎవరైనా పేకాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాన్సువాడ మండలంలోని దేశాయ్ పేట మంచి చెడులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయుడే పాఠశాల విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో 9 మందిపై పోక్సో కేసు నమోదు చేశారు. మరిన్ని వివారాలు తెలియాల్సి ఉంది.
పంచాయతీల్లో బదిలీలు చేసేందుకు అధికారులు సన్నాహలు చేస్తున్నారు. ఒకేచోట నాలుగేళ్ల నిండిన వారందిరికి ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పుడున్న మండలం కాకుండా వేరేచోటుకు మార్చాలని ఆదేశాలు రావటంతో అధికారులు జాబితా తయారు చేస్తున్నారు. జిల్లాలో 530 పంచాయతీలు ఉన్నాయి. 464 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుండగా అందులో 150 మందికి, ఎంపీవోలు 18, సిబ్బంది 25 మంది బదిలీలకు అవకాశం ఉంది.
బీర్కూరు మండలం బరంగేడ్గి గ్రామంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన వడ్ల కృష్ణమూర్తి(36) వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల నూతన గృహాన్ని అప్పులు చేసి నిర్మించారు. అప్పులు ఇచ్చినవారు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.
2013లో ప్రమాదవశాత్తు NZB ప్రభుత్వ బీసీ బాలుర బీసీ వసతి గృహంలో నాలుగో అంతస్థు నుంచి జె. శ్రీకాంత్ పడి మృతిచెందాడు. విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని జాదవ్ పరుశురాం అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థి కుటుంబానికి వడ్డీతో కలిపి నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. నష్టపరిహారం రూ.6 లక్షలు, వడ్డీరూ.3,07,900, కోర్టు ఖర్చులు రూ.35,042 మెత్తం 9,42,842 మంజూరు చేసింది.
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసిన ఘటన నస్రుల్లాబాద్ మం.లో జరిగింది. పోలీసుల ప్రకారం.. శ్రీను, శ్రీకాంత్ అనే ఇద్దరు తమ తండ్రుల పేరిట ఉన్న ఇళ్లకు నకిలీ స్టాంపులు, పత్రాలు, రశీదులు, పంచాయతీ ధ్రువపత్రాలు తయారుచేశారు. అంతేగాక పంచాయతీ కార్యదర్శి రజిత సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఓ ఫైనాన్స్‌లో ఇద్దరు రుణాలు తీసుకొని చెల్లించకపోవటంతో సిబ్బంది ఆరా తీయగా విషయం బయటపడింది.
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులోని హైవే బైపాస్‌లో రాజధాని బస్సులో భారీ నగదు చోరీ జరిగినట్లు ఎస్సై శివానందం తెలిపారు. కొంపల్లికి చెందిన మసాలా వ్యాపారి అమీన్ అబ్దుల్ లాలా నిజామాబాద్ నుంచి రాజధాని ఆర్టీసీ బస్సులో రూ.5 లక్షల నగదుతో కొంపల్లికి వెళ్తున్నారు. తూప్రాన్ దాబా వద్ద బస్సు ఆగగా భోజనానికి దిగి వచ్చే సరికే నగదు ఉన్న బ్యాగ్ చోరీకి గురైంది.
కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బుధవారం పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. శాంతిభద్రలకు నియోజకవర్గ ప్రజలు సహకరిస్తారని ఆయన పేర్కొన్నారు.
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో పేకాటాడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి తెలిపారు. వారికి అందిన సమాచారం మేకు దాడులు నిర్వహించి పేకాటాడుతున్న వారి వద్ద 5 సెల్‌ఫోన్లు, 11,520 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. అనంతరం వారిని రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు సీఐ పురుషోత్తం, సిబ్బంది ఉన్నారు.
Sorry, no posts matched your criteria.